కరపత్రాలు

ఆదివాసులపై మోడీ ప్రభుత్వ యుద్ధం

(30-04 -2023   నాగర్‌కర్నూల్‌ జిల్లా   అచ్చంపేటలో జరిగిన సభ కరపత్రం- వసంత మేఘం టీం ) దేశానికే మూలవాసులైన ఆదివాసీలను ప్రజాస్వామ్యబద్ధంగా పాలించాల్సిన ప్రభుత్వాలు, 1985 నుండి అమానుషంగా వేటాడి హత్యచేస్తున్నాయి. జల్‌, జంగిల్‌, జమీన్‌లపై ఆదివాసులకే హక్కని 1997 సమతా స్వచ్ఛంద సంస్థ వర్సెస్‌ భారత ప్రభుత్వం కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పులో కూడా అడవిపై హక్కు ఆదివాసీలదే అని స్పష్టం చేసింది. కాని అడవిలోని సహజ సంపదను కొల్లగొట్టడానికి, అడవిని విధ్వంసం చేయడానికి సిద్ధమైన పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులవైపే ప్రభుత్వాలు నిలబడ్డాయి. ఎలాగైతే నల్లమలలో ఉన్న 20 లక్షల టన్నుల యురేనియం వెలికి తీసి, అచ్చంపేట నల్లమల
కవిత్వం

చెలిమి బంధాన నడక

వయసుని మరచిన మండు వేసవి ఆకాశంలోకి తొంగి చూస్తూ ఆ వేసవి గాలుల నడుమ మొహం నిండా చెమటతో బాల్యం తాటి చెట్టుపై ఉన్న కాయలను తినాలని ఆశ ప్రకృతిలో మమేకమైన అమాయకత్వం పచ్చని పైరుల మధ్య కూర్చోని..ముచ్చటిస్తూ... తాటి ముంజలు తింటున్నా... అన్న, చెల్లి, తమ్ముడు... ఆ మాటల మధ్య సంధ్యాకాలం దాటుతోంది పశ్చిమాన ఆస్తమా సూర్యుని చూస్తూ... మళ్ళీ వేకువనో, వసంతానో కలుద్దామని వెనుతిరిగారు.
నివేదిక

ఉద్యోగ హక్కు చట్టం చేయాలి

మిత్రులారా మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు. అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం
కవిత్వం

పల్లిపట్టు నాగరాజుమూడు కవితలు

1 కుటిలమేధయాగం -------------------------- కంటిలో నలుసట్టా పడితేనే కళ్లు రుద్దుకునే మనం పొరకముల్లు గుచ్చుకుంటేనే వెదికి మరీ తీసిపారేసే మనం * బతుకుదారుల్లో బలిజముళ్లను చల్లుతుంటే బర్రిమీద వానకురిసినట్లుండమే అర్థంగావట్లేదు.!? * మనిషితనానికే శత్రువయినోడు మనుషుల బాగెట్టా ఆలోసిస్తాడు మనిషి మెదడు ప్రాణంతో కదలటం సహించలేనోడు మనిషి బుర్రకు పదునుపెట్టే సదువెట్టా వుండనిస్తాడు * కాయని కాయని పండుని పండని ఉన్నదున్నట్టు కంటితో చూడలేని కుంటిచూపులోడు మురికిని మురికని చెబితే ఒప్పుకుంటాడా.? అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?! చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా?? * దీపాలు వెలిగే దారుల్ని