ఆర్ధికం

డాలర్ ఆధిపత్యానికి తెరపడనుందా ?

ప్రపంచ కరెన్సీలు అన్నింటిలో ఇప్పటి వరకూ డాలర్ది రారాజు పాత్ర కావడం వెనుక ఉన్నది ఆ డాలర్కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ తాలూకు 'బలం' అన్నది నిజం! రెండవ ప్రపంచ యుద్ధం ముగియనున్న కాలానికి రవి అస్తమించని సామ్రాజ్యం కలిగి యున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కకావికలమైంది. అప్పటిదాకా అంతర్జాతీయ వాణిజ్యంలో ఆధిపత్యం చలాయించిన బ్రిటన్, తదితర పశ్చిమ యూరప్ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. బ్రిటిష్ కరెన్సీ పౌండ్తో పాటు ఐరోపాలోని ఇతర పశ్చిమ దేశాల కరెన్సీల విలువ కూడా క్షిణించింది. రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ చెక్కుచెదరకుండా నిలిచింది అమెరికా ఒక్కటే. ఆ దేశం దగ్గర
ఆర్ధికం

కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థ

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. మనుషులు పెట్టుబడి చదరంగంలో పావులుగా ఉపయోగించబడుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా వృద్ధి సాధిస్తోందని.. ఇది మాములు విషయం కాదని ఇటీవల ప్రధాని మోడీ ఘనంగా ప్రకటించారు. ఇదే నిజమైతే భారత ఆర్థిక వ్యవస్థలో మాంద్యం ఎందుకు నెలకొని ఉందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నిరుద్యోగం, పేదరికం పెరిగి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని మూడీస్‌, స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, ఫిచ్‌ వంటి రేటింగ్‌ సంస్థలు, నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌(ఎన్‌ఎస్‌ఓ) ఘోషిస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(ఐయంఎఫ్‌) 2023-24 వృద్ధి అంచనాను అంతకుముందున్న 6.1 శాతం
సమకాలీనం

ఆ విద్యార్థులు చేసిన నేర‌మేమిటి?

When questions become crimes and students become ‘Maoists’; I can’t breathe, Indian edition A young tribal student from Kerala found himself pinned to the ground, a constable straddling his chest and forcing his head into the pavement at an awkward angle while two others yanked at his arms and legs. నవంబర్ 23, ఆదివారం నాడు ఢిల్లీ, ఇండియా గేట్ దగ్గరకు వచ్చిన అనేక మంది నిరసనకారుల మధ్య కేరళకు చెందిన ఒక యువ ఆదివాసీ విద్యార్థి కూడా
మీరీ పుస్తకం చదివారా ?

అమ్మ‌కు జేజేలు

విమర్శకు ప్రమాణాలు ఏమిటి? వొక రచన బాగుందా లేదా అని చెప్పడానికి ఏమైనా తూనికరాళ్లున్నాయా? మాట్లాడుతున్న విమర్శకులు ఏ సాహిత్యప్రక్రియ గూర్చి మాట్లాడుతున్నారు? కవిత్వము, కథ, నవల, నాటకం ఇలా ఉండగా అన్నింటనీ వొకే గాడిన కట్టేస్తున్నారా? తెలుగు విమర్శ ఎంత అత్యున్నతంగా ఎదిగందంటే ప్రమాణాలు లేవు అనే పేలవమైన కామెంట్లు చేసే స్థితికి చేరింది. పోనీ ప్రమాణాలేవో చెబుతారా అంటే అలా కూడా చెప్పరు. ఈ తరహా ఆలోచన తిరోగమనస్థితికి సంకేతం. ఈ సంక్లిష్ట, సందిగ్ధ సందర్భంలో వొక కవిత్వంలో ప్రమాణాల గూర్చి చర్చిద్దాం. నీలిమ విపస్‌ రావు కవిత్వం ఆగ్రహి చూద్దాం. ఈ కవిత్వంలో ఉన్న 
ఆర్ధికం

మోడీ ఏలుబడిలో అప్పుల భారతం

మోడీ ఏలుబడిలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  2026 మార్చి నాటికి మొత్తం అప్పు రూ. 191 లక్షల కోట్లు దాటనుంది. దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ.1.37 లక్షల అప్పు ఉంది. యేటా చెల్లిస్తున్న వడ్డీ రూ. 12,76,338 కోట్లు. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ప్రభుత్వాలు సహజంగానే ఆదాయాలు పెంచుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఈ ఆదాయాలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడం పేరు మీద ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడం, సంక్షేమ పథకాలలో
ఆర్ధికం

డాలర్‌ కోటకు బీటలు!

గ్లోబల్‌ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌కు ఉన్న పట్టు క్రమంగా సడలిపోతోంది. రిజర్వు కరెన్సీగా, కరెన్సీ మార్పిడి మాద్యమంగా ఏడు దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా డాలర్‌ ఇటీవలి కాలంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఇప్పటిదాక అమెరికా సైనిక, ఆర్థిక దండోపాయంతో ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది. తనమాట వినని దేశాలపై ఆంక్షల కొరడాతో, డాలర్‌ అనే ఆయుధంతో, లేదంటే మిస్సైళ్ల మోతతో చెలరేగుతున్న అగ్రరాజ్య అమెరికా కోరలు పీకేందుకు దండయాత్ర మొదలైంది. ఇన్నాళ్లు ఏ డాలర్‌ అండతో అమెరికా విర్రవీగిందో, సరిగ్గా ఆ కుంభస్థలంపై కొట్టేందుకు అనేక దేశాలు చీమల దండులా కదం తొక్కుతున్నాయి. గ్లోబల్‌ కరెన్సీగా రాజ్యమేలుతున్న
సమకాలీనం

 ‘నూతన భారతం’లో ఆదివాసుల సంక్షోభం

నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా, మోదీ ప్రభుత్వం మళ్లీ ఘనంగా “జనజాతి గౌరవ దివస్”ను జరిపి, దేశ జనాభాలో దాదాపు 9 శాతం ఉన్న ఆదివాసుల శ్రేయస్సు కోరేవారిగా తనను తాను చూపించుకుంటోంది. మరోవైపు, ఇటీవల, ప్రభుత్వం లదాఖ్‌లోని ఆదివాసుల రాజ్యాంగపరమైన డిమాండ్ కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని దారుణంగా అణచివేసింది. మణిపూర్‌లో ఆదివాసీ-స్థానిక సముదాయాల పైన రెండేళ్ల హింస తర్వాత కూడా పరిస్థితి సాధారణ స్థితికి రాలేదు. మావోయిజం నిర్మూలన పేరుతో బస్తర్‌లో ఆదివాసులపై పోలీసుల అణచివేత జరుగుతోంది. జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాల ఆదివాసులు తమ స్వతంత్ర మతపరమైన కోడ్ (నియమ నిబంధనల
సమకాలీనం

జైలు హక్కుల కోసం-మావోయిస్టు  ఖైదీ సంజయ్ దీపక్ నిరాహార దీక్ష‌

జైలు అధికారులు చట్టాన్ని పాటించే ఉంటే, సంజయ్ న్యాయం కోసం నిరాహారదీక్ష చేయాల్సిన అవసరం ఉండేదే కాదు. హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఉన్న మావోయిస్టు గా అరోపించబడిన  రాజకీయ ఖైదీ సంజయ్ దీపక్ రావుతో ఒక సీనియర్ జైలు అధికారి ఇలా అంటాడు. " రాజ్యాంగాన్ని పాటించని వాళ్ళ పట్ల  మేము రూల్స్ పాటించాలా? నేను పాటించను.” భారతదేశ జైళ్లలో చట్టబద్ధత ఎంత పతనమైందనే విషయాన్ని ఈ అధికారి మాటలు చెప్పకనే చెప్తున్నాయి. 2025 అక్టోబర్ 28న, 60 ఏళ్ల సంజయ్ దీపక్ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన నిరసన ఏవో ప్రత్యేక హక్కుల కోసమో, సౌకర్యాల కోసమో కాదు.
సమకాలీనం

అదానికి ప్రతిఘటన అదాని బొగ్గు గనుల ప్రతిపాదన బహిరంగ విచారణలో ప్రజా నిరసన

పరిపాలనాధికారులు, కలెక్టరు, ఎస్‌డీఎంలు మాట్లాడాలనుకుంటే గ్రామాలకు రావాలి. గ్రామంలోని ప్రజల మధ్య మాట్లాడాలి. సార్, మాకు ఇంతే తెలుసు, మా భూమిని అదానీకి గానీ, ఇంకెవరికీ గానీ ఇవ్వాలని మేము అనుకోవడం లేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగబద్ధ పాలన ఉండాలి తప్ప, ఏ ఒక్క పారిశ్రామికవేత్త కనుసన్నలలో జరిగేది  కాదు. భూమికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రస్టీలే (ధర్మకర్తలే) తప్ప యజమానులు కారని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూమిపై ఎవరికి హక్కు పత్రం (అధికార పత్రం) ఉందో వారే యజమాని. చిన్న రైలు మార్గం నిర్మించి, దాని ద్వారా రవాణా
మీరీ పుస్తకం చదివారా ?

కవిత్వ అంతరంగాన్ని శోధించే కవిత్వం

తెలుగులో వస్తున్న సాహిత్యవిమర్శపై ఇటీవల తీవ్రంగా చర్చ జరుగుతున్నది. ఏది విమర్శ? ఏది కాదు.? విమర్శకులు తెలంగాణ ప్రాంతం నుంచి వొకరకమైన విమర్శ రాస్తే, కోస్తాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి వారి వారి కోణాల్లోంచి దృక్పథాల్లోంచి విమర్శ రాస్తున్నారు. సాహిత్య ప్రక్రియల్లో కవిత్వం, కథ గూర్చి విమర్శ రాసేటప్పుడు మాత్రం అనేక చర్చలు మొదలౌతున్నాయి. కవిత్వాన్ని తీసుకుంటే పదునైన విమర్శ ఏది? అన్నప్పుడు భిన్నవాదనలొస్తున్నాయి. వాస్తవానికి కవిత్వమిలాగే ఉండాలనే ఎవరూ నిర్థారించకపోయినా హృదయాన్ని మీటే కవిత్వానికి కొన్ని సంగతులైతే నిర్ణయించుకున్నారు. ఇందులో కవిత్వ నిర్మాణసూత్రాలైన వస్తువు, శిల్పం, ఎత్తుగడ, అభివ్యక్తి, భావుకత, సాంద్రత, రూపం, సారం