ఈబుక్స్ సాహిత్యం

జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్

ఈ సంచిక వ‌సంత‌మేఘం పాఠ‌కుల‌కు *జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్ * విప్ల‌వోద్య‌మ చారిత్ర‌క ప‌త్రాల రెండు సంక‌ల‌నాలు ఇస్తున్నాం. విప్ల‌వాభిమానుల‌కు ఇవి  అపురూప‌మైన కానుక‌లు. న‌క్స‌ల్బ‌రీ శ్రీ‌కాకుళ పోరాటాలు దెబ్బ‌తినిపోయాక తిరిగి ఉత్త‌ర తెలంగాణ‌లో భూస్వామ్య వ్య‌తిరేక స‌మ‌ర‌శీల రైతాంగ పోరాట ప్ర‌జ్వ‌ల‌న ఉవ్వెత్తున సాగింది. అది తెలుగు నేల అంతా విస్త‌రించింది. దానికి అక్ష‌ర రూపం 1981లో వ‌చ్చిన నాగేటి చాళ్ల‌లో ర‌గిలిన రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం. అది మొద‌లు 1984లో  మ‌హారాష్ట్ర కొండ‌కోన‌ల్లో ఊపిరి పోసుకుంటున్న ఆదివాసీ రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం దాకా ఈ రెండు సంక‌ల‌నాల్లో ఉన్నాయి.  ఇవి
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్త‌కం చ‌దివారా?

ఈ పుస్త‌కం మీ కోసం. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాల తీరును అర్థం చేసుకోడానికి ఈ పుస్త‌కం ఉప‌క‌రిస్తుంద‌ని మీకు అందిస్తున్నాం. చ‌ద‌వండి.. చ‌ర్చించండి. భారతదేశంలో వ్యవసాయంలో పెట్టుబడిదారీ సంబంధాలు వృద్ధి అయి పెట్టుబడిదారీ విధానంగా మారిందని, అయితే ఈ మార్చు సంప్రదాయ (క్లాసికల్‌) రూపంలో కాకుండా ఈ దేశ విశిష్ట లక్షణాలపై ఆధారపడి మాత్రమే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిని చూడాలని కొంతమంది వాదిస్తున్నారు. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, చివరకు రష్యా దేశాలలో ఇలాగే జరిగాయని చారిత్రక ఉదాహరణలు చూపెడుతున్నారు. నేడు అర్ధ వలస, అర్ధభూస్వామ్య విధానంలో సామ్రాజ్యవాదుల అదుపాజ్ఞలలో దేశంలో పెట్టుబడిదారీ విధానం వృద్ధి కావడం సాధ్యం
ఈబుక్స్

ఎం.ఎస్. ఆర్ కాగడాగా వెలిగిన క్షణం ( పీడిఎఫ్ )

ఎం.ఎస్. ఆర్ రాసిన రచనలన్నింటిలోను విప్లవ కరుణాత్మకత సృష్టంగా ప్రతిఫలిస్తుంది. ప్రతి సమస్యపట్ల సున్నితత్వం, త్వరితం అయిన ప్రతిస్పందన కలిగిన ఎం.ఎస్. ఆర్ ఈ రెండు సంవత్సరాలలో జరిగిన అనేక సంఘటనలపై విలక్షణమైన పద్దతిలో మార్క్సిస్టు దృష్టితో కవితలు రాసాడు. తన తల్లిపై ప్రేమతో స్త్రీల విముక్తికై రాసినా పీడిత కులానికి చెందిన విద్యార్థిగా రిజర్వేషన్ వ్యతిరేకులపై రాసినా, చుండూరు మారణకాండ పై రాసినా , గల్ఫ్‌ యుద్దం పె రాసినా కార్మికుల బాధలపె రాసినా తోటి కామ్రేడ్స్ అమరత్వంపై, శత్రువు నిర్భంధం, అణచివేతలపై రాసినా ఎన్నుకున్న కోణం విలక్షణంగా వుండి, ఆ నమన్యలకు వరిష్కారం నూతన ప్రజాస్వామిక
సాహిత్యం వ్యాసాలు

అమ‌రక‌వి యోధుడి డైరీ..

( పాతికేళ్ళు నిండకుండానే  విప్ల‌వ క‌వి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో  సెప్టెంబర్ 3, 1992న అమ‌రుడ‌య్యాడు. ఆయ‌న ర‌చ‌న‌లు  "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో   నవంబర్ 1992 లో అచ్చ‌య్యాయి. ఇందులో ఆయ‌న డైరీ   కూడా భాగమైంది.    చేగువేరా , భగత్ సింగ్ డైరీల‌తో పోల్చ‌ద‌గిన‌ది ఇది. చిన్న‌వ‌య‌సులోనే  ఎంఎస్ ఆర్ త‌న  భావ‌నాశ‌క్తితో విప్ల‌వ క‌విత్వాన్ని అజ‌రామ‌రం చేశాడు. ఇప్ప‌డు మీరు చ‌దువబోయేది ఆయ‌న పుస్త‌కానికి ముందు  *క్షమాపణ కోరుతూ...*  అని అచ్చ‌యిన ఆయ‌న డైరీ ర‌చ‌న‌. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌... వ‌సంత‌మేఘం టీం)  క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు  మేల్కొన్నాను.
ఈబుక్స్ మీరీ పుస్తకం చదివారా ?

మీరీ పుస్తకం చదివారా ?

సుప్ర‌సిద్ధ మార్క్సిస్టు లెనినిస్టు మేధావి సునీతికుమార్ ఘోష్ రాసిన పుస్త‌కం *భార‌త బ‌డా బూర్జువా వ‌ర్గం.పుట్టుక -పెరుగుద‌ల‌-స్వ‌భావం*.  ఈ పుస్త‌కం తెలుగు అనువాదం పిడిఎఫ్ మీ కోసం. విప్ల‌వాభిమానులు, కార్య‌క‌ర్త‌లు, రాజ‌కీయ అర్థ శాస్త్ర విద్యార్థులు త‌ప్ప‌క చ‌ద‌వాల్పిన పుస్త‌కం ఇది. కా. సునీతి దీన్ని 1985లో రాశారు. 2012లో మ‌రింత తాజా స‌మాచారంతో రెండో కూర్పు విడుద‌ల చేశారు. దానికి ఆయ‌న ఒక సుదీర్ఘ‌మైన ముందుమాట రాశారు. ఇప్ప‌డు మీకు అందిస్తున్న‌ది ఆ ముందుమాటే. కా. ఆశాల‌త ఈ పుస్త‌కాన్నిచ‌క్క‌గా తెలుగులోకి అనువ‌దించారు. 2018లో విప్ల‌వ ర‌చ‌యితల సంఘం  ప్ర‌చురించింది. దేశంలో ఉత్ప‌త్తి సంబంధాలు, భార‌త బూర్జువా వ‌ర్గ స్వ‌భావం,  విప్ల‌వ ద‌శ
సంభాషణ

నిషేధంపై విరసం అభ్యంతర పత్రం

5.5. 2021టు సోమేష్ కుమార్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు.ఫ్రంఅరసవెల్లి క్రిష్ణఅధ్యక్షుడువిప్లవ రచయితల సంఘం6-1-\16-7ఎ\1పెద్దిరాజు స్ట్రీట్ పైజర్ పేటవిజయవాడ-1520001విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం. రెఫరెన్స్: 1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73. 2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3. 3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన