సమీక్షలు

భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం

ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.
కవిత్వం

పదేళ్ల అక్రమ నిర్భంధం

చేయని తప్పు చేసాడని కటకటాల వెనక్కి పంపిన రాజ్యం అక్షరం హేతువు ను బోధిస్తుందని హేతువు మార్క్సిజానికి మూలమని అక్షరానికి సంకెళ్ళు వేసింది వందశాతం ఫాసిజం కోరలు పీకి తొంభై శాతం వైకల్యం సాధించిన గెలుపు ఇంకా తరాజులో న్యాయం వుందని తేల్చింది ఎన్ని ఉదయాలు ఎన్ని అస్తమయాలు ఈ పదేళ్లలో తూర్పు పడమర ల మధ్య ఊగాయో ఓ కొత్త పొడుపు కోసం నిరీక్షించిన కళ్ళు నిజాన్ని బంధిస్తే అబద్దాల రాజ్యం కి వెసులుబాటు మసి పూసి మారేడు కాయ చేయజూస్తే మసి పూసుకోక తప్పదు ఎన్నాళ్ళైనా!! కోల్పోయిన సామాజిక జీవనం చీకటి రాత్రుల్లో కోల్పోయిన వెలుగు
కవిత్వం

నా క్యాలెండర్

ఇంట్లో క్యాలెండర్ లేదు పొడిచే పొద్దు నడి నెత్తిన పొద్దు కుంగిన పొద్దు ఇదే నా లెక్క ఇదే నా రోజు కూసే కోడి నా అలారం మొరిగే కుక్క నా అప్రమత్తత కి ఆధారం నిప్పు ఇచ్చే పొరుగు లేదు సూరీడు తొలి కిరణం గుడిసె తాటాకు లోనుండి నా ముఖం పై నా మేలు కొలుపు భుజాన కాడి ముందు నడిచే ఎద్దులు నేల దున్న నడక కాళ్లకు చెప్పులు లేవు పల్లేర్లు పక్కకి నా పై దయతో సాగే అరక నేల నాది తరాలుగా అడవి నాది దుంప నాది పండు నాది తేనె
సమీక్షలు కొత్త పుస్తకం

చదవాల్సిన కవిత్వం

నీలం సర్వేశ్వర రావు  సంపాదకత్వంలో వెలువడిన "మల్లయోధ" కవితా సంకలనంలో మల్ల యోధురాళ్ళ పై లైంగిక వేధింపుపై  రాజ్యం మను ధర్మ  పాలన పై కవులు కవయిత్రులు వివిధ కోణాల్లో తమ కలాలను నిశితంగా నిర్భయంగా ఝుళిపించిన తీరును పరిశీలిస్తే ఆయా భావాల్లో పిడికిళ్లు బిగించగలిగే  శక్తి గలదని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. కొన్ని కవితలు చప్పగా వున్ననూ తిరుగుబాటు స్పష్టంగా కనిపించింది. రేపటి స్ఫూర్తి పొద్దులు కవితలో "వారు స్త్రీలు  ఒంటికి మట్టిపొరల వస్త్రం కప్పుకున్న పాలపిట్టలు అని కుస్తీ లోని ప్రాథమిక సత్యాన్ని వివరిస్తూ" క్రీస్తు పూర్వం 2023 దేశభక్తి కొత్త నిర్వచనం జాతి గీతం అయింది
కవిత్వం

పరాభవమే!!

వాడు ఆమెను అచ్చట పీఠమెక్కించి మదంతో పేట్రేగుతున్నాడు వీధుల్లో జనావాసాల్లో ఒక కూలి కూలి డబ్బులు అడిగితే దౌర్జన్యం కూలిపై మూత్ర విసర్జన ఎక్కడిదా ధైర్యం?! ఎవడ్ని చూసుకుని ఆ దుశ్చర్య?! వాడు వాడి మను బంధువు కాబట్టే! ఆమె ఆది వాసి కూలి ఆదివాసి ఆమెకీ పరాభవం కూలికీ పరాభవమే తేడా ఏం లేదు అక్కడ కుర్చీ ఇక్కడ నేల అంతే!! చట్టం వాడికి చుట్టమే అవుతుంది ఎవడు కాదన్నా! ఫిర్యాదుకే భయ పడిన కూలి ఇక రాబందుల బెదిరింపులతో హడలి పోవు గోమూత్రం తాగే వాడు గో మలాన్ని ముఖానికి పూసుకునే వాడు అజ్ఞానం తో
కవిత్వం

అంధకారం

పులి లేడి ని చంపితే ప్రకృతి ధర్మం ఆహార వేట పెద్ద చేప చిన్న చేపనూ! చెట్టు కొమ్మ పండు బరువుకి వాలితే ప్రకృతే! కొమ్మ ను నరికేది నరుడే!! మనిషి మనిషి ని వేటాడితే వికృతి మనిషి ని రాజ్యం చంపదల్చుకుంటే ఎన్ కౌంటర్ హత్య లు కాపు కాసి చేసే రోజులు కావివి జన సమ్మర్దంలో బాహాటంగా ప్రత్యక్ష ప్రసార వినోద క్రీడలు ఇప్పుడు! అధికారం కోసం అహం రాజ్యం లో భాగం కులం మతం వనరు ద్రవ్యం కొలమానం లో దారిద్ర్య రేఖ ఊగిసలాట లో అటూ ఇటూ మనిషి వర్గాల కొమ్ము లేని
కవిత్వం

సంక్రాంతి

నగరాలు పట్టణాలు ఖాళీ పల్లెలు రద్దీ పండుగ సంక్రాంతి గొట్టాలు ఊదరగొట్టే వాతావరణం గతం వర్తమానం విషమం పల్లె తరిమితే పట్టణీకరణ  బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ పండుగకి పల్లెకు పయనం ద్రవ్యం పల్లెల్లో జొరబడింది  ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు అంతా పెట్టుబడి సంకలో సేద తీరు రాశుల కొద్దీ ధాన్యం లేదు వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా పెట్టుబడి అమ్మేదే ఎరువు పెంట దిబ్బల్లేవు చెరువు మట్టి తోలేది లేదు అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!! పంటలో
సాహిత్యం కవిత్వం

వనాన్ని మింగిన కులం

ఒక చాటింపు పొద్దు కుంగే వేళఓ సమూహ కలయికవంటా వార్పు రేపుడప్పు పై దరువు తో మరునాడు పొద్దు పొడిచే వేళబండెడ్లు సిద్దంగిన్నెలు తపేలాలతో తరలుఅంతా ఒకే చోటు వనం అంటే చెట్లుఇళ్లకు గొళ్ళెం పెట్టిచెట్ల కిందకిసమూహాలుగాసమూహ సంఖ్య బట్టి చెట్టు ఎంపికనీడ కోసం ఉసిరి లేదు మర్రి లేదువేప లేదు రావి లేదుచల్లని గాలి కాసింత నీడ ఆ వేళమంత్రం లేదుతంత్రం లేదుసామూహిక వికాసంలో భాగంమానసిక సంఘర్షణకు ఉపశమనంఅందరిలో ఒకరమై ఒకరికి ఒకరమైమాటలు చేతలు కలివిడిగా చెట్టు కొమ్మలకు వేలాడే వేటలుజంతు అనాటమీ లో ఆరి తేరిన చేతులుపొందిక గా పోగులుపొయ్యి మీద నూనె తాళింపు చిటపటఅల్లం
సాహిత్యం కవిత్వం

చిన్ని ఆశ

వెన్నెముక విరిగినంతబాధల్లోపురిటినొప్పులతోఅర్ధరాత్రి పుట్టాను నేను నా పుట్టుక తెల్లవారాకేనా బంధు మిత్రులకి తెలిసిందినాడు సమాచార వ్యవస్థ నేటి లా లేదు సుమా! తెలిసీ తెలియ గానే కేరింతల్లోనా శ్రేయస్సు కోరే వారంతాఏం జరిగిందిఏం జరగబోతోంది తెలియని తనం లోవర్తమాన కోలాహలం చరిత్ర పునాది గా తొలినాళ్ళలో అంబాడుతూ పడుతూ లేస్తూబులిబులి నడకలతో తప్పటడడుగులతో నేనుతప్పొప్పుల బేరీజు తోభారీ ప్రణాళికలతో తల్లితండ్రులునా ఉజ్జ్వల భవిష్యత్తు కోసం రచనలు నిర్విరామంగా ఎదుగుతున్న కొద్దీనాకోసం ఆస్తుల సృష్టినా ఆధీనంలో ఎన్నో కర్మాగారాలు సంస్థలుఇరుగు పొరుగు తో సత్సంబంధాలునెలకొల్పుకుంటూసామ దాన భేద దండోపాయాల తో ముదిమి వయస్సు లోకొడుకులు నా ఆలనాపాలనా గాలికొదిలినా ఆస్తులు
సాహిత్యం కవిత్వం

తునకలు మా ప్రాణం

మా పోలేరమ్మ కాడనరికిన దున్నపోలేరమ్మ తినదని ఎరుకేపోగులు వేసిదండేలపై వేలాడే ఎర్ర గులాబీలువాటికి ముల్లుండవ్ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటేవాడంతా ఘుమఘుమమీకేం నొప్పిదున్న మీది కాదునరికింది మీరు కాదుసాకింది సవర తీసింది మీరు కాదు కట్ట మైసమ్మ కాడఒక్క వేటుకి యాటనేసినంయాతలన్నీ బోవాలనిమా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాంబాగా అర్థమైతది ఆమెకీ మాకూవూర్లన్నీ జన సందోహం తోచెర్లన్నీ అలుగులు దుంకుతాయనితెగిన యాటల కుప్పలుమా పొట్టలు నింపు అదేందోమా గంగమ్మ తల్లి కీమా మల్లన్న కీమా కాటమయ్యకిమా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతంజంతు మాంసమే ఇష్టంమాకూ అదే ఇష్టంసిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండుమా అయ్య