కవిత్వం

మరువలేని క్షణం

ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది పాల కోసం తల్లడిల్లుతున్న ఆ బిడ్డను చూసి పాలకై తన రొమ్ములను ఎగేసి గుద్దుకున్న ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది రాజ్యం నేరస్తులను సత్ప్రవర్తనతో రిలీజ్ చేసినప్పుడు "బిల్కీస్ బానో" మనోవేదనకు కారణమైన ఆ న్యాయస్థాన అన్యాయాన్ని కన్నీళ్ళతో లెక్కించిన నిస్సహాయపు ఆ క్షణాల్ని ఎలా మరువగలం? ఓ నినాదం మన మస్తిష్కంలో మతాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలంతా మానవత్వాన్ని మరిచి మతానికై పరుగులు తీస్తున్నప్పుడు "బార్బీ మసీదు"లను కూలగొడుతున్నప్పుడు న్యాయం అన్యాయాన్నే మరలా అనుసరించినప్పుడు టీవీల ముందు కండ్లల్లో ఒత్తిడేసుకుని మనమంతా నోరు మెదపకుండా చూస్తున్న మతస్వార్థ మానవత్వపు ఆ క్షణాల్ని మనం
కవిత్వం

అమ్మ మాట

నాలుగు గోడల మధ్య నుంచి నలుగురి మధ్యలో నిలవాలన్న నలుగురిలో గెలవాలన్న నలుగురిని గెలిపించాలన్నా నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్న నాలుగు రాళ్ళు పోగేయలన్న నలుగురిని సంపాదించు కోవలన్న నలుగురికి సాయo చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులు ఎప్పుడు ఎదురుచుస్తుoటాయి నీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయి గుడి బడి తల్లి తడ్రులు లాంటి వాళ్ళని మంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూ ఎప్పుడు హితాన్ని మరవకూడదని సత్ మార్గంలో పయనించలని పరుల ఘోషకు కారణం కాకూడదని చెబుతూ ఉండేది అమ్మ!!
కవిత్వం

చెలిమి బంధాన నడక

వయసుని మరచిన మండు వేసవి ఆకాశంలోకి తొంగి చూస్తూ ఆ వేసవి గాలుల నడుమ మొహం నిండా చెమటతో బాల్యం తాటి చెట్టుపై ఉన్న కాయలను తినాలని ఆశ ప్రకృతిలో మమేకమైన అమాయకత్వం పచ్చని పైరుల మధ్య కూర్చోని..ముచ్చటిస్తూ... తాటి ముంజలు తింటున్నా... అన్న, చెల్లి, తమ్ముడు... ఆ మాటల మధ్య సంధ్యాకాలం దాటుతోంది పశ్చిమాన ఆస్తమా సూర్యుని చూస్తూ... మళ్ళీ వేకువనో, వసంతానో కలుద్దామని వెనుతిరిగారు.
కవిత్వం

పల్లిపట్టు నాగరాజుమూడు కవితలు

1 కుటిలమేధయాగం -------------------------- కంటిలో నలుసట్టా పడితేనే కళ్లు రుద్దుకునే మనం పొరకముల్లు గుచ్చుకుంటేనే వెదికి మరీ తీసిపారేసే మనం * బతుకుదారుల్లో బలిజముళ్లను చల్లుతుంటే బర్రిమీద వానకురిసినట్లుండమే అర్థంగావట్లేదు.!? * మనిషితనానికే శత్రువయినోడు మనుషుల బాగెట్టా ఆలోసిస్తాడు మనిషి మెదడు ప్రాణంతో కదలటం సహించలేనోడు మనిషి బుర్రకు పదునుపెట్టే సదువెట్టా వుండనిస్తాడు * కాయని కాయని పండుని పండని ఉన్నదున్నట్టు కంటితో చూడలేని కుంటిచూపులోడు మురికిని మురికని చెబితే ఒప్పుకుంటాడా.? అజ్ఞానాన్ని కడుక్కోమన్న ప్రతిసారి అంధకారపుగెవుల్లో తోయడానికే ఎత్తులేస్తాడు గాని ఇదిగో మరకని వేలెత్తి చూపనిస్తాడా?! చూపుడు వేలుపై ప్రశ్నను మొలవనిస్తాడా?? * దీపాలు వెలిగే దారుల్ని
కవిత్వం

ఆట పాటల రూపు

ఆట వైతివా అన్న పాట వైతివా జనహోరు గుండెల్లో రాగమైతివా ధన ధన మోగెడప్పు దరువువైతివా...."2" ఎగిసేటి ఉద్యమాల గురువువైతివా...2" పొడిసేటి పొద్దుల్లో వెలుగుగైతివా "ఆట వైతివా" వెలివాడ బతుకుల్లో ఎట్టి చూసినవ్ ఏతలన్ని పోయే పోరు బాట వట్టినవ్ ప్రశ్నించే పాటవై మేలు కొల్పినావు .."2"... పాలకుల గుండెల్లో దండోరావైనవ్ " ఆట వైతివా" నల్లమల అడవులన్ని కలియతిరిగినవ్ నమ్ముకున్న పేదప్రజల గోసచూసినవ్ సమ సమాజ స్థాపన ధ్యేయమన్నవు..."2" అమరులే..ఆదర్శ మూర్తులన్నావు "ఆట వైతినా" పసిపాప నవ్వంత స్వచ్ఛమైంది స్వార్థమే లేనట్టి ప్రయాణం నీది సామ్రాజ్యవాదం పై పోరాటం నీది...."2" దాన్ని కొనసాగించే నినాదం మాది.
కవిత్వం

భూమిని మాటాడనివ్వు…

మనమింకా‌ బతికే వున్నామా? ఇదేదో‌ భేతాళుని‌ భుజాన‌ వేలాడే రాజు ప్రశ్న కాదు వాదనలు‌ ముగిసిన‌ వేళ వాడొక్క మాటతో‌ ఫుల్ స్టాప్ పెట్టేసే వేళ అటూ ఇటూగా సరిపెట్టుకుంటే నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు వాడి తుపాకీ‌ మొన ముందు వారి మానం ఛిద్రమైన వేళ కోర్టుల ముందు నగ్నంగా నిలబడిన తల్లులను వంచించిన నీ న్యాయం నీకు నైతిక విజయమా? కోల్పోయిన మానానికి కళ్ళు లేని‌ న్యాయం ధర కడుతుందా? తాను రుజువు చేయలేని ఆ పదముగ్గురినీ వాకపల్లిలో నిలబెడితే న్యాయమేదో బిగ్గరగా వినబడేది కదా? పదారేళ్ళ నీ విచారణకు తమ కొంగు చివర కట్టుకున్న
కవిత్వం

కిటికీ

జైలు గదుల ఉక్కపోతల నుండి ఉపశమనం కోసం అతడు కిటికీ తెరిచాడు ఎదురుగా సముద్రం... బయటి సముద్రం లోపటి సముద్రం అలయ్ బలాయ్ తీసుకున్న చోట ఆకాశం నక్షత్ర కాంతుల వెదజల్లింది సహనానికి మారు పేరైన భూమి తన విముక్తి కోసం సంకెళ్లకు చేతులిచ్చి సహనంగా ఎదురుచూసే రేపటిలోకిచూపులు సారించే మానవ మహా సంకల్పానికి జే జే లు పలికింది
కవిత్వం

పల్లె పిలుస్తోంది…!

చిగురుటాకుల్లో వెన్నెల చూపుల్లో తడిసి లేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూ ముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానే చిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కా ఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలు పిల్లలు పల్లె కు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలో జీడి చెట్ల కొమ్మల్లో అడుగులు వడివడిగా మురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకుని మంచు బిందువుల్ని పూసుకుని ఎగిరే పక్షుల వెంట ఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకుని నా పల్లె లో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్ని వెలిగించుకుని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 కమ్మటి దాల్చా తెలంగాణమా! నా ప్రాణమా!! ఒక గుడి ఒక మసీదు ఒక చర్చి నడిచి వెళ్ళే ఇంటింటికి ఇనుప గోడలల్లుతున్న సాలీలు తిరుగుతున్నాయి గడపలకు విద్వేష బొట్లు పెడుతున్నాయి దుఃఖం మీద దునుకు లాడుతూ దూర దూరాలు పంపిణీ చేస్తున్నాయి వాటి అడుగుల్లో మంటలు లేస్తుంటాయి వాటి మాటల్లో మృత్యు వాసనొస్తుంది నా ప్రియతమా! మూసి ప్రవహిస్తున్న గుండెల్లో మానవతా పరిమళాల మాగానివి గోదావరై ప్రేమలు ప్రవహించే దానా! మనసులు కలిసిన చేతుల మీంచి ఇనుప నాడలతో నడిచిపోతున్నాయి పంట కావలి మంచై చార్మినార్ కమ్మటి దాల్చా జుర్రుకునే మతాతీత మనసులు అలాయి బలాయి ఆత్మీయతలు
కవిత్వం

రణం దిక్కైనోళ్ళు!!

తలమీది నీడను త్యాగం చేసుడు తమవల్ల కాదని తెల చెప్పినోళ్ళు కాళ్ళ కింది నేల కడుపాకలి తీర్చే వొనరది మాకు వొదలమన్నోళ్ళు రిజర్వాయరు రక్కసి కోరని ఎరుగక జిక్కి అల్లాడెటోళ్ళు యాడాది పైనాయె ఎద బాదుకుంటు మొరల్ బెట్టి బెట్టి మోసపొయ్నోళ్ళు దొంగలోలె పట్టి టేషన్లకు దెచ్చి బైండోర్లు జేసెనే దొరోల్ల రాజ్యం ఇంత కెవరీళ్ళో సెప్పనైతి నేను ఎత్తిపోతల కత్తి ఎదలోకి దిగిన సిన్నోని పల్లెంట బతుకగ్గి పాలై బజారు పడిన పల్లె రైతులీళ్ళు ఎట్లైతె అట్లాయె ఇట్లైతె కాదంటు లీడర్ల రంగెరిగి రణం దిక్కైన్నోళ్ళు.