కాలమ్స్ ఓపెన్ పేజీ

అందోళనాజీవుల కాలమిది

హిందుత్వ ఫాసిజమనే విష వృక్షం రోజు రోజుకు తన వేర్లను సమాజ లోతుల్లోకి చొప్పించి తన పునాదిని గట్టిపర్చుకుంటుంది. తన శాఖలను విస్తరించుకుంటూ పాలనా, చట్టం, న్యాయం, మీడియా అన్నింటిని తన నీడ కిందికి తెచ్చుకుంటుంది. మన సమాజంలో చారిత్రకంగా (వందల సంవత్సరాలుగా) అనేక రూపాలలో కొనసాగుతున్న అధిపత్య భావనలు (కుల దురాహంకారం, పితృస్వామ్యం, మత పెత్తనం)  హిందుత్వ విష వృక్షపు వేర్లకు సత్తువనిస్తున్నాయి. ఆ విష వృక్షం ఈ రోజు దోపిడీ కుల, వర్గాల అండదండలతో అధికారం చేజిక్కించుకొని తన ఫాసిస్టు నిజ స్వరూపాన్ని నగ్నంగా ప్రదర్శిస్తుంది. అయితే ఈ రోజు కాకపోతే రేపు ఆ విష
కాలమ్స్ సమకాలీనం

సైన్స్ పరిశోధనా సంస్థకు ఫాసిస్టు పేరా!

ప్రపంచంలో చాలా దేశాలలో ఆయా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారి పేర్లను సాధారణంగా వారి మరణానంతరం ఆయా సంస్థలకో లేదా మరో రంగానికో వారి పై గౌరవంతోనో వారికి గుర్తింపు గానో పెట్టడం జరుగుతుంది. భారతదేశంలోను ఆ ఆనవాయితి కొనసాగుతున్నది. పాలక వర్గాలు మారినప్పుడల్లా వారి భావజాల ప్రతినిధుల పేర్లను ఎక్కడో ఒక చోట తగిలించడం అలవాటు చేసుకున్నారు. ప్రజాజీవితంలో ఉండి వారి ప్రయోజనాలకు పాటుబడిన వారిని అలా గుర్తుంచుకోవాలంటే పేచీ ఏమి ఉండదేమో గాని మొత్తంగా వారి జీవితకాల ఆచరణకు పొసగని లేదా విరుద్ధమైన రంగాలకు వారి పేరు పెట్టడం చాలా కాలం క్రితమే మొదలయింది.
కాలమ్స్ కథ..కథయ్యిందా!

నాన్నా కతచెప్పవూ…కథ

రాప్తాడు గోపాలకృష్ణ  నాన్నా కతచెప్పవూ , కథ రాప్తాడు గోపాల కృష్ణ ది.అతడుబయలుదేరాడు , కథా సంపుటి లోది.ఈ కథ నిద్ర పోవడానికి రాత్రుళ్లు కథలడిగే పిల్లవాడి కోరిక.బిడ్డడిని నిద్రపుచ్చడానికి ఒక తండ్రి తలకెత్తుకునే బాధ్యత.అంతకుమునుపే నిద్రపుచ్చడానికి యెన్నో కథలు చెప్పాక , నిద్రపుచ్చడంలో విఫలమయ్యాక , ఆఖరుగా యీ కథ చెబుతున్నట్టూ , దీని తర్వాత యిక కథలడక్కుండా నిద్రపోయితీరాలనే ఒప్పందంతో యీ కథను బయటికి తీసాడు, యీకథలోని తండ్రి.ఆమేరకు యిది కథలోని కథ.ఈకథ చెప్పడంలో తండ్రి కి ఒక లక్ష్యం వుంది.అలాగే యీ కథలల్లుతున్న కథకుడికీ లక్ష్యముంది.అది రెండంచుల కత్తిలాంటి లక్ష్యం.ఆ కథలోని కొడుకును నిద్రపుచ్చడమనేది
కాలమ్స్ ఆర్ధికం

పారుబాకీలతో బ్యాంకింగ్ వ్యవస్థలో సంక్షోభం

భారతదేశంలో అధికార బదిలీకి ముందు, తర్వాత ప్రైవేట్‌ బ్యాంకుల చరిత్ర అంతా అక్రమాలతో, మోసాలతో ముడిపడి ఉంది. వలసపాలన కాలంలో దేశంలో ఏర్పడిన ప్రైవేట్‌ బ్యాంకులు ప్రజల వద్ద నుండి వసూలు చేసిన డిపాజిట్లను తమ స్వప్రయోజనాలకు వినియోగించుకున్నాయి. ఆనాటికి ఉన్న 600 బ్యాంకులు పెద్ద పరిశ్రమలకు, వాణిజ్య వర్గాలకు పరిశ్రమల నిర్మాణం, వర్కింగ్‌ కాపిటల్‌, ఇతర అవసరాలకు రుణాలు ఇస్తుండేవి. చిన్న వృత్తులు, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు తదితరాలకు రుణాలు అందేవి కాదు. తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించకపోవటం, వసూలుపై బ్యాంకులు తగినంత శద్ధ పెట్టకపోవటం, రుణాలు తీసుకున్న సంస్థలు చేసే మోసాలలో బ్యాంకులు కూడా భాగస్వాములు
కాలమ్స్ కొత్త కవిత్వం

కవిత్వం – వస్తు రూప విశ్లేషణ

కాలంతో పాటు కవితా రచన ప్రయాణం చేస్తున్నదా, లేదా కవిత్వం మానవ వ్యక్తీకరణను నమోదు చేయడంలో తడబడుతున్నదా. నిజానికి కవులు అక్షరాస్యులేనా? వర్తమానంలో నిలబడి కవిత్వం రాస్తున్నవారు పునాది అంశాలను తడుముతున్నారా? ఇవన్నీ కవితా రచనను లోతుగా గమనిస్తున్న వారికి ఎదురయ్యే సందేహాలు. కాలంతో పాటు మానవ జీవితంలో అనేక సంక్లిష్టతలు వచ్చి చేరాయి.పాలక వర్గం ప్రచారం చేస్తున్నట్లు నూత్న అభివృద్ధి నమూనాలో మానవుడి పరిమితులు విశాలత్వం మధ్య సంఘర్షణ వున్నది. అందివచ్చిన అవకాశాలు జీవితంలో వుండే సుఖలాలస కవితా సృజనలో వ్యక్తమవుతుంది. సృజనాత్మక తలంపై కవి జీవితంలోని ఘర్షణను అనువదించుకోకపోతే కళాత్మక వ్యక్తీకరణకు పరిమితి ఏర్పడుతుంది.రచనకు ,
కాలమ్స్ బహుజనం

ఉద్యమగీతం

రజ్మియా అంటే ఉద్యమగీతం. తెలంగాణ ముస్లింకవులు తెలుగులో,ఉర్దులో రాసిన కవితల సంకలనం ఈ పుస్తకం. దీనికి సంపాదకుడు స్కైబాబ(ఎస్.కె.యూసుఫ్ బాబ). ’నసల్’కితాబ్ ఘర్,తెలంగాణ ముస్లిం రచయితల వేదికలు ఈ పుస్తకాన్ని ప్రచురించాయి. అక్బర్,ఫవాద్ తంకానత్ లు తెలుగు,ఉర్దులలో ముఖచిత్రాలు గీశారు. తెలుగులో 36 మంది(75 పేజీలు), ఉర్దులో 31మంది(68పేజీలు) కవుల కవితలతో కూడిన పుస్తకామిడి.డిసెంబర్ 2012 లో పుస్తక ప్రచురణ జరిగింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆ నేపథ్యంలో రాసినవే ఇందులోని కవితలన్నీ. ఈ పుస్తకంలోని కవితలలో విభిన్న ఇతివృత్తాలను కవులు ఎంపిక చేసుకున్నారు. ప్రాథమికంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం చుట్టూ తిరిగినా,కవితల్లో
కాలమ్స్ అలనాటి రచన

ఓ బాలిక డైరీ

మూలం: ఆన్ ఫ్రాంక్                                           తెలుగు అనువాదం: బీనా దేవి ప్రపంచంలోనే మహా నియంత. ఎటువంటి నేరమూ చేయని లక్షలాది యూదు జాతీయులను కేవలం ‘యూదులుగా పుట్టడమే వాళ్ళ నేరమని’ భావించి, మారణహోమం చేయించిన నర రూప రాక్షసుడు అడాల్ఫ్ హిట్లర్. అతను పరిపాలిస్తున్న కాలంలో, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఒక ఇంట్లో అటక లాంటి భాగంలో తన కుటుంబంతో సహా  గడిపిన  ఒక యూదు బాలిక ఆన్ ఫ్రాంక్.  జర్మన్ లో ఫ్రాంక్ ఫర్డ్ నగరంలో 1929 జూన్ 12 వ తేదీన పుట్టింది ఆన్ ఫ్రాంక్. తండ్రి ఒట్టో ఫ్రాంక్. తల్లి
కాలమ్స్ లోచూపు

భూమి,సంస్కృతి,నాగరికత

నేటి అర్ధ వలస,అర్థ భూస్వామ్య సామాజిక వ్యవస్థలో ఈ దేశం పట్ల పాలకవర్గాల దృష్టికోణం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజానుకూలంగా ఉండదు. ఒకప్పుడు గురజాడ ‘’దేశమంటే మట్టి కాదోయ్/ దేశమంటే మనుషులోయ్’’ అనంటే, నేటి పాలకులు దేశమంటే మట్టి మీద బతికే మనుషులు కాదు, ఆ మట్టి చుట్టూ పాతిన సరిహద్దులు, ఆ మట్టి కింద ఉన్న ఖనిజ వనరులేనని భావిస్తున్నారు. వాటిని తెగనమ్మి, పెట్టుబడిదారీ అభివృద్ధివైపే పాలకులు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ అభివృద్ధిలో ప్రజల నిజమైన అస్తిత్వ అభివృద్ధికి, జ్ఞానచైతన్యాల అభివృద్ధికి ఏ మాత్రం చోటు లేదు.ఉన్నదల్లా పెట్టుబడి వృద్ధియే. మనదేశంలో రైళ్ల విస్తరణ వల్ల సాపేక్షికంగా