కవిత్వం

అవిశ్రాంత యోధుడు

ప్రపంచాన్ని క్షుణ్ణంగా చూసిన వాడు బహు ధ్రువ ప్రపంచాన్ని వర్ణించిన వాడు వైరుధ్యాలను పసిగట్టి ఇంటర్ రిలేషన్ షిప్ కు దారులు వేసిన వాడు అవిశ్రాంత యోధుడు మాతృభూమి రక్షణకు నిలిచిన వాడు గుండె నిశబ్దాన్ని హేళన చేసిన వాడు కాలం వీరులకే సలాం చేస్తూందన్నాడు ఓ మహాకవి అది నీవే కదా మిత్రమా నీవే కదా నేటి వీరుడవు.
కవిత్వం

హజర్ దిన్ మేరా ప్యార్ ఉమర్ మియా..

"జనగన మన" పాడకుండా ఉంటే దేశ ద్రోహి అయ్యే ఫాసిస్ట్ దేశంలో నీవు జాతి కోసం గొంతెత్తవు మనల్ని మనుషులుగా గుర్తించని నేల లో మనకు స్వేచ్ఛ కావలన్నావ్.. ద్వేషం కక్కే హిందూ మతోన్మదాం పై ప్రేమ గెలవాలన్నావ్.. జీవించే,మాట్లాడే హక్కును చిదిమేసిన నగ్నపు రాజ్యానికి నీ మాట తూటాల కనిపించింది.. నిన్ను "హజర్ దిన్" బందీ చేసి తాను గెలిచాను అనుకుంటుంది.. తనకు తెలీదు అది ని ముందు మొకరిల్లిందని... ( ఢిల్లీ యూనివర్సిటీ హిస్టరీ రీసెర్చ్ స్కాలర్ ఉమర్ ఖలీద్ ని బందీ చేసి 1000 రోజులు అవుతున్న సందర్భంగా)
కవిత్వం

సికాస నిప్పు

విచ్చుకత్తుల బోనులో శత్రువుతో చెడుగుడు ఆడి బొగ్గు గనుల్లో ఉద్యమ ఊపిరులు ఊది సింగరేణిలో విప్లవ మంటలను రాజేసిన సికాస సింహం నీవు నూనూగు మీసాల నవ యవ్వనంలో జగిత్యాల జైత్రయాత్రవై ఇంద్రవెళ్లి తుడుం మోతవై ఆదివాసీ అగ్గిబరాటవై జనతన సర్కారు నిర్మాతవై శ్రామిక రాజ్యపు సారధివై ఎత్తిన ఎర్రజెండాను యాభై ఏళ్లుగా విరామమెరుగక మోసిన విప్లవ ప్రేమికుడివి నీవు పాలక పోలీసు ఎత్తుగడలను చిత్తు చేస్తూ, చివరి వరకు శత్రువుకు చిక్కని 68 ఏళ్ల చిచ్చర పిడుగువు సింగరేణిలో రాజుకొని దేశమంతా వెలుగులు జిమ్మిన సికాస నిప్పువు నీవు వసంత గీతమై వెదురుగానమై దండకారణ్యమంతా విస్తరించిన దూద్
కవిత్వం

ఎదురు వనము ఎంట దెచ్చిన..

యాలపొద్దున యేరు దాటిన చిరుత నోటిిని చీల్చి లేచిన.. డ్రోను డేగల కూల్చి వేసిన.. దొంగ దాడుల శత్రు మూకల.. నేల గూల్చి నేరు గొచ్చిన.. ఎదురు పొదల ఎంట దెచ్చిన.. దారి జూపే దుసురు తీగా.. దూప దీర్చే మోదుగాకూ.. మాటు గాయే మడ్డి చెట్టూ.. గుట్టు జెప్పే బోడు మిట్ట.. వొడిల దాచిన గుండ్లు వడిసెలు.. మోపు గట్టిన ర్యాల పండ్లూ.. మాగ బెట్టిన శీత ఫలమూ.. పైలమేనా ఆ కాయలన్నీ.. కత్తు వెంట కాలి బాట దింపి పంపే జారు బండ.. వొంపు దేలిన మా డొంక తల్లీ.. వోదలి వస్తనే వనం బిడ్డల..
కవిత్వం

ఆనంద్

అతని అక్షరాలుఅనంత కోటి పీడితజనహృదయ వేదనలోవెలిసిన నక్షత్రాలువెలుగు ఇవ్వటమే వాటి పని అతని అక్షరాలుప్రజల ప్రతిఘటన పోరులోచెక్కిన శిల్పాలురేపటి చరిత్రకు మూలాలు అతని అక్షరాలుఅమరుల రక్తములోతడిసిన విత్తనాలు ఏ పొలంలో చల్లినాఆయుధాలే మొలుస్తాయి
కవిత్వం

విప్లవ కటకం!

తాను చిరునవ్వు,చిరునామా,రాజ్య భోజ్య భస్మ ప్రాకారాల నిర్మిత కటకం….తాను దూరతీరాల సుదర్శన జనతన జాగృత ఆనంద దాయక కటకం…..విచ్చితి చిత్తంబుల చిరు కానుకుల ఘనీభవించే ఘీంకార కటకం….దారిద్రయ విముక్త దర్శన భాగ్యపు కథ కథల కటకం….అహో నావయవ్వన లోకపు దృక్పథాల చరమగీతపుహాహాకారపు కటకం….వస్తున్న వీస్తున్న దండకార్యపు కార్యకదనపు కటకం…..కనుల కావ్యపు కాలాతీత కార్యం ప్రమోద ప్రధాన ప్రదీప కటకం……విప్లవ కటకం అది విప్లవకటకం….
కవిత్వం

లేచి రా సారూ

ఏభై ఏళ్ళ మీ ఉద్యమ‌ ప్రయాణానికిసెలవంటూ నిష్ర్కమించారా మీ చేతులలో పెరిగినఎన్నెన్ని పోరాట రూపాలు మొక్కవోని మీగుండె నిబ్బరం చివరి శ్వాసవరకూ రాస్తూనే వుందన్నవార్త మీ ఆచరణకు గీటురాయి వసంత గీతంఆలపిస్తూ సాగినమీ నడక యీ అసహనఅపసవ్య వేళలోఆగిపోయి మమ్మల్నిఒంటరి చేసారు కదా సారూ ఈ ఏరువాకపున్నమి రోజు మరలమీరు సేద్యం చేయఈ నాగేటి చాళ్ళలోఉదయిస్తారు కదూ!! లే లేచి రా సారూమీ ఆకు పచ్చని ఎర్ర చుక్క టోపీధరించి ఏకే‌ అందుకునిధూలా ఆడుదురు (కామ్రేడ్ సుదర్శన్ సారుకు వినమ్ర జోహార్లతో)
కవిత్వం

నల్ల కలువ..!

అదితెలంగాణ నేల విముక్తి కోసంసాగిన సాయుధ రైతాంగ పోరాట కాలమదిదేశ ముఖ చిత్రాన్ని కర్రు నాగలితోచెక్కినవసంత మేఘ గర్జనలోపల్లెలన్నీ తడిసాయి..ఆ వర్షపు జల్లుఅన్ని పల్లెల్ని కలిపాయి..ఆ ధారగోదావరికి తాకింది.. నాటిగొండ్వాన రాజ్యంనుస్పూర్ సంస్థానంమావో నాటే - మావో రాజ్(రాజ్యం) లోపురుడోసుకున్న కటకం.! ఎన్నిఅంతరాల దొంతరలున్నవ్యవస్థలోఅతనోఒక నల్ల కలువఈ నేల మాగానపునల్ల రేగడిసింగరేణినల్ల బంగారంపు రుపుఈ దేశపు వెలుగుఅతను.. ఆరు పదులు దాటిననాలుగు పదుల ఉద్యమంనాలుగు పాదాల రాజ్యాన్నిదిక్కరించిన సుదర్శనంఅతను. అతనుఎవరని చెప్పాలిఒక విద్యార్థి ఉద్యమమనా..ఒక సికాసా అనా..ఒక రైతాంగ కార్యకర్త అనా..నల్ల ఆదిరెడ్డి, రాజలింగం సోపతాఅతను ఎవరని చెప్పాలి.ఎన్ని అని చెప్పాలి.ఏమని చెప్పాలి అతనోఉద్యమంఅతనోయుద్ధ గీతికఅతనోవిముక్తి బాటఅతనోగెరిల్లా..అతనేకటకం సుదర్శన్అతనేపోరుబాటకు
కవిత్వం

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఇప్పుడు జరిగే వైమానిక యుద్ధాలు మాకు కొత్తవి కావచ్చు మా తాతలు,ముత్తాతలు చెప్పిన కథలు, చేసిన యుద్ధాలు మా మస్తిష్కంలో ఇంకా భద్రంగానే ఉన్నాయి మీరు చేసిన అన్యాయాల, అక్రమాల తడి ఆరనేలేదు నివురు కప్పిన నిప్పులా మాకు తెలిసిన యుద్ధాన్ని దాచుకొని మా హక్కుల కోసం అందరి సహజ సంపద కోసం రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడమే మా నేరం అయితే యుద్ధం మాకు కొత్తేమీ కాదు మీరు న్యాయ వ్యవస్థని కొనుక్కున్నా మా మీద అత్యాచారాలు జరిగినా కోర్టు తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చినా సహించాం... సహిస్తున్నాం భరించాం.. భరిస్తున్నాం కానీ ఇప్పుడు నీ పాడు
కవిత్వం

కడుపు కోత

ఎక్కడోఒక తల్లి కన్నపేగు తెగింది..తండ్రి ఆశలు ఆవిరి అయ్యాయి..అమ్మ,నాన్న వస్తారుఏదో తెస్తారనిఎదురు చూసే చూపులువాళ్ళు రాలేరన్న వార్త వినిఎక్కి ఎక్కి ఏడ్చాయి. అవికుటుంబం కోసం కూలి పనికిదేశం మొత్తం సంచరించే వలసజీవితాలు..ఇప్పుడు మన నేతలువాటికి లెక్కలు వేస్తారు,బాగానే ఉంది.. అమ్మ కడుపు కోతకు..నాన్న కన్నీళ్లకు..పసి పిల్లల భవిష్యత్తుకు..సమాధానం చెప్పేదేవరు..?ఈ మారణఖండకు కారణం ఎవరు..?వాళ్ళ బాధలో భాగంగా..😰(ఒడిశా రైలు ప్రమాదం పై) 03.06.2023