సమీక్షలు కొత్త పుస్తకం పరిచయం

మహిళలు నిర్మిస్తున్న కొత్త ప్రపంచపు పోరాట  కథలు

46 ఏళ్లుగా చదువుకొంటున్న విప్లవోద్యమ సాహిత్యం మరీ ముఖ్యంగా కథ నవల ఉత్తర తెలంగాణా జిల్లాల  భూమి పుత్రుల, భూగర్భ ఖనిజాలు తవ్వి తీసే సింగరేణి కార్మికుల, ఆదిలాబాద్ అడవి బిడ్డల అక్కడి నుండి సరిహద్దులు చెరిపివేసి మొత్తంగా ఆదివాసుల  జీవన సంఘర్షణలను, బతుకు పోరాటాలను నావిగా చేసుకొనే సంస్కారాన్ని ఇచ్చాయి.  సకల సామాజిక ఆర్ధిక రాజకీయ మానవ సంబంధాల సారం భూసంబంధాల తో ముడిపడి ఉన్నదని, దానిని ఉత్పత్తి శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్చే మహత్తర యుద్ధం జరుగుతున్నదని అర్ధం అయింది. ఆ యుద్ధంలో భాగమైన మహిళల అనుభవ కథనాలు కథలుగా ఇన్నాళ్లుగా  చదువుతున్నవే. .వాటిని ఇప్పుడు
కవిత్వం

ప్రియ పాలస్తీనా…

పాలస్తీనా ఓ నా పాలస్తీనా నీవు స్వేచ్ఛకై తపిస్తున్న దానివి పసిపిల్లల నవ్వుల్లో ఆట పాటల్లో వారి బాల్యపు గుర్తులను చెదరనియకుండ చెదిరిపోతున్న దానివి నీవే కదా పాలస్తీనా నేల మీద నిలబడి అడుగులు వేస్తున్న చోట కాందిశీకులమై పోతున్న వేళ పారుతున్నదంత చమురు కాదు ప్రజల నెత్తురు దారలే కదా ఆధిపత్య యుద్ధాల కోసం అరబ్ లే యూదులంటు మతం రంగుపులిమి చమురు దేశాల మీద చితిమంట పెర్చిరి కదా పాలస్తీనా ఓ నా పాలస్తీనా హద్దులు సరిహద్దులను చెరిపేస్తూ ప్రేమను పంచుతూ స్వేచ్ఛకై నీవు చేస్తున్న పోరాటం నీ ప్రజల భవితకై ఉద్యమిస్తున్న నీ ఆరాటం
కవిత్వం

సమూహాన్ని నేను

నాకంటే ఎంతో ముందు నువ్వెందుకెళ్ళిపోయావ్ ఈ భూమ్మీంచి.. బాధ్యతగా బహు మురిపెంగా నువ్వల్లుకున్న సామ్యవాద సిద్ధాంతాల ఏ ఏ సమీకరణల నిర్ధారణ కోసం నిన్ను నువ్వే మరిచిపోయే ఏకాంత అగాధాల్లో తలమునకలై ఉన్నావో అక్కడ.. నా పురా స్మృతుల ఎన్నటికీ అలసిపోని జ్ఞాపకాల కడలి అలల హోరులో ఎప్పటికీ సజీవంగా చెలిమి కాంతులీనుతూనే వెలుగై ఉంటావు నా సురా.. నాదేముందిలే.. ఎముకలనంటే చర్మపు గూడవడానికి ఈ దేహం పడే ఉబలాటదేముందిలే గాని.. చుట్టూతా చిక్కనవుతున్న చీకటి అయినా కొలిమిలో నిప్పులు ఇంకా మండుతూనే ఉన్నాయి.. పరుగెడతాయనుకున్న పాదాలు పడావైపోతేనేం నిటారుగా నిలబడాల్సినవి నీరుగారిపోతేనేం.. ఎడతెరిపి లేని నిప్పులవాన ఊపా
కవిత్వం

 కొన్ని నాస్తిక గొంతులు

వేదాలు సృష్టి ధర్మాలు దైవ వాక్కులు లిఖిత మార్గాలు నాల్గు వేదాలూ జీవన పద్దతుల్ని భాషిస్తుంటే వర్గ బేధాలు దమన కాండ రూపాలౌతున్నాయి ఏ మత గ్రంథమైనా ధర్మాన్ని గొడుగు లా కాస్తుంది. మంచిని తొడుగుకొమ్మంటుంది సూక్ష్మ ంగా చూస్తే వృత్తి విద్య కుల విద్య కు పరిమితం కాలేదు విశ్వవేదిక పై ఎంచుకునే వృత్తి కి స్వేచ్ఛ వుంది సమస్య అంతా ఎక్కడ బానిసత్వం తొంగి చూస్తుందో ఎక్కడ అజ్ఞానం రాజ్యమేలుతుందో ఎక్కడ వివేకం నశిస్తుందో ఎక్కడ శ్రమ విలువ జారిపోతుందో అక్కడ చైతన్య దీపాలు వెలగాలి అక్కడ తిరుగుబాటు నడవాలి కొన్ని సమస్యలకు నిరసన ఆయుధ
ఆర్ధికం

అస్తవ్యస్తంగా భారత ఆర్థిక వ్యవస్థ

భారత దేశ ఆర్థిక, రాజకీయ చిత్రం పరిశీలిస్తే దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుకుందని తెలుస్తోంది. నిత్య జీవితావసర వస్తువులు గోధుమలు, బియ్యం, వంట నూనెలు, వంట గ్యాస్‌, పాలు వంటి వాటి ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కానీ సాధారణ కార్మికుల వేతనాలు సంవత్సరాల తరబడి ఎదుగుబొదుగు లేకుండా ఉన్నాయి. వేతన జీవుల మధ్య వ్యత్యాసం రోజురోజుకు పెరిగిపోతున్నది. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షగా మారిపోయింది. దేశంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తున్నది. వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది.  గ్రామీణ నిరుద్యోగాన్ని కొంతమేర నిలువరించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను 30శాతం ఈ సంవత్సరంలో తగ్గించి
వ్యాసాలు

పాఠ్య ప్రణాళిక సమస్యలు

పాఠశాల విద్యలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో వివిధ అంశాల్లో సమస్యలు కొనసాగుతుండగా లేదా తీవ్రతరం అవుతుండగా,  ఇప్పుడు కొత్తగా పాఠ్య ప్రణాళిక సమస్య ముందుకు వచ్చింది. పూర్వ పరాలు పరిశీలిస్తే: 1986 లో ‘‘విద్యలో జాతీయ విధానం 1986’’, దానిననుసరించి 1989లో ‘‘జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం 1989’’ వచ్చాయి. అది ప్రధానంగా కాంగ్రెస్‌ జాతీయ వాదం, కాంగ్రెస్‌ సెక్యులరిజం, కాంగ్రెస్‌ శాస్త్ర దృక్పథంపై ఆధారపడి ఉండిరది. కొన్ని ప్రముఖ ప్రగతిశీల విషయాలు కూడా ఉండినాయి. ఏదేమైనా ఆనాటి విధానాలు భారత రాజ్యాంగ విలువలను స్పష్టంగా పునరుద్ఘాటించి, అట్టి విలువల సాధనకై రూపొందించబడినట్లు ప్రకటించాయి. ఆచరణలో చాలా సమస్యలుండినాయనేది
సంపాదకీయం

విశ్వవిద్యాలయాలా ? శిశు మందిరాలా ?

కేంద్ర ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ` 2020లో భాగంగా ఐకెయస్‌ను ఆచరణలోకి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ఇప్పుడు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా వెయ్యిమంది అధ్యాపకులకు భారతీయ జ్ఞాన వ్యవస్థలలో డిగ్రీస్థాయిలో బోధించడానికి అనుగుణంగా సుశిక్షితులను చేసే కార్యక్రమాన్ని యుజిసి ప్రారంభించింది. గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ, పోస్టు గ్రాడ్యుయేట్‌ స్థాయిలోనూ రాబోయే విద్యాసంవత్సరం నుంచి భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, జీవన విధానాలపై ఒక అవగాహన కల్పించడం దీని వుద్దేశం. అలాంటి పాఠాలను బోధించడానికి వీలుగా అధ్యాపకులకు శిక్షణ యిస్తున్నారు. యుజి స్థాయిలోనూ, పిజి స్థాయిలోనూ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా దీనికి సంబంధించిన రెండు కోర్సులను పూర్తిచేయాలనే నిబంధనను యుజిసి