వ్యాసాలు

మోడీ అమ్ములపొదిలో మరోస్పైవేర్‌

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన కుటిల రాజకీయ నీతిని పదేపదే ప్రదర్శిస్తోంది. మోడీ ప్రభుత్వ అణచివేత పాలనపై ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు, విమర్శలను కొట్టిపారేస్తూ తన నిరంకుశ, నియంతృత్వ వైఖరిని కొనసాగిస్తోంది. సరిగ్గా రెండేళ్ల క్రితం  పెగాసస్‌ స్పైవేర్‌ కొనుగోలు రేపిన దుమారం సద్దుమణగక ముందే మోడీ సర్కార్‌ కొత్త స్పైవేర్‌ కోసం వేట మొదలెట్టింది. అందుకు రూ.986 కోట్లు కేటాయించింది. 2019 లోకసభ ఎన్నికల్లో బిజెపి విజయానికి పెగాసస్‌ స్పైవేర్‌ కూడ పరోక్షంగా కారణమైందన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 ఎన్నికలకు ఏడాది ముందు విపక్ష నాయకుల ఫోన్లలోకి ఈ స్పైవేర్‌ను చొప్పించారన్నది పలు నివేదికల సారాంశం. ఈ
కవిత్వం

ఎప్పుడైనా నేను గుర్తొస్తే!

ఎప్పుడైనా నేను గుర్తొస్తే కన్నీళ్లు పెట్టుకోకండి "కాలం చీకటి గర్భంలో నన్ను కంటుంది" అన్న నా కవితలను ఒక్కసారి చదువుకోండి అక్షర రూపంలో నేనెప్పుడూ మీతో బతికే ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే మీ చుట్టూ ఉన్న జీవితాలు అదే చరిత్రను దాచిన పుస్తకాలు చదవండి మహిళల కోసం, ఆదివాసి హక్కుల కోసం ప్రజా పోరాటాలను చేయండి ఆ పోరాటంలో నేను మీకు తోడుగా ఉంటాను ఎప్పుడైనా నేను గుర్తొస్తే నా బట్టల కింద ఉన్న డైరీలో మీ కోసం రాసిన కవితలను మరోసారి మీ గుండెలకు హత్తుకోండి కాసేపు భారమైన బాధలను మర్చిపోతారు ఎప్పుడైనా నేను గుర్తొస్తే
నివేదిక

ఒడిశాలోని ఆదివాసీ గూడాల్లో  ఆహార సంక్షోభాన్ని బహిర్గతం చేసిన  ఓ చిన్నారి మరణం

ఎనిమిదేళ్ల క్రితం జాజ్‌పూర్ జిల్లాలో పోషకాహార లోపంతో 19 మంది చిన్నారులు చనిపోయారు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పేమీ లేదు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలోని ఘటిసాహి గ్రామంలో ఆదివాసీ కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అర్జున్ మార్చి ప్రారంభంలో మరణించాడు. రెండు రోజుల క్రితం చివరిసారిగా అన్నం తిన్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. పోస్ట్‌ మార్టం చేయలేదు, కానీ మీడియా అర్జున్ మరణాన్ని పోషకాహార లోపం కేసుగా ప్రచురించడంతో స్థానిక అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి విషమంగా వున్న అర్జున్ తోబుట్టువులు ఇద్దరు, తొమ్మిది నెలల రైసింగ్, 10 ఏళ్ల కునిలను మార్చి 23 నాటికి, జిల్లా
హస్బెండ్ స్టిచ్ - 3

‘’ ఆజో మ తోన బేటా దూన్చు ‘’ !

’అయ్యో నేను వస్తున్నా .. ఆమె నా బెహెన్ సార్ .. మా చాంద్  బాయి , ఆడనె  ఉంచుండ్రి  ఇగో  ఐదు  నిమిషాల్లో ఇప్పుడే వస్తున్న” భూక్యా ఖంగారుగా అంటూ .. భార్య పద్మ తో “చాంద్  బాయి  జ్యోతి నగర్ లో ఒకల యింట్ల  ఉన్నదంట  నేన్  పోయి తొలుకొని వస్తా” అన్నాడు . “ నేను గూడ వస్తా పా “ అన్నది పద్మ .   చాంద్ బాయి ., భూక్యా చెల్లెలు.                                                             **** “ఆజో ., మ తోన బేటా దూన్చు”.,{ నాతో రా నీకో కొడుకుని ఇస్తా }
వ్యాసాలు

నాణేనికి ఒకవైపు

వాకపల్లి ఘటనకు పదిహేనేళ్లు  నిండింది. న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులు సుదీర్ఘకాలం వేచి ఉండిన తర్వాత న్యాయం తమకు అందదని ఈ దేశ న్యాయస్థానాలు కేవలం ఎంక్వయిరీ ఆధారిత తీర్పులు ఇస్తాయని వాకపల్లి బాధితులకు అర్థం కావడానికి ఇంతకాలం పట్టింది. ఇక్కడ   న్యాయ స్థానం,పోలీసులు ఒక  సాకు మాత్రమే.                                                    2007 ఆగస్టు 20న తెల్లవారుజామున నక్సలైట్ల ఏరివేతలో భాగంగా కూంబింగ్ కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులకు కనిపించిన గ్రామం వాకపల్లి. విశాఖ మన్యం ప్రాంతంలో తమదైన జీవితం గడుపుతున్న ఆదివాసి స్త్రీలు ఈ పోలీసులకు తమ లోపల వాంఛను తీర్చేవారిగా కనబడ్డారు. పోలీసులు తమ కోర్కెలను తీర్చుకోవడానికి ఈ
కవిత్వం

లెక్కింపు

జవాబుపత్రకట్ట స్పర్శించగానే కొన్నిమూలుగులు వినిపించాయి అణిచిపెట్టిన రబ్బరుబ్యాండు తొలగించగానే కొన్ని ఏడ్పులు వినిపించాయి పత్రాల లెక్కిస్తుంటే కొన్ని ఎక్కిళ్ళు వినిపించాయి పత్రాల మూల్యాంకిస్తుంటే ఒక రైలుశబ్ధం పెనవేసుకున్న లేలేత మృత్యుకేక బ్రద్ధలైంది పత్రాల్లమార్కులు వేసేకొద్ది ఉరితాళ్ళవరుస పేనుతున్న ధ్వని పత్రాలపేజీలు తిప్పుతుంటే పురుగుమందులవాసనంటుకున్నగాలి పూర్తైనమూల్యాంకన పత్రాలు కింద పెడుతుంటే ఎవరో మునుగుతున్న నీటిశబ్ధం ఇంత హింసను ముల్లెకట్టుకుంటూ ప్రశ్నపత్రాలు దిద్దడమంటే భవిష్యత్తును దిద్దడమే వాళ్ళు ఆడుకున్న అక్షరాలు వాళ్ళు పాడుకున్న అక్షరాలు వాళ్ళ మీద అలిగిన అక్షరాలు వాళ్ళే మూతిముడ్చుకున్న అక్షరాలు ఏడాదంతా మోసిన అక్షరాల్ని తెల్లకాగితమంతా పండిస్తారు ఆ పంట చుట్టూ ఆశల్ని కాపలా పెడుతారు అనేక
కవిత్వం

మరువలేని క్షణం

ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది పాల కోసం తల్లడిల్లుతున్న ఆ బిడ్డను చూసి పాలకై తన రొమ్ములను ఎగేసి గుద్దుకున్న ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది రాజ్యం నేరస్తులను సత్ప్రవర్తనతో రిలీజ్ చేసినప్పుడు "బిల్కీస్ బానో" మనోవేదనకు కారణమైన ఆ న్యాయస్థాన అన్యాయాన్ని కన్నీళ్ళతో లెక్కించిన నిస్సహాయపు ఆ క్షణాల్ని ఎలా మరువగలం? ఓ నినాదం మన మస్తిష్కంలో మతాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలంతా మానవత్వాన్ని మరిచి మతానికై పరుగులు తీస్తున్నప్పుడు "బార్బీ మసీదు"లను కూలగొడుతున్నప్పుడు న్యాయం అన్యాయాన్నే మరలా అనుసరించినప్పుడు టీవీల ముందు కండ్లల్లో ఒత్తిడేసుకుని మనమంతా నోరు మెదపకుండా చూస్తున్న మతస్వార్థ మానవత్వపు ఆ క్షణాల్ని మనం
వ్యాసాలు

నిరంతర శ్రామికవర్గ పోరాట స్ఫూర్తే మేడే

పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమిస్తూ ఉండేవారు. ఆనాడు శ్రమ జీవులపై పనిభారమే కాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేది. వారు రోజూ 16 గంటలు శ్రమించేవారు. కొంత మంది పెట్టుబడి దారులు కార్మికులచేత రోజూ 20 గంటలు కూడా పని చేయించేవారు. పారిశ్రామికాధిపతులు శ్రమజీవులకు అతి తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఆనాడు ఫ్యాక్టరీలలో శ్రామికులకు ఎటువంటి భద్రతగానీ, సౌకర్యాలుకానీ ఉండేవి కావు. ఫ్యాక్టరీలలో గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ ఉండేది కాదు. అందుచేత తరచుగావారు ప్రమాదాలకు గురై మరణిస్తుండేవారు. కార్మికులు
కవిత్వం

అమ్మ మాట

నాలుగు గోడల మధ్య నుంచి నలుగురి మధ్యలో నిలవాలన్న నలుగురిలో గెలవాలన్న నలుగురిని గెలిపించాలన్నా నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్న నాలుగు రాళ్ళు పోగేయలన్న నలుగురిని సంపాదించు కోవలన్న నలుగురికి సాయo చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులు ఎప్పుడు ఎదురుచుస్తుoటాయి నీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి గుడి బడి తల్లి తడ్రులు లాంటి వాళ్ళని మంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూ ఎప్పుడు హితాన్ని మరవకూడదని సత్ మార్గంలో పయనించలని పరుల ఘోషకు కారణం కాకూడదని చెబుతూ ఉండేది అమ్మ!!
సమీక్షలు

జీవిత కథలు

ఒక దశాబ్ద కాలం నాటి ఒక మనిషి అనుభవం, దాని తాలూకు జ్ఞాపకాలు ఇప్పుడు అవసరమా అని కొందరు పెదవి విరవొచ్చు. కాలం మారింది కాబట్టి సమాజం మారకుండా ఉంటుందా అని మరికొందరు ఎదురు ప్రశ్నించవచ్చు. లేదా రచయిత ముందుమాటలో చెప్పినట్టు కొందరు అగ్రకుల పీడక పీఠాధిపతులు ఎదురు దాడి చేయనూ వచ్చు. నిజానికి రచయిత మోహన్ తలారి అనుభవాలు ఆయన జ్ఞాపకాలు కేవలం ఆయనకే పరిమితమైనటువంటి వైయక్తికమైన అనుభవాలు కావు. అవి వందల, వేలాది మందితో కూడిన కొన్ని జన సమూహాలవి అయినప్పుడు, అవి నేడు నడుస్తున్న చరిత్రలో కూడా అంతర్భాగమైనప్పుడు వాటి నమోదు సమాజానికి ఎంత