స్టాన్ స్వామి హత్య చేయబడ్డాడు. హత్య చేసింది భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఇవ్వని కలిసి చేసిన హత్య ఇది. క్రూరమైన ఊపా చట్టాన్ని ఆమోదించిన భారత పార్లమెంటు దీనికి సాక్ష్యం. న్యాయాన్యాయాలు తేల్చే న్యాయవ్యవస్థ ఈ రోజు బోనులో నిలబడిడింది. న్యాయ వ్యవస్థ పైన, నల్ల చట్టాల పైన చర్చ జరగాల్సిన ఒక సందర్భం ముందుకు వచ్చింది. సమాజ పరిణామక్రమం ముందుకు వెళ్లే కొద్దీ ఆధునికంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పాత, మధ్య యుగాల స్వభావంతో పనిచేస్తున్నాయి.ప్రొ.సాయిబాబు కేసు మొదలు నేడు రైతాంగ ఉద్యమాల్లో, సీఏఏ ఆందోళనకారుల అరెస్టుల వరకు కోర్టులవ్యవహరిస్తున్న తీరు అందుకు