సాహిత్యం కవిత్వం

తండ్రి తొవ్వ‌లో

మున్నా మున్నా మున్నా- నా చిన్నారి పొన్నారి కన్నా నాన్న ప్రేమకు నువ్వు వారధివి నా కలల ప్రపంచం సారధివి పృథ్వి అడిగే ప్రశ్న ఆకాశం నడుమ అడివే తీర్చింద సందేహం ॥ము­న్నా॥ నీ తండ్రి భుజంపైన బందూకురా నిన్నెత్తుకునే జాగ యాడుందిరా నీలాగే సుట్టూత జనసేనరా కొడుకైన జనంలో భాగమేరా పొద్దంత మీ నాన్న సూర్యుడైతే రాత్రంత ఎన్నెలై సెంట్రీగాస్తివా ॥ము­న్నా॥ నిన్ను పొమ్మంటు దీవించలేనైతిరా నిన్ను వద్దంటు నేచెప్పలేనైతిరా నువు మెచ్చినా వనమంత జ్ఞానమేరా నీకిచ్చిన ఆస్తంత త్యాగమేరా నిన్ను చుట్టు వ­ట్టిందో పద్మవ్యూహం నువ్వభిమన్యుడైనావా ప్రజల కోసం   ॥ము­న్నా॥ పృథ్వంటు ఒక పేరు
సాహిత్యం కవిత్వం

అమరుని స్వప్నం

ఎంతటి నిషి ఈ వసంతాన్ని ఆవరించిననూ ఎంతటి కుంభవృష్టి ఈ వాసంతాన్ని ముంచిననూ ఎంతటి అనావృష్టి ఈ వసంతాన్ని వంచించిననూ వారు చుక్కలవలే వెలిగి జ్ఞానాన్ని వెలువర్చారు సూర్యునివలే గర్జించి శక్తిని చేకూర్చారు చినుకువలే స్పందించి వసంతానికి ఉపిరిపోసారు వారు ఉల్కాపాతం వలే ఊపిరినొదిలి ఈ పాలపుంతలో వారి జ్ఞాపకాలను ఆశయాలను వదిలిపోయారు అయితే మేమే శృష్టికర్తలమను గర్వంతో విర్రవీగే వాళ్ళకు వారి అమరత్వం తలచుకున్నా వెన్నులో వనుకే అందుకే స్థూపాన్ని ఆపాలనుకుంటారు సభలని అడ్డుకుంటారు పుస్తకాన్ని నిషేదిస్తారు
సాహిత్యం సమీక్షలు లోచూపు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
సాహిత్యం ఇంటర్వ్యూ సంభాషణ

దృక్ప‌థం అందించే ఎరుక వ‌ల్ల‌నే క‌థ గుర్తుండిపోతుంది

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి
సాహిత్యం కవిత్వం

మరణం అతనిదేనా….

  ప్రేమను వ్యక్త పరిచే   మానవులు వున్న నేలపైనుండి   ఒకానొక మనిషి   దారి చేసుకుంటూ తరలిపోయాడు.   పంజరాన్ని ధ్వంసం చేసి   పావురం కళ్ళల్లోకి చూచిన వేగుచుక్క-   దేహ రహస్యం తెలిసిన ఆఖరి మనిషి   భూమి ఆలింగనంలో   కంటి పాపను దాచుకున్నాడు    జాబిలి వైపు చిరునవ్వు విసిరి    అంధకారపు ఆకాశంలోకి     నక్షత్ర వల విసిరి     నేలపై వెలుగును శాశ్వతం చేసిన వాడు     మరణం అతనిదేనా     ఒక కలను మోసిన వారందరిది     ఆకలి
కథలు సాహిత్యం

స్వామి

అది వేదిక కాదు. ఒక ఆడిటోరియం కాదు. అక్కడున్న వాళ్ళందరు సమాజం నుండి బహిష్కరణకు గురైన వారే.  వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు  కూడా పేదరికంలో జీవిస్తూనే వున్నారు. వృద్ధుల సమూహంతో కూడిన ఒక పెద్ద గుంపు అక్కడ చేరింది. సాధారణ ప్రజలు అస్యహించుకునే బంకాటి కుష్ట్ కాలనీ అదే. ధన్బాద్ నుండి 8 కిమీ దూరంలో ఆ కాలనీ ఉంటుంది. ఫాదర్ స్టాన్ స్వస్థలమైన రాంచీ నుండి 145 కి.మీ దూరంలో వుంది. జెసూట్ పూజారి  ఫ్రేమ్డ్ పోర్ట్రెయిట్ ఒక మేకు నుండి చెట్టు కాండం పైన వేలాడదీయబడింది. దాని చుట్టూ ఉన్న బంతి పువ్వుల దండ  నిర్వాహకుల నిధుల
సాహిత్యం కవిత్వం

క‌ళ్లారా చూశాము

కామ్రేడా.... ఆర్‌కే అమరులు అస్తమయంలోనుంచే ఉదయిస్తారనే మాటను మొన్ననే మేము కళ్లారా చూశాము. ఆర్‌కే  అమడ‌య్యాడ‌న‌గానే ఎన్ని హృదయాలు అయ్యో.. ఆ మాట అబద్ధం అయితే బాగుండని తల్లడిల్లయో సరిగ్గా అప్పుడే చూశాము కామ్రేడా.. నీవు మరణిస్తూనే రెట్టింపు వెలుగుతో  ఉదయిస్తూన్నావని అస్తమయం క్షణకాలమని అది వేన వేల వెలుగుతో అరుణోదయం తప్పదని కామ్రేడా.. మేము మొన్ననే చూశాము ఉక్కు సంకల్పంతో నువ్వు హామీపడ్డ మాటని నేలకొరిగి నెరవేర్చినప్పుడు "జీవిస్తాం జీవిస్తాం ప్రజల కోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజల కోసమే మరణిస్తాం" అని నీవు హామీపడ్డ మాటను ఆలింగనం చేసుకున్నప్పుడు కామ్రేడా.... మేము మొన్ననే చూశాము  కోట్లాదిమంది
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌కుడు పోతులూరి వీర‌బ్ర‌హ్మం

పోతులూరి వీరబ్రహ్మం పేరెత్తగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆయన చెప్పిన కాలజ్ఞానం. ఏదైనా వింతలు, అద్భుతాలు జరిగితే ఇలా జరుగుతుందని ఏనాడో బ్రహ్మంగారు చెప్పారని అనుకోవడం పరిపాటి. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడమే కాదు, కవితా విమర్శ కూడా చేశారు. ఏది కవిత్వం? కవి ఎలా వుండాలి? కవితా లక్ష్యమేది అన్న విషయాల్ని కూడా చర్చించారు. ఆయన ఈ చర్చ చేయడానికి కారణాలనేకం. ముఖ్యంగా ఈయన ప్రబంధకాలం తరువాతవాడు. ప్రబంధకాలం నాటి కాలక్షేప రచనలు, మితిమీరిన శృంగార ప్రకృతి వర్ణనల్ని బ్రహ్మంగారు వ్యతిరేకించారు. అందుకై ఆయన సంఘ సంస్కరణాభిలాషతో కలం పట్టారు. వీరి రచనల్లో ప్రధానంగా కనిపించేది కాలజ్ఞానం కాగా మిగతా
సాహిత్యం కవిత్వం

దినమొక గండం పగలొక రాత్రి

రక్తంరుచి మరిగిన వలస రాబందులు వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని రాజ్యం రక్షణే ధ్యేయంగా మా విప్లవ కేంద్రాలకు వలస సాచ్చాయి "సమాధానో"ప్రహార దాడులలో రణరక్కసి ధ్యేయంగా రక్త దాహపు వేట రాజ్యానికి పసందైన ఆట. నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ రాజ్య నిర్బంధ శిబిరం 40 ఏళ్ల ఆవల నుంచే ఇక్కడ ఆ ఖాకీలకు మా రక్తం శీతల పానీయం మా శరీరపు మాంసపు ముద్దలు పంచభక్ష పరమాన్నాలు కానీ మా రక్తం   నిరంతర ప్రవాహం మా శరీరం అఖండితం స్మశాన ప్రశాంతత కోసమని హింస ప్రతి హింసల మధ్య యుద్ధ ఛాయలలో ఇప్పుడు ఊరు
సాహిత్యం కాలమ్స్ కథ..కథయ్యిందా!

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం