మీరీ పుస్తకం చదివారా ?

కనిపించని డైరీలో కవిత్వపు అంతరంగం

"ఇక మాటలు అనవసరం. కార్యశూరత్వం చూపాలి. సమాజం కోసం విప్లవాత్మక దృక్ఫథంతో రచనలు చేయాలి"-మహాకవి శ్రీశ్రీ(ఖమ్మంలో 8`10`1970న విరసం తొలిమహాసభల సందర్భంగా నిర్వహించిన ప్రతినిధుల సభలో..) నేటితరం కవులు అనివార్యంగా వర్తమాన సమాజంలో జరుగుతున్న అన్యాయాలూ, ఆక్రంధనలు, అత్యాచారాలులాంటి ఘటనలే కాక ప్రతీ సామాజిక దురాగతాలు, అసమానతలూ, దోపిడీ, ప్రపంచీకరణ, కార్పోరేటీకరణ లాంటి ప్రతి దుర్మార్గాన్ని ఎండగడుతూ కలమెత్తుతున్నారు. సామాజిక మాధ్యమాలొచ్చాక కవిత్వపు కాన్వాసు మరింత విశాలంగా మారింది. ఎలా రాస్తున్నారనో ఏం రాస్తున్నారనో విషయాన్ని ఆలోచిస్తే ఖచ్చితంగా సమాజం గూర్చైతే ఆలోచిస్తున్నారు. ఇటీవం కవిత్వంలోకి  మహిళలు వరదలా వస్తున్నారు..ఇది గొప్ప పరిణామం..అలా అనుకుంటున్న క్రమంలో ‘‘ నాడైరీ
క్యా చల్రా .? కాలమ్స్

సంస్కరించుకోకపోతే తాలీబన్లను కూడ తరిమేస్తారు

  1. ఇస్లామిక్ దేశాలు తరచూ వివాదాల్లో వుంటుంటాయి దేనికి? ఆఫ్ఘనిస్తాన్ పరిణామాల నేపథ్యంలో దీనిని వివరిస్తారా? సామ్రాజ్యవాద దేశాలు తరచూ ఇస్లామిక్ దేశాల్ని వివాదాల్లోనికి లాగుతుంటాయి. మనం దాన్ని తలకిందులుగా అర్థం చేసుకుంటుంటాము. భూగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక విషయం సులువుగా అర్థం అవుతుంది. ముస్లిం దేశాల్లో చమురు, ఆదివాసులు సంచరించే నేలల్లో ఖనిజ నిక్షేపాలున్నాయి. ఇవి రెండూ సామ్రాజ్యవాద దేశాలకు కావాలి. చంపదలిచిన కుక్కను పిచ్చిదని ప్రచారం చేయాలనే ఉపాయం ఎలాగూవుంది. ముస్లింలు, ఆదివాసుల్ని అనాగరికులుగా ప్రచారం చేయడం సామ్రాజ్యవాదుల ఆర్థిక అవసరం. ఆదివాసులు కొండలు, లోయలు, అడవుల్లో నివశిస్తారని మనందరికీ తెలుసు. కానీ,
క్లాసిక్స్ ప‌రిచ‌యం కాలమ్స్

కుటుంబం – సొంత ఆస్తి – రాజ్యాంగ యంత్రం -2

కుటుంబంమోర్గాన్ ఈనాటి న్యూయార్కు లో నివసిస్తున్న ఇరాక్యూ ఇండియన్ల మధ్య తన జీవితంలో అధిక భాగాన్ని గడిపాడు. వారి తెగలలో ‘సెనేకా’ అనే తెగకు దత్తు పోయాడు కూడా. వారిలో ఒకవిధమైన దంపతీ వివాహ పద్దతి [ఒకభర్తా, ఒకభార్య] అమలులో వుంది. అయితే, ఈ బంధాన్ని సులువుగా తెంచేసుకోవచ్చు. దానికి ఆయన ‘జంట కుటుంబం’ అని పేరు పెట్టాడు.[జంట కుటుంబం అనేదానికి వేరే అర్ధం కూడా వుంది. అది తర్వాత చూస్తాం] వారికి కలిగిన సంతానం ఏ జంట తాలూకా పిల్లలో అందరికీ తెలుస్తుంది. అలాగే గుర్తిస్తారు కూడా. తల్లీ, తండ్రీ, కొడుకూ, కూతురూ, తోబుట్టువూ, తోడ బుట్టిన
సమకాలీనం కాలమ్స్

వరికపూడి సెల (దమ్మర్ల గొంది) ప్రాజెక్టును  నిర్మించాలి

పల్నాడు జిల్లాలో ఒకవైపు కృష్ణానది పరవళ్ళు  తొక్కుతున్న  దాని అతి సమీపంలో ప్రజలు త్రాగునీరు సాగునీరు లేక  వలసలు పోతున్నరు, పశువులకు నీళ్లు దొరకని ప్రాంతం కూడా ఎగువ పల్నాడు లోని వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి మండలం, ప్రకాశం జిల్లా పుల్లల  చెరువు, ఎర్రగొండపాలెం  ప్రాంతాలు, 1944 ప్రాంతంలో నందికొండ  ప్రాజెక్టు కోసం ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది, 1954లో నందికొండ ప్రాజెక్టు (నాగార్జునసాగర్ ) నిర్మాణం సందర్భంగా  కోస్ల  కమిటీ వెల్దుర్తి, దుర్గి,మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు తదితర మండలాలు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతుండడంతో దీనికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేయాలని సూచించారు.
అలనాటి రచన కాలమ్స్

రాజూ-పేదా

మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని 
లోచూపు కాలమ్స్

ప్రేమమయి, సాంస్కృతిక వారధి

(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో
ఆర్ధికం కాలమ్స్

మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలు

మూడు దశాబ్దాల‌ క్రితం ప్రవేశపెట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు వృద్ధిని పెంచాయి కాని ఉపాధిని పెంచలేదు. సంపద పెరిగింది కాని పంపిణీ జరుగలేదు. పెట్టుబడులు పెరిగాయి కానీ అవి ఉత్పత్తి రంగంలో కాకుండా సేవా రంగాల్లోకి వెళ్లాయి. ఆర్థిక సంస్కరణల తదుపరి పలు ప్రభుత్వ రంగాల నుంచి తన వాటాను ఉపసంహరించుకుంటున్న కారణంగా ప్రభుత్వ రంగంలో ఉపాధి సన్నగిల్లింది. ఫలితంగా రిజర్వేషన్‌ సదుపాయం అట‌కెక్కింది. సామాజిక న్యాయం పాతాళానికి తోయబడింది.  మరోవైపు ప్రభుత్వమే కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానాలకు ఒడిగట్టడంతో తక్కువ వేతనాలకు కార్మికులు పనిచేస్తున్నారు. దేశ ప్రగతిని మానవాభివృద్ధిలో కాకుండా ఆర్థిక వృద్ధితో అంచనా వేస్తున్నారు.
విశ్లేషణ కాలమ్స్

బస్తరును కాపాడుకుందాం

ప్రొఫెసర్‌ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్‌ నుంచి విజయవాడ బుక్‌ ఫెయిర్‌ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత
లోచూపు కాలమ్స్

కుల గుట్టును రట్టు చేసిన కథలు

సుమారు మూడు దశాబ్దాల క్రితం  తెలుగునాట తలెత్తిన అస్తిత్వ ఉద్యమాలు వివిధ అస్తిత్వాల సమస్యలపై ప్రత్యేక అధ్యయనాలను ప్రేరేపించాయి. ఆయా సమస్యల మూలాలను పునఃపరిశోధించడం, సరికొత్త పరిష్కార మార్గాలను కనుగొనే ప్రయత్నాలూ  ముమ్మరమయ్యాయి. అలాగే వర్గపోరాట పద్ధతులను, ఫలితాలను పునఃసమీక్ష చేసుకునే చారిత్రక అనివార్యతను కూడా అవి సృష్టించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే- ఆయా సామాజిక అస్తిత్వ బృందాలు ‘తనలో తానుగా’ ఉన్న స్థితినుండి ‘తన కోసం తానైన’ స్థితి లోకి  మారడంగా ఆ అస్తిత్వవాద ఉద్యమాలను అభివర్ణించవచ్చు. ఈ నేపథ్యంలోంచి చూసినప్పుడు, దళితవాద ఉద్యమం గాని దళితవాద సాహిత్యం గాని లేవనెత్తిన విషయాలన్నీ ఆహ్వానించదగ్గవే. సామాజిక వాస్తవికతలో
కాలమ్స్

అతడు వెలిగించిన దారిలో…

“పూలు రాలిన చోట పుప్పొడి వెదజల్లబడే ఉంటుంది పుప్పొడి నెత్తురులోంచి పిడికిలి తేటగా తేరుకునే ఉంటుంది”             2016లో రామడుగు అమరత్వం నేపథ్యంలో రాసిన ఈ కవిత “పూలు రాలిన చోట” అనే నా రెండవ కవితా సంకలనం లోనిది.             కలం పిడికిలి పట్టుకొని కవిత్వం దారి గుండా ఇవాల్టి వరకు నడిసొచ్చాను. నడిచానా? నన్నెవరైనా నడిపించారా? అని నన్ను నేను ప్రశ్నిచుకొని కాస్త వెనుదిరిగి జ్ఞాపకాల రుచి చూస్తూ పోతే కొన్ని తీపిగా ఇంకొన్ని చేదుగా మరికొన్ని వగరుగా ఇలా ...             మాది వరంగల్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. పేదకుటుంబం. ముగ్గురు అన్నదమ్ముల్లో