వ్యాసాలు

బెల్లంపల్లి నుంచి దండకారణ్యం వరకు: కామ్రేడ్ ఆనంద్ ఐదు దశాబ్దాల విప్లవ జీవితం

“నిరంకుశుడు మరణిస్తే అతని పాలన అంతమౌతుంది; అమరుడు మరణిస్తే అతని పాలన ప్రారంభమవుతుంది” అనే 19వ శతాబ్దపు డానిష్ తత్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ ఉల్లేఖనం, మేం చదువుకునే రోజుల్లో గోడలపై రాసే మా అభిమాన నినాదాలలో ఒకటి. కామ్రేడ్ ఆనంద్ ఇక లేడు. కానీ అతని ఆలోచన, ఆదర్శం, త్యాగస్ఫూర్తి, అలుపెరగని విప్లవోత్సాహం, నిర్విరామ విప్లవ సాధన తరతరాలకు స్ఫూర్తినిస్తాయి.సీపీఐ (మావోయిస్ట్) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ 2023 మే 31 న దండకారణ్య దట్టమైన అడవిలో గుండెపోటుతో కన్నుమూశాడు. దండకారణ్య ప్రజల మధ్యన పార్టీ సీనియర్ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)