కవిత్వం

ఎన్నెల కల

నడుస్తూ మాటాడుకుందాం నడకాగితే మాటాడలేను ఈ రాతి పలకల మీద  చెంగున దూకి జారే ఆ పిల్లల లేత పాదాలను తాకి మాటాడుకుందాం ఎన్నెన్ని ఎన్నెల రాత్రులలో వెలిగిన ఈ నెగడు చుట్టూ కలబోసుకున్న కథలలో ఎంత దుఃఖం దాగి వుందో మరొకసారి మాటాడుకుందాం ఎత్తైన ఈ పచ్చని కొండలపై పహరా కాస్తున్న మేఘాల నడుమ సెంట్రీ కాస్తున్న ఈ పిలగాళ్ళ చూపులను దొంగిలించే  ఆ తోడేళ్ళ ద్రోన్లను కూల్చే  వడిసెల కథ చెప్పుకుందాం  ఒకసారి సూరీడా సూరీడా  త్వరగా రారమ్మని  పిలిచే ఆ తల్లి  ప్రసవ వేదన  అరణ్యమంతా వినిపించే  గాధ కదా  రా అలా లేలేత
కాలమ్స్ కవిత్వంలోకి

కొంచెం స్వేచ్ఛ కోసం క‌వితాలాప‌న

“You need a body to preserve your soul, not a set of abstract principles.”― Ahmed Mostafaచాలా విరామం త‌ర్వాత మ‌ళ్లీ.  క‌విత్వంలోంచి, క‌విత్వంలోకి.  జీవితంలోకి.  ఒకింత ధైర్యంతో  పునః ప్రారంభిస్తున్నాను. శివారెడ్డిగారి గారి కవితను నాకున్న పరిమితులలో మీతో పంచుకోవడం. అదీ ఒక కవితా సంపుటిలోంచి ఒక్క కవితనే. తనొచ్చిన దారిని మరువని వ్యక్తిత్వంతో అదే వాక్యంతో అదే గొంతుతో నిరంతరం జ్వలించడం, అక్షరాకాశంలో  మెరవడం శివారెడ్డి గారి సొంతం. ఇది తనకు తానుగా ఏర్పరచుకున్న దారి. ఆ దారిలో అనేక కొత్త పుంతలను చూపుతూ నడిపించడం తన ప్రత్యేకత. తనకు తానుగా ఎప్పుడూ
సాహిత్యం కవిత్వం

కదిలే కాలం..

ఎప్పుడో ఏదో ఒకక్షణాన కమ్ముకున్న చీకట్లుతొలగిపోక మానవు రాబందుల రెక్కలలోచిక్కిన పావురాలుఆకాశంలో ఎగరక మానవు వెనక్కి విరిచేసి సంకెళ్ళేయబడ్డమణికట్లు మరల పిడికిలెత్తిఅభివందనం చేయక మానవు ఓరిమితో ఎదురు చూడాలిసమయమింకా ముగిసి పోలేదుఅందరమూ మరొకసారికలుసుకొని కదిలే కాలమే ఇది!! (దేవాంగన, నటాషా, ఆసిఫ్ ఇక్బాల్ లకు బెయిల్ వచ్చిన సందర్భంగా)
సాహిత్యం కవిత్వం

యుద్దానికి ఆవల..

చిటుక్కుమని గండు చీమ మామిడి ఆకు తొడిమ కొరికిన సడి ఎంత గట్టిగా వినబడిందో టేకు ఆకు మొదలుపై వాలిన గోరపిట్ట కాలి గోరు శబ్దం టిక్ టిక్ మని చెవులని తాకింది  ఇంతలోనే గాలి మోసుకొచ్చిన టకటక బూట్ల శబ్దం ఎత్తుపల్లాల మధ్య హోరుగా వినిపిస్తూ ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం  మొదలైన యుద్ధం చివరాఖరుకు నెత్తుటి ముద్దల విసిరివేతతో హాహాకారాల ఆర్తనాదాలమయంగా అడవి హోరుపెట్టింది పుడమి తల్లి గర్భంలో దాగిన‌ సంపదను కాపాడుతూ ఒరిగిన ప్రాణాలు కొన్ని ఫాసిస్ట్ కార్పొరేట్‌ దొంగల ఆశలు కావలి కాసే ఆకలి కడుపుల జీతగాళ్ళ మృతదేహాలు కొన్ని  నేలపై కారిన ప్రతి రక్తపు బొట్టు ఎదురెదురు గుండెల మండే కన్నీటి చారికల గాయపడిన అమ్మతనం  పేలిన‌ ప్రతి తూటాకు కళ్ళుంటేతను వెళ్ళే దిక్కు చూపేదినోరుంటే సాక్షిగా