సాహిత్యం లోచూపు

బ్రాహ్మణవాదం-  విమర్శనాత్మక  ప‌రిశీల‌న‌

కేర‌ళ‌కు చెందిన మావోయిస్టు మేధావి ముర‌ళీధ‌ర‌న్‌(అజిత్‌, ముర‌ళి) ఇంగ్లీషులో రాసిన క్రిటికింగ్ బ్రాహ్మ‌ణిజం  పుస్త‌కానికి  చాలా గుర్తింపు వ‌చ్చింది. దీన్ని విర‌సం బ్రాహ్మ‌ణ‌వాదం, మార్క్సిస్టు విమ‌ర్శ అనే పేరుతో తెలుగులో గ‌త ఏడాది అచ్చేసింది. బ్రాహ్మ‌ణ‌వాదం ఒక ఆధిక్య భావ‌జాలంగా, సంస్కృతిగా ప‌ని చేస్తున్న తీరు మీద ఈ పుస్త‌కంలో అజిత్ కేంద్రీక‌రించారు. బ్రాహ్మ‌ణ‌వాదాన్ని అర్థం చేసుకోడానికి ఇప్ప‌టి దాకా వ‌చ్చిన పుస్త‌కాల కంటే చాలా భిన్నమైన ఆలోచ‌న‌లు, ప‌రిశీల‌న‌లు, సూత్రీక‌ర‌ణ‌లు ఇందులో ఉన్నాయి.  బ్రాహ్మణవాదం  బ్రాహ్మణులకు, హిందువులకు మాత్రమే సంబంధించినది కాదు. అది సమాజంలోని అన్ని వర్గాలను, మత సమూహాలను ప్రభావితం చేస్తున్న సజీవ ప్రతీఘాతుక పాలకవర్గ
కాలమ్స్ కవి నడిచిన దారి

నా కవిత్వం ఒక నినాదం

నా కవితా ప్రస్థానం వలసలో మొదలైంది. అప్పటి వరకూ అంటే 1993 నాటకి నా ఇరవై మూడేళ్ళ జీవితంలో సీరియస్ సాహిత్యం తో పరిచయం తక్కువ. కొంత శ్రీశ్రీ, కొంత తిలక్, కొంత ఠాగూర్ గీతాంజలి తప్ప కవిత్వం అంటే సినిమా సాహిత్యం గా పరిగణించేవాణ్ణి. మా తెలుగు మాస్టార్లు పలికించిన పద్యాల ప్రతిపదార్థాలు కూడా బట్టీయం వేసినవే కానీ సిరీయస్ గా చదివినవి కావు. కాకపోతే హిందీ పాటలు ( చాలామందికి తెలియదు కానీ అందులో ఉర్దూ భాషే ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ముస్లీం ఉర్దూ కవుల ప్రభావం) వినేవారికి ఎంతో కొంత కవిత్వం లోపలికి
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

రామానుజుడు-ఆయ‌న స‌మ‌త‌

క్రీశ 1017-1137 మ‌ధ్య జీవించిన రామానుజుడికి ముందే విశిష్టాద్వైతం ఉంది. దాన్ని ఆయ‌న  తాత్వికంగా, ఆచ‌ర‌ణాత్మ‌కంగా వ్య‌వ‌స్థీకృతం చేశాడు. రామానుజుడు రంగం మీదికి వ‌చ్చేనాటికి ఉన్న  చారిత్ర‌క , తాత్విక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆయ‌న *స‌మ‌తా వాదాన్ని* కీర్తించడం వ‌ల్ల ప్ర‌యోజ‌నం  ఏమీ ఉండ‌దు.  రామానుజుడి విశిష్టాద్వైతానికి ముందు ఆదిశంక‌రుడి అద్వైతం బ‌లంగా ఉండింది.  *బ్ర‌హ్మ స‌త్యం- జ‌గం మిధ్య* అనేది ఆయ‌న ప్ర‌ధాన సిద్ధాంతం. దీన్నుంచే త‌త్వ‌మ‌సి అనే భావ‌న‌ను తీసుకొచ్చాడు.  ప‌ర‌బ్ర‌హ్మ‌వు నీవే. ఈశ్వ‌రుడు, మాన‌వుడు(ఆత్మ‌) వేరే కాదు. రెండూ ఒక‌టే అనేది అద్వైతం.  జ‌గం మిధ్య అన‌డంలోని అద్వైత మాయావాదాన్ని రామానుజుడు అంగీక‌రించ‌లేదు. 
కాలమ్స్ లోచూపు

ప్రగతిశీల శ‌క్తుల ముందుకు చ‌ర్చా  ప‌త్రం

          “సంస్కృతి-మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం” అనే విర‌సం 28వ మ‌హా స‌భ‌ల సంద‌ర్భంగా పాణి రాసిన  కీనోట్ పేపర్  ఒక అవ‌స‌ర‌మైన  చ‌ర్చ‌లోకి  ప్ర‌గ‌తిశీల శ‌క్తుల‌ను ఆహ్వానిస్తున్న‌ది.  ప్రత్యామ్నాయ ప్రజా సంస్కృతీ నిర్మాణం గురించి ఆలోచించేవాళ్లంద‌రూ దీన్ని చ‌ద‌వాలి.  ఇందులోని విష‌యాల‌ను  ప‌ట్టించుకోవాలి. ఇందులో ప్ర‌తిపాదిస్తున్న‌విష‌యాల మంచి చెడ్డ‌ల‌ను ప‌రిశీలించ‌డానికి, వాటి శాస్త్రీయ‌త‌ను అంచ‌నా వేయ‌డానికి, వాటిని ముందుకు తీసికెళ్ల‌డానికి త‌ప్ప‌క  చ‌ద‌వాల్సిన పేప‌ర్ ఇది. సకల ప్రగతిశీల పోరాటాల సమన్వయానికి సాంస్కృతిక కోణం అవ‌స‌రం. దానికి సంబంధించిన అనేక  స‌ర‌ళ‌మైన ప్ర‌తిపాద‌న‌లు ఈ ప‌త్రంలో  ఉన్నాయి. కొన్ని ప్ర‌తిపాద‌ల‌న‌కు వివ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి.  సామాజిక ఉత్పత్తి
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
కాలమ్స్ సమకాలీనం

ఆన్ లైన్ విద్య బోధనలో అసమానత్వం

కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో
కాలమ్స్ లోచూపు

రాజ్యాంగం – ప్రొ. శేషయ్యగారి విమర్శనాత్మక హక్కుల దృక్పథం

గతంలో రాజ్యాంగాన్ని విమర్శనాత్మకంగా చూసే దృక్పథం కొరవడినందువల్ల దాని పట్ల వ్యవహరించిన తీరు కొంత సమస్యాత్మకంగా, పరస్పర విరుద్ధంగా ఉండేది. కానీ తదనంతర కాలంలో ప్రజా పోరాటాలు విస్తృతమౌతున్న కొద్దీ, ముఖ్యంగా తెలుగు సమాజాలలో లోతైన చర్చలు, అంతర్మథనం జరిగి హక్కుల దృక్పథం తాత్వికంగా బలోపేతం అయ్యే దిశగా వికాసం చెందనారంభించింది. ఆ క్రమంలో భాగంగానే ప్రొ.శేషయ్య గారి ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని పరిశీలించా ‘రాజ్యాంగం-పౌరహక్కులు’ అనే ఈ  పుస్తకంలో ముఖ్యంగా రాజ్యాంగాన్ని చారిత్రకంగా చూడడంలో శేషయ్య గారి ప్రత్యేకమైన ముద్ర కనబడుతుంది. పౌర హక్కుల రంగానికి తనదైన సైద్ధాంతిక దృక్పధాన్ని రూపొందించుకునే క్రమంలో ఆయన పాత్ర ప్రముఖంగా పేర్కొనదగినది.
కాలమ్స్ కథావరణం

బతక నేర్చిన ప్రపంచాన్ని చూపించిన జూకంటి జగన్నాథం కథ – ఎరుక

లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని,
కాలమ్స్ ఆర్ధికం

విస్ఫోటనంలా నిరుద్యోగం, పేదరికం

నూతన సంవత్సరానికి ఒమిక్రాన్‌ స్వాగతం పలుకుతున్నది. గత సంవత్సరం కొవిడ్‌ మిగిల్చిన చేదు అనుభవాలను గుర్తు చేసుకోవాలంటే భయమేస్తోంది. కుటుంబ సభ్యుల మధ్య బంధం తెంపేసింది. మానవత్వాన్ని మంట గలిపింది. మర్చిపోలేని బాధలను మిగిల్చింది. ఆప్తులను కోల్పోయాం. కడసారి చూపుకు నోచుకోలేకపోయాం. అంత్యక్రియలు అనాథల తరహాలో జరిగాయి. ప్రజల ఆశలను కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఛిద్రం చేసింది. కోట్లాది కుటుంబాలు వీధిన పడ్డాయి. ఉపాధి పోయింది. మానవ సంబంధాలు మారిపోయాయి. పేదలు నిరుపేదలు అయ్యారు. కానీ, అదానీ, అంబానీ వంటి సంపన్నుల సంపద అనూహ్యంగా పెరిగింది. అందుకే నూతన సంవత్సరం ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశలు లేవు. సెకండ్‌
కాలమ్స్ లోచూపు

కాషాయ ఫాసిజం ఒక విషపూరిత కషాయం

‘కాషాయ ఫాసిజం, హిందుత్వ తీవ్ర జాతీయవాదం, నయా ఉదారవాద వనరుల దోపిడి’ అనే ఈ పుస్తకం  అశోక్ కుంబం గారు  రాసిన ఇంగ్లీష్ వ్యాసానికి కా. సి యస్ ఆర్ ప్రసాద్ చేసిన అనువాదం. భారతీయ ఫాసిజం అనేది మన నేలమీది ఆధునిక పెట్టుబడిదారీ సామాజిక దుష్పరిణామమే. అంటే, ఇక్కడి ఫాసిజానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థ,  దాని చుట్టూ ఉండే భిన్న సామాజిక సంస్కృతుల సంక్లిష్ట, సమాహారమైన నాగరికత అనే రెండు వైపుల నుంచి బలం సమకూరిందని అర్థం చేసుకోవాలి. అందువల్ల భారత ఫాసిజాన్ని స్థూలంగా చూసినప్పుడు గతకాలపు విదేశీ ఫాసిజంతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ, సూక్ష్మంగా పరిశీలించినప్పుడు