కవిత్వం

భాష

వాళ్ల భాష ఏమిటో మనకు అర్థం కాదు తలలు విదిలిస్తూ చేతులు తిప్పుతూ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఎదలు గుద్దుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన దేహాల్తో వాళ్ళు ఏమంటున్నారో తెలువదు. చిన్నపిల్లలు సైతం చేతుల జెండాలు పట్టుకుని సైనికులకు ఎదురేగి ఏమంటున్నారో తెలియదు శిథిలాల మధ్య నిలిచి ఒరిగిపోయిన సీకుకు తన జెండానుగట్టి ఆ తల్లి ఏమని నినదిస్తున్నదో తెలియదు.. * మొరాకో ,ఈజిప్ట్ , జోర్డాన్ కెనడా, బ్రిటన్ మలేషియాల్లో వీధులు జన సంద్రాలై పోటెత్తుతున్నాయి . రాళ్లకు రాపిడైనట్లు సముద్రం ఘోషించినట్లు గుండెను డప్పు చేసి మంటలతో మాట్లాడించే వాళ్ళ భాషకు అర్థ మేమిటో తెలువదు అయితేనేం
వ్యాసాలు కొత్త పుస్తకం

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో
వ్యాసాలు కొత్త పుస్తకం

ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

(డిశంబర్ 23 న విజయవాడలో విడుదల కానున్న *కార్పొరేట్ హిందుత్వ ఫాసిజం* పుస్తకానికి రాసిన ముందుమాట. *దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం* ఈ పుస్తకాన్ని ప్రచురించింది.) ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.
ఆర్ధికం

సంక్షోభం అంచున ప్రపంచ ఆర్థికం

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, యుద్ధాల ఒత్తిడి, పెరిగిన ద్రవ్యోల్బణం, కొనసాగుతున్న అధిక వడ్డీ రేట్ల కారణంగా తడబడుతున్న నేపథ్యంలో, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తాజాగా వెల్లడిరచిన ప్రపంచ ఆర్థిక ధృక్కోణం(వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌) రానున్న రోజుల్లో ప్రపంచ ప్రగతి దిగజారనుందని జోస్యం చెప్పింది. ఇతరత్రా అనేక మంది ఆర్థికవేత్తల విశ్లేషణలు, దేశాలు, ప్రాంతాల పనితీరును చూసినా అధోగతి తప్ప పురోగతి కనుచూపు మేరలో కనిపించటం లేదు. గతేడాది (2022) ప్రపంచ వృద్ధి రేటు 3.5 శాతం ఉండగా వర్తమానంలో (2023) మూడు, వచ్చే ఏడాది (2024) 2.9 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. 2000 నుంచి 2019
కవిత్వం

పిల్లల దేశం

పిల్లలు దయాత్ములు ఎవరినైనా దేనిదైనా ఇట్టే క్షమించడం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ✤ పిల్లలు తప్ప ఇంకెవరు అల్లరి చేస్తారని వొక తల్లి నాకు సుద్దులు చెప్పింది ✤ పిల్లలతో ప్రయాణం చేయడమంటే పూలతో పక్షులతో కలిసి నడవడమే ✤ ఉమ్మెత్తపూలువంటి పిల్లలు ఈ పూట తరగతిగదిలోకి లేలేత కాడలతో వొచ్చారు ✤ పిల్లలు నక్షత్రాలు పగలూ రాత్రి వెంటాడుతూ నన్నూ కాస్తా వెలిగిస్తున్నారు ✤ పిల్లలు నవ్వితేనే భూమి నాలుగుకాలాలు బతుకుతుంది ✤ ఒక మహావృక్షం కింద పిల్లలంతా చేరిన తర్వాతే మహావృక్షం మహావృక్షంగా ఎదిగిందని నానుడి ✤ పూలగౌనుపిల్ల సీతాకోకచిలుకలతో ఆడుకుంటుంది ✤ నీడలు
కథావరణం

రైతు జీవిత చిత్రణలో రచయిత్రులు

 'మంచిదయ్యా మీరెల్లబారితే నేనూ నా పనికి పోతా' అంటుంది హనుమక్క . గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో  పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని   కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ. రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది,
కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు
కవిత్వం

మందరపు హైమావతి రెండు కవితలు

1 గెలుపు గుర్రాలం ఇక వెనకడుగులన్నీ ముందడుగులే కుంటి గుర్రాలన్నీ పరిగెత్తే పారశీక జవనాశ్వాలే పాత చరిత్రలు పాత కథలన్నీ పాదమట్టం బండరాళ్లకు రెక్కలు మొలిచిన అద్భుతం అటు అగ్రకులాల ఆధిపత్య భావనల పావురాలనెగరయ్యలేక కింది కులాల ధిక్కారస్వరంతో గొంతు కలపలేక ఆత్మన్యూనతాభావంతో ముడుచుకుపోయే అత్తిపత్తులం స్వేచ్ఛ సీతాకోకచిలుక రెక్కలు విరిచి కాళ్లకు బదులు మనసుకు సంకెళ్లు వేసి అమానవీయ అంటరానితనం కొరడా దెబ్బలు వెలివాడల బహిష్కరణల బహుమతులు మాత్రమే తక్కువ తరతరాలుగా చాకలోళ్లు మంగలోళ్లు కుమ్మరోళ్లు కంసాలోళ్ళు అంటూ మా మనసు పుస్తకాలపై చెరగని అవహేళనల రాతలు 'పిల్లలకు పట్టింపులేమిట' ని వసారాలోవడ్డించి ఎంగిలాకులు ఎత్తించిన కటిక
కవిత్వం

అవిశ్రాంత యోధుడు

ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.
సమీక్షలు

ఆకాశ మార్గాన్ని గురి చూస్తున్నవిల్లంబులు

కొండల మీద, గుట్టల మీద, నదుల పక్కన జీవించే దండకారణ్య ఆదివాసులు ఎప్పుడైనా ఇలాంటి పోరాటం చేయాల్సి వస్తుందని కలగని ఉంటారా?  ప్రకృతి పరివ్యాప్త సాంస్కృతిక జగత్తులో ఓలలాడే ఆదివాసులు ఆకాశ యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకొని ఉంటారా? ఊహా తీరాల వెంట గొప్ప కాల్పనిక భావావేశంతో కళల ఊటను ప్రవహింపచేసే ఆదివాసులు ఇలాంటి ప్రతి వ్యూహ రచన ఎన్నడైనా చేసి ఉంటారా? వందల వేళ ఏళ్ల నుంచి రాజ్య ధిక్కారమే జీవన విధానంగా సాగిన ఆదివాసులు ఆకాశ మార్గాన యుద్ధం చేసే రాజ్యం ఒకటి  తమ మీద ఇలా విరుచుకపడి బాంబుల దాడి చేస్తుందని తలపోసి ఉంటారా?