కవిత్వం యుద్ద మైదానమే!
కొన్ని ప్రశంసాపూర్వక వాక్యాలు, మరికొన్ని ముఖస్తుతి పదబంధాలు, ఇంకొన్ని పొగడ్తతో ముంచెత్తి ఈ కవిని కవిత్వాన్ని అభినందించాలని కాదు. ఈ కవిత్వం చదువుతున్నంతసేపూ ఎదో తెలియని బాధ. ఇలా కదా చెప్పాల్సింది. ఇలా కదా మాట్లాడాల్సింది. ఇలా కదా రాయాల్సింది. నివురుగప్పిన నిప్పుకణికలతో మరిన్ని నిప్పుకణికల్ని ఇలా కదా మండించాలి అనిపించింది. ఆలోచింపజేసేలా ఈ కవిత్వం కవి నాయుడు గారి జయన్న రాశారు. తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందిన కవి. సామాన్యజనం ఈ సమాజాన్ని ఎలా చూస్తారన్నది వారి చైతన్యం మీద, స్పృహ మీద ఆధారపడి వుంటుంది. కాని కవికి ఈ సమాజం పట్ల మాత్రం బాధ్యత ఉందని










