కవిత్వం

ఊరేగింపు

అనాదిగా మన పుర్రెల నిండా నింపుకున్న నగ్నత్వం వాడికిప్పుడొక అస్త్రం అయింది ఆ తల్లుల దేహ మాన ప్రాణాలను నగ్నంగా ఊరేగించి భయపెట్ట చూస్తున్నాడు వాడి వికృత చూపుల వెనక దాగి వున్నది మణిపూర్ ఒక్కటేనా కాదు కాదు కాదు దండకారణ్యం నుండి మలబారు వరకూ దేశ శిఖరంపైనున్న కాశ్మీరు దాకా ఎన్నెన్ని దేహాలను మృత కళేబరాలను నగ్నంగా ఊరేగించాడు వారి కాలికింద నేలలోని మణుల కోసం గనుల కోసం బుల్డోజర్తో ఊరేగుతూ బరితెగించి పెళ్లగిస్తూ వస్తున్నాడు వాడు నవ్వుతూనే వుంటున్నాడు దేశం ఏడుస్తూ వున్నప్పుడు దేహం రక్తమోడుతున్నప్పుడు పసిపాపల దేహాలు నలిపివేయబడుతున్నప్పుడు స్రీత్వం వాడికో ఆయుధం దానిని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 ఆధునిక రామాయణం విద్వేషం తెంపిన తల వెదురు మనిషైంది నెత్తురొడుతున్న ప్రశ్నలా కళ్ళుమూసుకొని ఈ దేశం కళ్ళల్లోకి చూసింది మనిషిని పశువుకన్న హీనం చేసిన విలువల్ని గర్భీకరించుకున్న శవపేటిక మీది కౄరజంతువుల్ని దేశం నిండా విస్తరించిన అన్ని దిక్కుల్ని ధిక్కరిస్తూ మూసిన పెదాల్తో నవ్వింది 'అబ్దుల్ కలామ్ ప్రథమ పౌరుడైయ్యాడు గుజరాత్ ముస్లిం నెత్తుట్లో దాండియా ఆడాక దళిత రుధిరవర్షం ఉత్తర భారతాన్ని ముంచి వేస్తున్నప్పడే దళిత కోవిందు కొత్త ప్రథమ పౌరుడైయ్యాడు ఆదివాసీ ముర్ము ప్రథమ పౌరురాలైయ్యాక మరణ మృదంగ విన్యాసాలు ఆదివాసి కొండలు లోయలు అడవుల్లోకి విస్తరించాయి' హహహ అని అరిచింది కవులకు కళాకారులకు
కవిత్వం

జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటా

సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో ఆగదు ప్రవాహమై సాగుతూ అమరత్వం దగ్గర ఆగుతుందిచీకటి అలుముకున్న ఈ అడవిలో ఎంతోకొంత కాంతినిచ్చేదిఆ మోదుగుపూలేనాలాంటి బాటసారికి దప్పిక తీర్చేవి కూడా అవేఅందుకే కాసింత ఎక్కువ ప్రేమ నరికివేతలో ఒక్కో పువ్వు నేల రాలగానే చాటుంగానైన ఏరి తెచ్చుకుంటాఆ పరిమళపు జ్ఞాపకాన్నిపదిలంగా దాచుకుంటా.
కవిత్వం

“రద్దు”

నగ్నంగా ఊరేగించబడింది అత్యాచారం గావించబడింది అత్యంత దారుణంగా హత్యగావించబడింది ఆదివాసీలు, అడవి బిడ్డలు మాత్రమే కాదు. ఇంకేదో.. ఇంకా ఏదో, ఏదేదో... * బలహీనుల ఎదుట అధికారం అస్సలు మాట్లాడదు నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకుంటూ వెడుతుంది. హక్కుల్నే కాదు మాన ప్రాణాల్ని రద్దు చేసేస్తుంది మీరింకా పాఠాలు మాత్రమే మారిపోయాయని, అనుకుంటున్నారు. చిన్నప్పటినుండి చేస్తున్న 'ప్రతిజ్ఞ 'ను కూడా మార్చేసిన విషయం ఇంకా తెలియదు. మనుషులందరూ సమానం కాదని అందరూ సోదర సోదరీమణులు కాదని అందరికీ హక్కులు ఉండవని వాళ్లు కొత్త గొంతుతో ప్రతిజ్ఞ మొదలుపెట్టేశారు * నోట్ల కన్నా ముందే స్త్రీత్వం, మనిషితనం ఆత్మగౌరవం,
కవిత్వం

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు

నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు నిజాం పోలిక సరిపోదు హిట్లర్ ముస్సోలిని అస్సలు అతకదు ఇంతకన్నా గొప్పగా చెప్పడానికి నాక్కొన్ని మాటలు కావాలిప్పుడు మనిషి కాదు పశువు మద మగ మృగం ఊ...హు! కీచకుడు దుశ్శాసనుడు ఐనా అసంపూర్ణమే "మో- షా"ల మొఖం గుమ్మాలమీద ఉమ్మేయడానికి జనం ముక్కోపం పదకోశంలో లేని మాటలు కావాలి తిట్ల దండకాల గ్రంథాలలో దొరకని మాటలు కావాలి అందుకే, నాక్కొన్ని మాటలు కావాలి గుజరాత్ నుండి కాశ్మీర్ మీదుగా ఇప్పుడు మణిపూర్ దాకా మంటలతో వచ్చాడు వాడు కొండకీ మైదానానికీ మధ్య చిచ్చు పచ్చగడ్డేసి రాజేసి మతం మంటల్తో చలిమంటలు కాగుతాడు వాడు నెట్
కవిత్వం

మంటల హారం

మైదానాల్లో ఆంబోతుల అకృత్యాలకు తల్లులు సాధు మాతలు తల్లడిల్లుతున్నారు ఒకనాడు సైన్యానికి ఎదురుగా దిశమొలగా నిలబడ్డ ధిక్కారాలు నేడు పొరుగువాడి దౌర్జన్యం ముందు తలదించుకుంటున్నారు. మైదానాల్లో చెలరేగిన చర్య లోయలను వణికించే పదఘట్టన ప్రతిచర్యలు చిందించే హింసోన్మాదంలో నిస్సహాయ జాతులు అణిగిపోతున్నాయి . నెపాలను మోపుతూ ఒక కుట్ర దురాలోచనలు దట్టించిన ఒక వ్యూహం ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ఒక ప్రణాళిక మణిపూర్ కు మంటల హారాన్ని తలకెత్తుతున్నవి. పరిణామాల విస్తీర్ణాన్ని వాస్తవాల వ్యాసార్ధం కొలవలేనప్పుడు అతలకుతల తలమే అడవిగా నిలబడుతుంది. జరుగుతున్నదంతా అలవిలేని దృశ్యమై బోరవిడిచి హింసాంగమై చెలరేగినపుడు సున్నితత్వం నలిగి బండబారుతుంది. కదలిపోయిన చరిత్రలకు వక్ర కషాయాలద్దే
కవిత్వం

తెలుగు వెంకటేష్ ఐదు కవితలు

మణిపూర్ దుఃఖం 1 ఈ నొప్పికి బాధ ఉంది మనుషులమేనా మనమసలు ఈశాన్య మహిళలు మనకు ఏమీకారా భారత మాత విగ్రహానికి మువ్వన్నెల చీర కట్టి మురిసిపోయే మనం ఇపుడు ఏమి మాట్లాడాలి నగ్నంగా ఊరేగించి అత్యాచార హింసను అమ్మలపై చేస్తోన్న రాజకీయ అంగాలు చెద పట్టవా ఆకుల్ని రాల్చినట్టు ప్రాణాల్ని మంటల్లో విసిరే కిరాతక హంతకుల్ని ఎన్ని వందలసార్లు ఉరి తీయాలి కసాయి హింసకు మన నిశ్శబ్దం తరాల ధృతరాష్ట్ర మౌనమేనా పూలను ప్రేమించని ఈ రాతి మనుషులకు నొప్పి గురించి ఎవరు పాఠాలు చెబుతారు ఈ ముళ్ళచెట్లను నడిమికి విరిచే కొడవళ్లు ఎపుడు మొలుస్తాయి ఒక
కవిత్వం

విజయ చిహ్నాలు

★Victory Signs★By Moumitha Alam-west Bengal.【A poem on Manipuri Kuki tribal women who have been Paraded Naked & raped 】★విజయ చిహ్నాలు★తెలుగు అనుసృజన-గీతాంజలి ఓ..నా ప్రియమైన కుకీ తల్లులారా., మన భారత దేశంలో.. మన శరీరాలే యుధ్ధక్షేత్రాలు కాదంటారా ? పురుషులు నీళ్ల సీసాలు దొరక్క..వాటి కోసం కొట్లాడు తున్నప్పుడు కూడా.. *నీ యమ్మ..నీ తల్లిని..నీ చెల్లిని దెన్●● అనే యుగాల నుంచీ అలవాటైన బూతులతో మొదట మన తల్లులనే శపిస్తారు ! మన బట్టలు తొలగించబడతాయి.. మన మీద కిరాతకంగా లైంగిక అత్యాచారం జరుగుతుంది. క్రూరమైన జంతువుల గాయాలతో మన దేహాలు
కవిత్వం

మేము అర్బన్ నక్సలైట్లమైతాము

ప్రజలు అంటరానితనానికి గురౌతున్నప్పుడు లైంగిక వేధింపులకు గురౌతున్నప్పుడు మతం ముసుగులో మునుగుతున్నప్పుడు మూఢనమ్మకాలకు బలౌతున్నప్పుడు మేము కలం నుండి జాలువారిన కన్నీటి చుక్కలమైతాం ఆదివాసీ హక్కులకై ఉద్యమించినప్పుడు వారిపై వైమానిక దాడులు జరుగుతున్నప్పుడు దేశపు సహజ సంపదను దోచుకుపోతున్నప్పుడు ఈ దేశ ఆదివాసీ ముఖంపై ఉచ్చ పోసినప్పుడు మేము ప్రశ్నించే మొక్కలమై మొలకెత్తుతాం కాలేజీలో దేశ చరిత్రను విప్పి చెప్పినప్పుడు సమాన హక్కు గురించి మేము పోరాడినప్పుడు ఈ దేశపు అన్యాయాన్ని అక్షరమైన మేము ప్రశ్నించినప్పుడు రాజ్యం మా పైన పీడియఫ్లు ఉపా కేసులు పెట్టినప్పుడు ఈ రాజ్యం దృష్టిలో మేము అర్బన్ నక్సలైట్లమైతాము
కవిత్వం

అంతం తప్పదు

శాంతి పావురాలను చిదిమేసే "శాంతిదూత" జగానికి "ప్రేమ" దిక్సూచిననిప్రకటిస్తున్నాడు ఆక్రమణదురాక్రమణలతో శాంతిని నెలకొల్పుతానంటున్నాడు ప్రపంచ దేశాలసంపదను దోచుకునేముఠా నాయకుడు..మారణహోమం జరిపేరక్త పిపాసిఆనందంగా ఉండే అన్నాతమ్ముళ్లకీ చిచ్చుపెట్టే జిత్తులమారి నక్కపెట్టుబడిదారీ రక్కసిజగత్తుపై జరిపేహింసోన్మాదానికి నల్ల రాజు తర్వాతిబంటు ఈ తెల్లవాడు..తెలుపు, శాంతికి చిహ్నంఈయన మనసు, అశాంతి క్రోధానికి నిలయం..విశ్వవ్యాప్తంగా పెల్లుబికేప్రజా వెల్లువలోఆకలి మంటల్లోనిరుద్యోగపు జ్వాలల్లో..శ్వేతసౌధం నిశ్శేషం కాక మానదు.యుద్ధోన్మాది అంతం తప్పదు..