సమకాలీనం

మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు విడిచిపెట్టరు?

భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత,  భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్‌లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా 'అర్బన్ నక్సల్స్'గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్‌లో మావోయిస్టుల ఊచకోతను
ఆర్ధికం

 అస్తవ్యస్త ఆర్థికం – మానవాభివృద్ధి  డొల్ల

భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామని పదేపదే ప్రగల్భాలకు పోతున్న మోడీ సర్కార్‌... దీనికి భిన్నంగా దేశంలో భారీగా నిరుద్యోగం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. పిల్లలకు పోషకాహారం దొరకడం లేదు. ఫారెక్స్‌ నిల్వలు హరించుకుపోతున్నాయి. వాణిజ్య లోటు పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) ఐదు మాసాల కనిష్టానికి పడిపోయింది. 2015-2023 మధ్యకాలంలో 18 లక్షల సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు (యంఎస్‌యంఇ) మూతపడి 54 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. శ్రామిక శక్తి గణనీయంగా   తగ్గింది. రుణభారం పెరిగిపోతుంది. విదేశీ నిధులు రావడం లేదు. రూపాయి మారక విలువ పడిపోయింది. ప్రజల ఆదాయాలు తగ్గడంతో ప్రజల
కథావరణం కాలమ్స్

బతక నేర్చిన ప్రపంచాన్ని చూపించిన జూకంటి జగన్నాథం కథ – ఎరుక

లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని,
ఆర్ధికం కాలమ్స్

విస్ఫోటనంలా నిరుద్యోగం, పేదరికం

నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు
మీరీ పుస్తకం చదివారా ?

మన కాలానికి లెనిన్

దు:ఖం అమితవేగంతో వీస్తుంది సూర్యుడు ప్రకాశించడు గాలి ప్రపంచమంతా నిద్రలేని బాధాగీతం పాడింది తిరగబడడం తెలిసిన ఆగాలికి కూడా నమ్మసాధ్యం కాలేదు మాస్కోలో ఒక గదిలో విప్లవానికి పుత్రుడూ జనకుడూ ఆయన ఒక వ్యక్తి సమాధిలో ఉన్నాడని.. సమాప్తి..సమాప్తి..సమాప్తి..అంటూ కవిత్వం రాసిన ప్రసిద్ద రష్యన్‌ కవి వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ. ఇది లెనిన్‌ అస్తమించినపుడు తన్నుకొచ్చిన దు:ఖాన్ని కవిత్వంగా రాశాడు, దు:ఖమొక్కటే కాదు..లెనిన్‌ జీవితాన్ని, నాయకత్వాన్ని, ఆచరణాత్మక సామ్యవాదపాలనను, తన కలలరష్యాను కార్మిక కర్షక కాంతుల్ని ఈ కావ్యం నిండా పరిచారు. ఈ వ్లదిమీర్‌ మయకోవ్‌స్కీ రాసిన వ్లదీమిర్‌ ఇల్యీచ్‌ లెనిన్‌ కావ్యం మహాకవి శ్రీశ్రీ అనువదించారు. మయకోవ్‌స్కీ గూర్చి
లోచూపు కాలమ్స్

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
మీరీ పుస్తకం చదివారా ?

విశ్వగురు బసవన్నే… ‘నమో’ కాదు..

ఈ భూమి శ్రమజీవులదని ఈ శ్రమలోనే సమాజం నిర్మితమైందని సమాజంలో కులం లేదు మతం లేదు మానవత్వమే ఈ సమాజానికి జీవనాధారం అని చాటి చెప్పిన విశ్వగురు బసవన్న.  సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోడీని విశ్వగురుగా అభివర్ణిస్తూ పోస్టింగులు పెట్టి బసవన్నను మతోన్మాదులు సాంస్కృతిక విప్లవకారుడుగా 12వ శతాబ్దంలో అసమాన తలపై కులవివక్షపై ఆధిపత్య ధోరణిపై తన ప్రవచనాలతో సాంస్కృతిక విప్లవానికి పునాదులు వేసిన మహోన్నతమైన సంస్కర్త బసవన్న.  12వ శతాబ్దంలోనే కార్మిక వర్గం నా అస్తిత్వం అంటూ ప్రకటించిన గొప్ప విప్లవకారుడు. ఆ మహనీయుడిపై ఇటీవల కాలంలో కన్నడ భాషలో బసవన్న మత్తు అంబేద్కర్ అద్భుతమైన పుస్తకం
లోచూపు కాలమ్స్

ఆధునిక తెలుగు సాహిత్య చ‌రిత్రలో విర‌సం

చ‌రిత్ర  వికాసక్రమంలోని ప్రజల అనంతమైన ధిక్కారాలను, సాహసోపేతమైన పోరాట ఆచరణల  సారాన్ని  విప్లవ రచయితల సంఘం తనలో అంతరంగీకరించుకున్న‌ది.  చారిత్రక చోదకశీలమైన మానవ కర్తృత్వమనే సారభూతశక్తిని అపూర్వరీతిలో ప్రేరేపించింది. దీని వల్ల ఆధునిక కాల్పనికత విప్లవ కాల్పనికతగా రూపాంతరం చెందింది. ఈ కోణంలో చూస్తే మిత్రుడు పాణి రాసిన 'సృజనాత్మక ధిక్కారం' అనే పుస్తకానికి నిస్సందేహంగా అత్యంత చారిత్రక ప్రాసంగికత ఉన్నదని చెప్పవచ్చు.  విర‌సం యాభై ఏళ్ల సంద‌ర్భంలో త‌ను ఈ పుస్త‌కం రాశాడు.   మామూలుగా కల్పన అనగానే అది వాస్తవంతో ప్రమేయం లేని ఊహాజనితమని చాలా మంది  అనుకుంటారు. కాని కల్పనెప్పుడూ మనిషి భౌతిక అస్తిత్వ మూలాలతో