అలనాటి రచన సాహిత్యం కాలమ్స్

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
కవి నడిచిన దారి కాలమ్స్

నిర్వాసిత వాక్యం

"కొన్నిదారులకు అడుగుల గుర్తులని దాచే అలవాటుండదు, కొన్ని అడుగులకు దారులతో అవసరం ఉండదు."  ఈ మాటని ఎప్పుడు, ఎక్కడ విన్నానో, చదివానో కూడా గుర్తు లేదు, మర్చి పోయాను. ఇప్పుడు నేను నడిచి వచ్చిన బాట కూడా అలాంటిదే. నా పుట్టుక జరిగింది అన్నదానికి, ఒక నేను మిగిలి ఉండటం తప్ప, నేను నడిచిన భూమి, పెరిగిన ఇల్లు, చదువుకున్న బడి... ఏదీ లేదు. మా ఊరు ఇప్పుడు లేదు. ఓపెన్ కాస్ట్ మింగేసింది. ఊరు ఉండాల్సిన ప్రదేశం ఓ పెద్ద మానవ నిర్మిత లోయగా మారిపోయింది.. అభివృద్ధి  అనేది ఎంత గొప్ప పదమో అంత విషాదకరమైన మాట
కథ..కథయ్యిందా! కాలమ్స్

అధివాస్తవికతను ఎంచుకొని వాస్తవికతను చెప్పిన కథ

కార్పొరేటమ్మా - రాజకుమారుడు. భరించలేని వాస్తవాలు , ఒక్కోసారి తిరగేసి చెప్తూనే తప్ప సంతృప్తినివ్వనంత , వొత్తడికి గురిచేస్తాయి. నడుస్తున్న చరిత్ర  తలకిందులతనాన్ని  భరించడమెలాగో  తెలియనప్పుడు  మనం తలకిందులుగా  నడవడమే  ఏకైక మార్గంగా అనిపిస్తుంది. అప్పుడు కార్పొరేటమ్మా - రాజకూమారుడు లాంటి  అధివాస్తవిక కథలే  వస్తాయి. అధివాస్తవికత , వ్యంగం , వాస్తవికత మూడూ ఒకే కథలో  కథనమై కన్పిస్తాయి. ఆ  కలగాపులగపు  కథనం , యేది వాస్తవమో , యేది అధివాస్తవమో తేల్చుకోమని  పాఠకులకు  సవాళ్ విసురుతుంది. ఒక కథ   మొత్తం కథనం  ఒక రకమైన  ధోరిణిలో నడవడానికి , చదవడానికీ అలవాటు పడ్డాం కదా  ,
సమకాలీనం

ఉత్తరాఖండ్‌లో ఖలంగా అడవి కోసం యువత, అడ్డుకున్న “దేశ భక్త” గుంపు

వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ జరుగుతున్న ఈ కాలంలో, మరిన్ని చెట్లను నాటాలని, అడవులను కాపాడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న సమయంలో   నగరం పక్కనే ఉన్న మరో అడవిని నాశనం చేయడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఈసారి  దట్టమైన సాల్ చెట్ల  ఖలంగా కొండల అడవి వాళ్ళ  లక్ష్యం. ఇక్కడ సౌంగ్ నది తాగునీటి పథకానికి సంబంధించిన నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏటా రెండు వేల చెట్లను నరికివేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  నరకబోయే చెట్లకు ఇటీవల గుర్తులు కూడా పెట్టారు. గుర్తు పెట్టడం అంటే నరకబోయే చెట్లకు గుర్తుగా గొడ్డలితో
ఆర్ధికం కాలమ్స్

అసమానతల భారతం

'మన ప్రజాస్వామ్యం మేడిపండు... మన దరిద్రం రాచపుండు' అన్నాడోక కవి. ఆయన మాటలు అక్షర సత్యాలు. ఎందువల్లనంటే ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత కూడ భారతదేశంలో పేదరిక నిర్మూలన సాధ్యం కాలేదు. ప్రభుత్వాలు ఎన్ని మారినా శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా  సామాన్యుల బతుకులు మారడం లేదు. దేశాన్ని దశాబ్దాలు పరిపాలించిన పార్టీలు దేశ సంపదను దోచుకుని విదేశాలకు తరలించడం, స్విస్‌ బ్యాంకుల్లో వేల కోట్ల నల్లధనాన్ని దాచిన జాతీయ నాయకులు మళ్లీ ప్రజలలోకి వచ్చి దేశానికి సేవ చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారు. గత పాలకుల శాపమే నేటికీ పేదరికం వేధిస్తున్నదని
కవి నడిచిన దారి కాలమ్స్

ఒక్కడుగు

అసలింకా నడవాల్సిన దారి తెల్సిందా ? ఈలోగానే ‘నడచిన దారంటే' దేన్ని గురించి రాయమని ? ఎంతో కలసివస్తే (?) తప్ప, వయసెప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. స్థిర చరాస్థులు; వాటికోసం చేసే అప్పులూ, కట్టే వడ్డీలు. కుటుంబ సభ్యులు, స్నేహితులు; పండుగలూ, పబ్బాలూ, ఫంక్షన్లూ, దర్బార్లూ, జబ్బులూ, మందులూ, ఒకటేమిటి ? అన్నీ పెరుగుతాయి. వీటి మధ్య గడుస్తున్న కాలమే నన్ను నడిపిస్తున్న దారా ? అలా అని, తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళనట్లేదు. దారంటే; అసలేం తెలియకుండా వేసిన తొలి అడుగు. తెలిశాక ఆగలేని బ్రతుకు. ఏం ? నువ్వే ఎందుకు రాస్తావు కవిత్వం ? నిన్నే
ఓపెన్ పేజీ

వాళ్లు తాలిబాన్ల‌కంటే భిన్నంగా ఉన్నారా?

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం వారి మునుపటి పాలన జ్ఞాపకాలను తాజా చేసింది. ఆ సమయంలో తాలిబాన్లు షరియాకి తమ సొంత పద్ధతిని, మహిళలపై భయంకరమైన అణచివేతను అమలు చేశారు. వారు  పురుషులను కూడా విడిచిపెట్టలేదు. పురుషులకు ప్రత్యేక దుస్తులు, గడ్డం తప్పనిసరి చేసారు. బమియాన్‌లోని గౌతమ్ బుద్ధ భగవానుని పురావస్తు ప్రాముఖ్యత కలిగిన విగ్రహాలను కూడా తాలిబాన్లు కూల్చివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్‌లను భారతీయ ముస్లింలలో ఒక చిన్న విభాగం స్వాగతించింది. వారి దృష్టిలో ఇది విదేశీ ఆక్రమణదారులపై ఇస్లాం విజయం. ఈ పరిణామంతో చాలా మంది ముస్లింలు, ముఖ్యంగా ముస్లిం
లోచూపు

అంబేద్కర్ అస్తిత్వవాది కాదు -అచ్చమైన దేశీయ ఆధునికతా వాది

భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్. అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక 'నాగరిక' సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో
సమకాలీనం కాలమ్స్

అమెరికా నిష్క్రమణ దేనికి సంకేతం?

రెండు దశాబ్దాల క్రితం ఉగ్రవాదం అణచివేత పేరుతో ఆఫ్ఘన్ నేల పై అడుగుపెట్టిన అమెరికా అవమానకరమైన రీతిలో తట్టా బుట్టా సర్దుకొని విమానమెక్కి ఉడాయించింది. రెండేళ్లుగా తనకు ఏ ప్రమాదం తలపెట్టకుండా వెళ్లనీయండoటూ తాలిబాన్ లతో రహాస్యంగా దోహలో మొదలైన చర్చలు పరిపూర్ణం కాకుండానే తానే విధించుకున్న గడువు ముంచుకు రావడంతో వియత్నాం ను విడిచివెళ్లిన చారిత్రక దృశ్యాలను ప్రపంచానికి మరోసారి గుర్తుకు చేస్తూ మరీ నిష్క్రమించింది అమెరికా. ఉగ్రవాదాన్ని అణచడమే మా పని.. జాతి నిర్మాణం కాదని ఇప్పుడు అంటోంది.  1980 తొలినాళ్లలో సోవియట్ సేనలను ఎదుర్కొనేందుకు తానే నాటిన ఛాందస బీజాలు నేడు పెరిగి పెద్దయిన
కాలమ్స్ ఆర్థికం

అవినీతి, దోపిడీల‌ను పెంచే క్రోనీ క్యాపిటలిజం

ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడ అనేక రూపాలలో కొనసాగుతుంది. అందులో ఒకటి క్రోనీ క్యాపిటలిజం. (ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం) అని మనం పిలుస్తున్నాం. ఆసియా టైగర్‌గా పిలువబడే నాలుగు దేశాలు దక్షిణ కొరియా, తైవాన్‌, సింగపూర్‌, హాంకాంగ్‌ దేశాలు వేగంగా పారిశ్రామికీకరణ చెంది 1960-96 వరకు సంవత్సరానికి 7 శాతానికి పైగా ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించాయి. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐయంఎఫ్‌) సంస్థలు ఆ దేశాల అభివృద్ధి తీరును బాగా శ్లాఘించాయి. అయితే 1997లో ఆసియా టైగర్‌ దేశాల ద్రవ్యవ్యవస్థ ఒకేసారి కుప్పకూలింది. అయితే ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌లు ఆసియా టైగర్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు