వ్యాసాలు

స్మృతి చిహ్నాలతో మన ప్రయాణం – రాజ్యం నిర్భంధం.

ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి
కవిత్వం

అంధకారం

పులి లేడి ని చంపితే ప్రకృతి ధర్మం ఆహార వేట పెద్ద చేప చిన్న చేపనూ! చెట్టు కొమ్మ పండు బరువుకి వాలితే ప్రకృతే! కొమ్మ ను నరికేది నరుడే!! మనిషి మనిషి ని వేటాడితే వికృతి మనిషి ని రాజ్యం చంపదల్చుకుంటే ఎన్ కౌంటర్ హత్య లు కాపు కాసి చేసే రోజులు కావివి జన సమ్మర్దంలో బాహాటంగా ప్రత్యక్ష ప్రసార వినోద క్రీడలు ఇప్పుడు! అధికారం కోసం అహం రాజ్యం లో భాగం కులం మతం వనరు ద్రవ్యం కొలమానం లో దారిద్ర్య రేఖ ఊగిసలాట లో అటూ ఇటూ మనిషి వర్గాల కొమ్ము లేని
వ్యాసాలు

భద్రతా బలగాలు వైమానిక  బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?

ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు
ఆర్ధికం

గరిష్టానికి ప్రపంచ రక్షణ వ్యయం

ప్రపంచ సైనిక వ్యయం అల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. 2022లో సైనిక వ్యయం అత్యధికంగా 2.24 ట్రిలియన్‌ డాలర్లకు చేరినట్లు ప్రముఖ రక్షణ అధ్యయన సంస్థ సైనిక వ్యయంపై స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎస్‌ఐపిఆర్‌ఐ) మార్చి 13న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. విదేశాల నుండి సైనిక పరికరాలు కొనడానికి భారత్‌ 2020-21 లో రూ|| 4 లక్షల 71 వేల కోట్లు, 2021-22 లో రూ|| 4 లక్షల 78 వేల కోట్లు, 2022-23 లో రూ|| 5 లక్షల 25 వేల కోట్లు, 2023-24 లో రూ|| 5 లక్షల 93 వేల
హస్బెండ్ స్టిచ్ - 3

నాలుగో ప్రశ్న వేసిన అమ్మాయి!

మీకో నాలుగు ప్రశ్నలను... నాలుగు జవాబులను పరిచయం చేస్తాను. నాతో రండి... ఇంతకీ నేనెవరనుకుంటున్నారు? నేనో అండాన్ని అవును అనాదిగా స్త్రీ దేహంలో తయారవుతున్న అండాన్ని. ఆడగానో, మగగానో ఎవరిగానో పుట్టే తీరతాను లేదా పుట్టాక ఆడో మొగో కూడా తేల్చుకుంటాను. కానీ నిరంతరం ఒక భయంతో... ఆందోళనతోనే ప్రతీ నెల కోట్లాది మంది స్త్రీ దేహాల్లో తయారవుతూ... ఉంటాను... సందేహంగా రాలిపోతూ ఉంటాను కూడా ఆ స్త్రీలు పెళ్ళి చేసుకుంటే ఇక నేను ఆడపిల్లగా పుట్టేస్తానేమో అని వణికిపోతుంటాను. ఆ స్త్రీ భర్త వీర్యకణాల్లోని వై క్రోమోజోముతో అండాన్నై నాలోపని ఎక్స్‌ క్రోమోజోమ్‌ కన్నీరు కారుస్తూ భయపడ్తు
సంపాదకీయం

స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి
వ్యాసాలు

మనువాదం వర్సెస్ డార్విన్ జీవపరిణామ వాదం

(ఈ వ్యాస రచయితల్లో ఒకరైన కోట ఆనంద్ ను  ఏప్రిల్  28  తెల్లవారుజామున  3.00 గంటలకు  పోలీసులు అక్రమంగా  అరెస్ట్ చేశారు.  ఉస్మానియా యూనివర్సిటీ లో పరిశోధన విద్యార్థి గా విద్యారంగ సమస్యలపై , సామాజిక సమస్యలపై వివిధ దిన, మాస పత్రికలలో   రచనలు చేశారు. వసంత మేఘంలో కూడా ఆనంద్ వ్యాసాలు అచ్చయ్యాయి . అరెస్టుకు ముందు ఆయన ఆవుల నాగరాజుతో కలిసి ఈ వ్యాసం రాశారు ) దేశంలో నేడు విద్య ప్రవేటీకరణ, విద్య కాషాయీకరణ సమపాళ్లలో ముందుకు సాగుతున్నాయి. భాజపా మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా ప్రవేటీకరణను తీవ్రం చేయడానికి పూనుకున్నది.  రెండవసారి
ఇంటర్వ్యూ

చరిత్రను తిరగ రాయడం  వీరోచితం అనుకుంటున్నారా ?

గణేష్‌ నారాయణ్‌ దేవి జ్ఞానానికి, శక్తికి మధ్య వుండే సంబంధం గురించి పరిశోధిస్తూ అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు. మానవ చరిత్రలో శిష్టవర్గాలు, జ్ఞానాన్ని నిర్వచిస్తూ దానిపై గుత్తాధిపత్యాన్ని ఎలా సాధించారో ఆయన వివరించారు.  ఆయన గుజరాత్‌లోని వడోదరా (బరోడా)లో ‘‘భాషా రీసెర్చ్‌ అండ్‌ పబ్లికేషన్‌ సెంటర్‌’’ను, తేజ్‌ఘర్‌లో ‘‘ఆదివాసీ అకాడమీ’’ని స్థాపించారు.  2010లో ఆయన నాయకత్వంలో జరిగిన ‘‘భారతదేశంలో ప్రజల భాషల సర్వే’’ నేటికీ సజీవంగా వున్న 780 భారతీయ భాషలను రికార్డు చేసింది. ఆయనకు సాహిత్య అకాడమీ అవార్టు, సార్క్‌ దేశాల సాహిత్య అవార్డు, ప్రిన్స్‌ క్లాస్‌ (PrinceClaus)1 అవార్డు, అంతర్జాతీయ లింగ్వాపాక్స్‌ బహుమతి (
వ్యాసాలు

‘స్టాలిన్‌యుగం’లో ఇండియా

రష్యాలో వానబడితే మనదేశంలో కమ్యూనిస్టులు గొడుగుపడతారు అని 1955కు ముందు ఇండియాలో కమ్యూనిస్టు వ్యతిరేకులు వ్యాఖ్యానించే వాళ్లు. నిజానికి బోల్షివిక్‌ విప్లవం తర్వాత ఆరేళ్లకు గానీ ఇక్కడ కమ్యూనిస్టుపార్టీ పుట్టలేదు. లెనిన్‌ బతికుండగానే ఇండియా నుంచి ఎం.ఎన్‌.రాయ్‌ ఆసియా ఖండంలోనే మొదటివాడుగా ఇక్కడికి కమ్యూనిస్టుపార్టీని తెచ్చాడుగానీ ఆయనే అందులో నిలవక ఆ తర్వాత రాడికల్‌ హ్యూమనిస్ట్‌పార్టీ పెట్టి వేరుపడ్డాడు.  అయితే బ్రిటిష్‌ సామ్రాజ్యవాద వలసపాలన దమనకాండ భరించచలేని ప్రజలు, ముఖ్యంగా జలియన్‌వాలాబాగ్‌ ఉదంతం ఇంచుమించు అదేకాలంలో జరిగింది గనుక బోల్షివిక్‌ విప్లవంతో చాల ఉత్తేజితులయ్యారు. లెనిన్‌ను పీడితప్రజల, శ్రామికవర్గాల విముక్తిప్రదాతగా చూడసాగారు. అమెరికాలో ఉన్న సిఖ్కు మేధావులు కొందరు
వ్యాసాలు

ఎన్‌కౌంటర్‌లలో న్యాయ వ్యవస్థ జోక్యం

ఉమేష్ పాల్ హత్య నిందితుడు, మాజీ రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ ఉత్తర ప్రదేశ్ పోలీసుల నుండి తన ప్రాణ రక్షణ కోసం చేసిన విజ్ఞప్తిని స్వీకరించడానికి గత నెలలో సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తరువాత ఆ రాష్ట్ర పోలీసులే  అతని కొడుకును ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేశారు, ఆ తర్వాత అతనితో పాటు అతని సోదరుడిని పోలీసు కస్టడీలో వుండగా ముగ్గురు దుండగులు కాల్చి చంపారు. అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యపై విచారణకు విశ్రాంత సుప్రీం కోర్టు జడ్జి అధ్యక్షతన స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఏప్రిల్ 17న సుప్రీంకోర్టులో పిఐఎల్ దాఖలు