సాహిత్యం కథలు

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?
సాహిత్యం కథలు

సమరంలో సంబరాలు

విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల స‌హాయంతో నడుస్తున్నారు. గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే
కథలు

అడవి నేర్పిన అమ్మతనం

(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత) మీనూ, నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను. ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను. నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
సాహిత్యం కథలు

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
సాహిత్యం కథలు

బేన్

అల్పిక “టియ్యారెస్‌ని బేన్ చేస్తారా?” “ఏమ్మాట్లాడుతున్నావ్?” “అంటే పదహారు ప్రజాసంఘాలనీ బేన్ చేసారు కదా?” “ఔను... అయితే?” “అంటే తెలంగాణ సాధనకోసం వాటితో కలసి టియ్యారెస్ పనిచేసింది కదా?” “అవంటే ఉద్యమ సంఘాలు” “మరి టియ్యారెస్ ఉద్యమ పార్టీ కదా?” “.....................?!?.....................”
గల్పిక కథలు

ఆర్టికల్ 19 vs జీవో 73

“పదహారు ప్రజా సంఘాలను యెందుకు నిషేధించారు?” “మొదటిది... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను యెత్తి చూపుతున్నాయి...” “ఔను, ప్రజాస్వామ్యంలో యెవరు పడితే వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడం తప్పే” “అంటే విమర్శించి రెచ్చగొట్టి తమ సంఘాల వైపు ఆకర్షిస్తున్నాయి...” “నిజమే, ప్రభుత్వాలు ఆకర్షణ శక్తిని కోల్పోయినట్టవదూ?, యింకా నేరం” “రెండోది... అన్నల ఆదేశంతో బీడు భూములు ఆక్రమించేసుకుంటున్నారు...” “ఔన్లే, లీడర్స్ ఆక్యుపై చెయ్యొచ్చు... బడా బడా కంపెనీలకు వేల ఎకరాలు అప్పనంగా రాసివ్వొచ్చు కానీ బీదా బిక్కీ బీడు భూములు దున్నుకోవడం తప్పే” “అంతేకాదు, రాజ్య నిర్బంధం మీద నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు” “ఊ... నిరసన కార్యక్రమాలకు అవకాశం
సాహిత్యం కథలు

సుబ్రమణ్యం కంట తడి

ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌
కథలు

ఆవు శాస్త్రం!

వయసు మీద పడ్డ వైస్ ఛాన్సలర్  కళ్ళద్దాలు తుడుచుకొని కళ్ళు పులుముకొని రెప్పలు ఆడించి చేతిలోని ఆర్డర్‌ని మరోసారి చూశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి వచ్చిన లెటర్ అది. మళ్ళీ చదువుకున్నారు. క్షణకాలం అలానే వుండిపోయారు. రిజిస్ట్రారూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినరూ డీన్లూ డిపార్టుమెంటు హెడ్లూ సూపరింటెండెంట్లూ యింకా ప్రొఫెసర్లూ కొద్దిమంది స్టూడెంట్లూ వారి నాయకులూ అంతా అయన వంక చూశారు. ఒకరకంగా అది ఇంటర్నల్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే కాన్ఫిడెన్సియల్ మీటింగ్. ‘నేషనలిజమ్... జాతీయవాదం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యీ ప్రతిపాదనలు చేసింది...’ అన్నారు ఛాన్సలర్. ‘విద్యారంగం అందుకొక మార్గం... సో’ అని ఆగిపోయారు.
సాహిత్యం గల్పిక కథలు

ఆవు యేమనును?

మేధావులందరూ వొక్క చోట చేరారు. ‘జై శ్రీరామ్’ చెప్పుకున్నారు. వాళ్ళ మెదళ్ళ కుదుళ్ళలో దేశ భవిత దాగుందని వాళ్ళకే తెలిసిపోవడంతో మదముతో మేధో మదనమునకు సిద్ధపడ్డారు. గోడకు వేళ్ళాడదీయబడ్డ దేశ యేలికుని చిత్రపటం చూస్తూ ‘ఆ తెల్లని గడ్డంలో యేమి కనిపిస్తోంది?’ అని అడిగి, అంతలోనే ‘ఆ తెల్లని గడ్డంలో దాగిన మర్మమేమి?’ అని దిద్దుకున్నారు వృద్ధ పెద్దమనిషి. ‘స్వచ్ఛత’ అన్నారు కొందరు. ‘పాలవంటి తెల్లని స్వచ్ఛత’ అన్నారు యింకొందరు. ‘మాకు దేశ శిఖరాయమాన హిమాలయాలు కనిపిస్తున్నాయి’ అన్నారు మరికొందరు. ‘మాకయితే పాల సముద్రం కనిపిస్తోంది’ అన్నారు మిగిలిన అందరూ. ‘నాకయితే తెల్లని ఆవు కనిపిస్తున్నది’ యెంతో సౌమ్యంగా