కాలమ్స్ ఆర్ధికం

శ్రమజీవుల రణన్నినాదం

                                                                                          'ప్రజలను కాపాడండి- దేశాన్ని రక్షించండి' అన్న ప్రధాన నినాదంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలపై మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల సార్వత్రిక సమ్మెతో దేశ కార్మికవర్గం సమర శంఖం పూరించింది. బిజెపికి అనుబంధంగా ఉన్న బి.ఎం.ఎస్‌ తప్ప మిగిలిన పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగ సమాఖ్యలు, సంఘాల సంయుక్త వేదికలు పిలుపునిచ్చిన రెండురోజుల సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం 'ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మనీయం... దేశాన్ని కాపాడుకుంటాం.. ప్రజల్ని రక్షించుకుంటాం... కార్మిక కోడ్‌లను తిప్పికొడతాం... కార్మిక చట్టాలలో ప్రతిపాదిత మార్పులను రద్దు చేయాలి, ఏ రూపంలో
కవి నడిచిన దారి

నా అన్వేష‌ణే నా క‌విత్వం

జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం. 2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన
ఆర్ధికం

యుద్ధ ఆవరణలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

  యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా, ఇయు, నాటో దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి. కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్భణానికి దారి తీస్తోంది. కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇప్పటికి పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇంతలోనే యుక్రెయిన్‌ సంక్షోభం వచ్చి పడింది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగా నష్టం వాటిల్లనుంది. యుద్ధం దీర్ఘకాలం
కాలమ్స్ లోచూపు

సమకాలీన అంబేద్కర్ వాదులు-సంక్షోభం,సవాళ్ళు – ఒక చర్చ

గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.     ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు
ఆర్ధికం

ఆహార నిల్వలున్నచోట  అకలి కేకలు

 ఎ.నర్సింహారెడ్డి           వ్యవసాయ రంగంలో వినూత్న పరిశోధనల ఫలితంగా పంటల ఉత్పత్తి పెరుగుతున్నా నేడు చాలా దేశాల్లో ప్రజలు ఆకలి బాధతో అలమటిస్తున్న దీనదృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు కరోనా విపత్తు, మరోవైపు పర్యావరణ విధ్వంసం, వీటికి తోడు అనేక దేశాల్లో అంతర్గత యుద్దాలు వెరసి ఆహారకొరత కోట్లాది మంది జీవితాలను నరకంగా మారుస్తున్నది. ప్రపంచంలో ప్రతి తొమ్మిది మందిలో కనీసం ఒకరు తగిన ఆహారానికి నోచుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి నివేదికలు నిగ్గుతేల్చాయి. తగిన పోషకాహారం అందక పేద దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల్లోనూ ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. పోషకాహార లోపం మహిళలు, పిల్లల పాలిట
లోచూపు కాలమ్స్

కవిత్వమే సూక్ష్మదర్శిని, దూరదర్శిని

-మెట్టు రవీందర్ మనుషులు విడిపోవడం కంటే మించిన విషాదం లేదు మనుషులు కలవడం కంటే మించిన ఆనందమూ లేదు      అరసవిల్లి కృష్ణ రాసిన ‘ఈ వేళప్పుడు’ కవిత్వం కవి రాసినప్పటి క్షణానికి మాత్రమే సంబంధించినదేనా?  కానేకాదు. అలా ఏ కవిత్వమైనా అది రాయబడిన క్షణానికే   సంబంధించినదయితే, అది పుస్తక పుటల మధ్యనే  నలిగిపోయి    నశిస్తుంది. కానీ ‘ఈ వేళప్పుడు’ కవిత్వం ఒక సజీవమైన కవిత్వం. అది జీవజలం వలె పుస్తక పుటల్ని దాటి పాఠకుల హృదయాల్లోకి  అలవోకగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించే కవిత్వమే జీవిస్తుంది, జీవింపజేస్తుంది.      ఇందులో కవి చూసిన చూపులో  చాలా విశిష్టత ఉంది.
కాలమ్స్ కథావరణం

వాస్తవాన్ని వాస్తవం అని చెపుతున్న ఒక ఏనుగుల రాజ్యం కథ “స్వాములొచ్చారు”

ఏనుగుల దాడుల వల్ల పంటల్ని, రైతుల్ని కోల్పోతున్న దేశంలోని అనేక కల్లోలిత ప్రాంతాల్లో రాయలసీమ లోని చిత్తూరు జిల్లా ఒకటి. అటువైపు తమిళనాడు, ఇటువైపు కర్ణాటక మధ్య  చిక్కిపోతున్న దట్టమైన అడవులు.అంతకంతకూ అడవుల మధ్య మెరుగవుతున్న రవాణా సౌకర్యాలు.. చదునవుతున్న కొండలు గుట్టలు, మాయమవుతున్న వృక్షసంపద, అడుగంటిపోతున్న చెరువులు, కుంటలు, అడవులకు ఆనుకుని ఉండే పల్లెల్లో ఆహారం కోసం ఏనుగుల రాక వల్ల , తమ ప్రాణాలు కంటే విలువైన పంటలను కాపాడుకోవటానికి రైతులు చేసే పోరాటం, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ ముఖ్యమంటున్న ప్రభుత్వం, జీవనం కోసం ఏనుగులతో యుద్ధం చేసే పరిస్థితిలో రాయలసీమ రైతాంగం.. ఒక
కాలమ్స్ కవి నడిచిన దారి

ధ్వ‌నిలోంచి క‌వ‌నంలోకి

నాకు శబ్దం అంటే చాలా ఇష్టం. కవిత్వం కంటే మొదట బాణీలను ప్రేమించినవాడిని. ఇప్పటికీ పాటలోని కవితాత్మక వాక్యాల కంటే సంగీతమే మహా ఇష్టం.అవి నేను స్కూల్ డేస్ లో ఉన్న రోజులు. చీకట్లో వుండటాన్ని భలే ఇష్టపడే రోజులు. వీధి దీపాలు సరిగ్గా వెలగని రోడ్లను వెత్తుక్కొని మరీ ఒంటరిగా ఉండటం వల్లే నాలో పాట మొదలయ్యింది. నడవటం బాగా అలవాటు. గంటలు గంటలు నడిచే అలవాటు ఇప్పటికీ అలాగే వుంది. ఒకరకంగా ఈ ఒంటరి నడకే నన్ను బతికిస్తుంది. ఈ నడకే నా ఆరోగ్యాన్ని దెబ్బ తీసే రోజొకటి వుందని నాకూ స్పృహలోకి వచ్చింది. అలా
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను
కాలమ్స్ ఆర్ధికం

పెరుగుతున్న అస‌మానతలు పెట్టుబడి దోపిడీకి సంకేతం

ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో