యాసిన్‌మాలిక్‌ను ఉరితీయాలన్న ఎన్‌ఐఏ వాదనలను ఖండించండి 

యావజ్జీవ ఖైదీగా ఉన్న కశ్మీర్‌ పోరాట నాయకుడు యాసిన్‌మాలిక్‌ను ఉరి తీయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) మే 29న ఢల్లీి కోర్టులో వాదించింది. ఇటీవల ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటీషన్‌ మీద తుషార్‌మెహతా కోర్టులో తమ వాదనలు వినిపిస్తూ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అత్యంత ప్రమాదకరమైన, అరుదైన నేరానికి పాల్పడినందు వల్ల యాసిన్‌ మాలిక్‌కు ఇప్పుడు విధించిన శిక్ష సరిపోదని, ఉరిశిక్ష విధించాలని కోరాడు. ఆయన చేసిన నేరాల తీవ్రతను చాటడానికి ఒసామాబిన్‌ లాడెన్‌ పేరు కూడా ప్రస్తావించాడు. ఇలాంటి కఠినమైన శిక్షలు విధించకపోతే నిరంతరం ఎవరో ఒకరు సాయుధ తిరుగుబాటు చేస్తారని, సైనికులపై దాడి చేస్తారని, దేశంలోని ఒక ప్రాంతం విడిపోవాలనే ప్రచారం చేస్తారని అన్నాడు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు సిద్ధార్థ్‌ మృదుల్‌, తల్వంత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఉరిశిక్ష విధించాలనే ఈ వాదనలపై నీవు ఏమంటావు? అని యాసిన్‌ మాలిక్‌ను ప్రశ్నించింది. సాక్షాధారాలు, శిక్షా స్మృతి ఆధారంగా విచారణ జరపవలసిన న్యాయస్థానం నిందితుడ్ని ఇలా అడగడం ఆశ్చర్యకరం.

ఎన్‌ఐఏ దర్యాప్తు పరిధి నుంచి రాజకీయ ఉద్దేశాలతో వైఖరులు ప్రకటించడం చాలా మామూలైపోయింది. వాటిని న్యాయస్థానాలల్లో నెగ్గించుకోవాలని కూడా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌ విషయంలో అయితే రాజ్యాంగ వ్యవస్థలన్నీ సహజంగానే ఇలాంటి ఒకే మాట వినిపిస్తాయి.  దేశభక్తిని టెర్రరిజంగా మారాక జాతి విముక్తి ఉద్యమకారుడు ఉరి తీయవలసినంత ప్రమాదకారి అవుతాడు. ఇప్పటికి   విధించిన జీవిత ఖైదు చాలదని ఉరి తీయాలని కోరతారు. ఫాసిస్టు ప్రభుత్వంలోని న్యాయ ప్రక్రియ ఇలాగే ఉంటుంది. యాసిన్‌మాలిక్‌ మీద చేసిన ఆరోపణలు, వాటికి ఎన్‌ఐఏ సృష్టించే సాక్ష్యాధారాలు ఎలా అయినా ఉండవచ్చు. కానీ రాజకీయ ఉద్దేశాలతో ఆయనకు ఉరిశిక్ష విధించాలని కోరడం ఫాసిజంలో భాగం. ఫాసిజం అన్ని రంగాలను, వ్యవస్థలను దురాక్రమించాక  పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఫాసిస్టుల పోకడలను గమనిస్తే 29వ తేదీ నాటి ఘటన ఊరకే పోతుందనుకోడానికి లేదు. ఒక పథకం ప్రకామే ఫాసిస్టు సంస్థలు పని చేస్తున్నాయి. కాబట్టి ముందస్తుగా అప్రమత్తమై దీని గురించి ఆలోచించాలి. యాసిన్‌ మాలిక్‌ను ఉరి తీయానే వాదనలను ఖండిరచాలని ప్రజాస్వామిక వాదులకు విరసం విజ్ఞప్తి చేస్తోంది.

Leave a Reply