మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు విడిచిపెట్టరు?
భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత, భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా 'అర్బన్ నక్సల్స్'గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్లో మావోయిస్టుల ఊచకోతను










