సంభాషణ

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు. వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు
ఇంటర్వ్యూ సంభాషణ

హక్కుల భావజాలాన్ని హిందుత్వ అంగీకరించదు

1. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ దాడులను హక్కుల నాయకుడిగా ఎలా చూస్తున్నారు? వామపక్ష భావాలుగల మేధావుల పైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్న బిజెపి రాజ్యాంగ సూత్రాలకు దూరంగా వెళ్లిపోయింది. ప్రజాస్వామ్య ప్రాతిపదికన పరిపాలనను తిరస్కరించి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలపరంగా పరిపాలన సాగించాలనుకోవడం సమస్యకు మూలం. పరిపాలన పరంగా భారత రాజ్యాంగానికి, హిందుత్వ భావజాలానికి మధ్య వున్న తేడాను బిజెపి చెరిపివేసింది. దీని వల్ల సమాజం చాలా నష్టపోతున్నది. తనకు నచ్చని భావజాలంతో వున్న వారిపై దాడులకు దిగుతోంది. మనుషుల విశ్వాసాలను ప్రమాణంగా తీసుకొని వేరు చేస్తుంది. వేరైన వారిని ఏరివేయాలని పరితపిస్తోంది. అందుకు గాను జాతీయ దర్యాప్తు
సంభాషణ

ఇది తెలంగాణ ప్రశ్నా స్ఫూర్తిపై నిషేధం!

తెలంగాణలో పనిచేస్తున్న పదహారు ప్రజా సంఘాలను తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధిస్తున్నట్టు జి ఓ ఎం ఎస్ నం 73 ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వులు అప్రజాస్వామికమూ, రాజ్యాంగ వ్యతిరేకమూ, తెలంగాణ స్ఫూర్తికి వ్యతిరేకమూ మాత్రమే కాక, ఈ జీవో రచనలో, విడుదలలో లెక్కలేనన్ని అసంగతాలున్నాయి. మొట్టమొదట మార్చ్ 30న జారీ అయినట్టు, ఆ రోజునుంచే అమలు లోకి వచ్చేటట్టు ప్రకటించిన ఈ జీవో పత్రికలకు, ప్రచారసాధనాలకు, ఇరవై నాలుగు రోజుల తర్వాత, ఏప్రిల్ 23 సాయంత్రం అందింది. ఏ జీవో అయినా వెలువడిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి బహిరంగంగా రావాలి గాని మూడు
సంభాషణ

అంతిమ వీడ్కోలుపై నిషేధమా ?

తెలంగాణ ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను నిషేధించింది. సాహిత్య రంగంలో పనిచేస్తున్న విరసం మొదలు విద్యార్థి సంఘాలు, హక్కుల సంఘాలను తెలంగాణ ప్ర‌భుత్వం నిషేధించింది. వీటిలో అమరుల బంధుమిత్రుల సంఘం కూడా ఉంది. ఎన్‌కౌంట‌ర్‌ల‌లో  చనిపోయిన విప్లవకారుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించడం, వారి అంత్యక్రియలు విప్లవ సాంప్రదాయంలో జరిపించేప‌ని ఈ సంఘం చేస్తోంది. చనిపోయిన వారికి చివరి వీడ్కోలును వారు నమ్మిన పద్ధ‌తుల‌లో జరపడం  ఒక మానవీయ విలువ‌.   ఇది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకే నిషేధించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో విప్లవకారుల అంత్యక్రియలకు ఇప్పుటి తెలంగాణ ప్రభుత్వపు పెద్దలలో అనేక మంది హాజరైన వాళ్లే.  అధికారంలోకి
సంభాషణ

ప్రజా సంఘాలపై నిషేధం ఫాసిస్టు చర్య

తెలంగాణ ప్రభుత్వం కొత్త గా నిషేధించిన ప్రజాసంఘాలన్నీ అణగారిన వర్గాల కోసం రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం నిబడ్డవే.  ఇన్ని సంఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్బంధం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. దశాబ్దాలుగా ప్రజాక్షేత్రంలో పనిచేసే రచయితలు కళాకారులు పౌరహక్కుల కార్యకర్తలు రైతులు కార్మికులు మహిళలు ఆదివాసీలు విద్యార్థులు రాజకీయ కార్యకర్తలు అందరూ ప్రభుత్వం దృష్టిలో సంఘ విద్రోహ శక్తులు కావడం ఆశ్చర్యం.  ఇప్పుడు నిషేధానికి గురైన ఈ ప్రజాసంఘాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో అగ్ర భాగంలో నిలబడినవే. అధికారంలో భాగస్వాములు కాకుండా ప్రజల పక్షంలో నిలబడి ఉండటమే నేరమైంది. ప్రజా
అనువాదాలు సంభాషణ

న్యాయం కోసం ఎదురుచూస్తూ మరణించిన కంచన్

కంచన్ నన్నవరే వైద్య చికిత్సలో నిర్లక్ష్యం ఉందా లేదా అనేది జ్యుడిషియల్ దర్యాప్తు మాత్రమే నిర్ణయిస్తుంది. ఒక విషయం స్పష్టంగా ఉంది: భర్తకు సమాచారం ఇవ్వకపోవడం ద్వారా జైలు అధికారులు చట్టాన్ని ఉల్లంఘించారు. మెడికల్ బెయిల్ విషయంలో ఆమె న్యాయవాదులుగా బాంబే హైకోర్టులో సీనియర్ న్యాయవాది గాయత్రీ సింగ్, న్యాయవాది అంకిత్ కులకర్ణి, ట్రయల్ కోర్టులో (పూణే స్పెషల్ కోర్ట్) న్యాయవాదులు రోహన్ నహర్, రాహుల్ దేశ్ ముఖ్, పార్థ్ షా చేశారు. --- ఎల్గర్ పరిషత్ కేసు విస్తృత, వివరణాత్మక మీడియా దృష్టిని ఆకర్శించగా, పూణే మహిళా సెంట్రల్ జైలులో అనారోగ్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని,
ఇంటర్వ్యూ

భారతదేశ మహిళా ఉద్యమంపై బి. అనూరాధ ఇంటర్వ్యూ

భార‌తదేశ మహిళా ఉద్యమాన్ని ఎన్ని దశలుగా చూడవచ్చు? 1857 లో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైనప్పటినుండీ 1947 వరకు జరిగిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లోనూ “స్వాతంత్రోద్యమంలోనూ” మహిళల భాగస్వామ్యం చెప్పుకోదగినవిధంగా ఉంది. ప్రత్యేక మహిళాఉద్యమంగా రూపొందకపోయినా ఆ పోరాటాల్లో పాల్గొనడం ద్వారా వారు పితృస్వామ్యాన్ని ఢీకొన్నారు. వారి భాగస్వామ్యం అర్జీలు, విన్నపాలు సమర్పించడం దగ్గర నుండి, ఊరేగింపులూ పికెటింగ్ లు, ధర్నాలు, నిరాహారదీక్షలు, స్వచ్ఛంద అరెస్టులు తదితర రూపాల్లో కొనసాగడమే కాకుండా జాతీయ విప్లవకారులుగా సాయుధచర్యల వరకూ అన్నిటిలో పాల్గొన్నారు. 1917 నుండే అఖిల భారత స్థాయిలో మహిళా సంఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వాతంత్ర పోరాటంలోనూ కొంత
ఇంటర్వ్యూ సంభాషణ

విరసం రచయిత్రి నల్లూరి రుక్మిణితో ఇంటర్వ్యూ

కథలు రాస్తూ నవలలోకి రావాలని ఎందుకు అనిపించింది? నా కథలు అన్నీ దాదాపు సామాజిక సమస్యలకు సంబంధించినవే. ఈ రకమైన ఇతివృత్తాలకు 'చమక్కు' మనిపించే నైపుణ్యతకంటే 'నెరేటివ్‌' విధానం- పాఠకుడికి సులభంగా అర్ధమవడానికి వీలవుతుంది. అందువల్లే నేను కథను నైపుణ్యీకరించే క్రమం మీద ఎక్కువ శ్రద్ద పెట్టలేదు. సామాన్య పాఠకుడికి చేరాలన్నదే నా లక్ష్యం. దానివల్ల నా కథలు పెద్దవిగా వుండేవి. అలా రాస్తున్న క్రమంలో కథకంటే నవలలో జీవితాన్ని మరింత వివరించగలననిపించింది. అంటే, జీవితంలో వుండే ఆర్థిక సామాజిక, రాజకీయ ప్రాధాన్యతలను చెప్పడానికి నవలలో అయితే వీలవుతుందనుకున్నాను. నా మొదటి నవల 'నర్రెంక సెట్టు కింద' అలా