తల్లి ఆవేదన
అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది. కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్ 2017 నుండి సమాధాన్ 2022 నుంచి సూరజ్‌కుండ్ దాడి జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు మంచి రోజు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది