కవిత్వం సాహిత్యం

ఎడారి పుష్పం

పొగమంచు కౌగిలిలో ఈ రోజు తెలవారింది.నేల తన దేహాన్ని చలిపూలతో సింగారించుకుంది. నెగళ్ళ వేడిలో లోకం సెదదీరుతోంది మనసుని మంచుగడ్డలా మార్చేసినఈ శీతాకాల వేళనా రెప్పల మీద వెచ్చటి పెదవుల బరువునిమోపిపోయావుదేహం పులకరింతల పూల తపనల పలవరింతలలోచలించిపోయింది రేపన్నదొకటి నా ఆయుష్షులోకి దిగిఉంటేనేనేం కోరుకోవాలి? తల్లి ఒడిలాంటి వెచ్చదనం తెలిసిననీ ముద్దూనీ ఆలింగనం తప్పనీతో ఏకాంతంలో నడిచే కొన్ని అడుగులు తప్ప భయపడకు ప్రియామన అడుగులు పడే  దారిలో నీకై పూలూనాకై ముళ్ళూ ఉంచబడ్డాయిగాయాలనే పూలని నమ్మే నాకుపూలు కూడా గాయం చేయగల సున్నితమైన ప్రియురాలుండడం గొప్ప బహుమానం కదూ? కాదనే అనుకుందాం కాసేపు ఎడారి లాంటి నా
సాహిత్యం కవిత్వం

గణ “తంత్రం”

హక్కులు వచ్చాయనిఆనందపడే వాళ్ళుఅరడజను అయితే.. హక్కంటే ఏంటోతెలియక పూట తింటేమారు కూటికి లేనోల్లు 94 మంది.. ప్రజలను పాచికలు చేసిఆడిన ఈ చదరంగంలోహక్కుల కాలరాసేవాడు "రాజకీయనాయకుడ"య్యాడువాటి కోసం గొంతు చించేవాడు"రాజకీయ ఖైదీ" అయ్యాడు ఇదే గణతంత్రంనేటికి ఈ ఘనమైన "తంత్రం"ఏంటో అర్థం కాక బలి పశువైతున్నది మనమే.. చీకటి నిండినఈ మాయాజాలం లోనక్షత్రాల వెలుగు వచ్చేదెప్పుడో..! (72 ఏండ్ల గణ"తంత్ర" రాజ్యం పై)
సాహిత్యం కాలమ్స్ కథావరణం

అంట‌రాని వ్య‌థ‌ల మ‌ల్లెమొగ్గ‌ల గొడుగు

కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే.  మల్లెమొగ్గల
సాహిత్యం గల్పిక

పుస్తకాయుధాలు

ప్రసాద్‌, మన వీధంత పోలీసులంట. ఏమయ్యిందో ఏమిటో?’’ పొద్దున్నె నా భార్య అనే సరికి, నిద్రెగిరిపోయి లేచి కూర్చున్న ‘‘ఏంది?’’ తిరిగడిగిన అనుమానంతో ‘‘మన పక్క ప్లాట్‌ అంకుల్‌ పాల పాకెట్‌ కోసం పోతే వీధిల ఎవరిని లోపలికి, బయటకు కదలనీయటం లేదట, వందల మంది పోలీసులు...’’ మెదడు వేగంగ పనిచేయసాగింది. విషయం అర్థమైంది. కాని ఇంత త్వరగా వస్తారని ఊహించలేకపోయా! అయినా ఇంత మంది రావుడేమిటి ? అనుమానం తీరక విషయం తెలుసుకుందామని, లుంగిమీదనె బయలుదేరబోతుండగా, నాకు బయటకు పోయె శ్రమ తగ్గించారు! ముందు డోర్‌ను సుతారంగ పగులగొట్టి సాయుదులు లోపలికొచ్చారు. డోర్‌ దగ్గర మరికొంత మంది
సాహిత్యం వ్యాసాలు

చింతామణిపై నిషేధం చెల్లేనా?

సుమారు వందేళ్ల కిందటి(1923) ‘జనరంజక’ చింతామణి నాటకాన్ని ఆంధ్రపద్రేశ్‌ ప్రభుత్వం నిన్న(17.1.2022) నిషేధించింది. కొద్ది రోజుల కింద ఆర్య వైశ్య సంఘం వాళ్లు ఈ నాటకం తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదని, నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  వాళ్ల కోరిక మీదకు ప్రభుత్వం నిషేధించింది. కానీ నిషేధానికి కారణాలు చెప్పలేదు.   కాళ్లకూరి నారాయణరావు రాసిన ఈ నాటకాన్ని కాకినాడలోని సుజనరంజనీ ప్రెస్‌ తొలిసారి అచ్చేసింది. ఆ తర్వాత అనేకసార్లు పునర్ముద్రణ అయింది. బహుశా లక్షల కాపీలు ఐదు తరాల పాఠకుల దగ్గరికి చేరి ఉంటాయి. వేలాది ప్రభుత్వ గ్రంథాలయాల్లో చోటు సంపాదించుకొని ఉంటాయి. సొంత గ్రంథాలయాల్లో భాగమై
సాహిత్యం కవిత్వం

చేతనాస్తిత్వం

సంధ్యాకాశంలో కదులుతున్న సూర్యుడు చేతనలోంచి అచేతనలోకి వెడుతున్నాడు దూసుకొస్తున్న పున్నమి చంద్రుడు సుషుప్తిలోంచి సృజనలోకి వస్తున్నాడు నుసిలా రాలుతున్న చీకటిని కప్పేస్తున్న వెన్నెల వెలుగు దూరంగా వెలుగుతూ మలుగుతున్న చుక్కల రాయబారం ఘనీభవించిన నిద్ర మీద నిప్పురవ్వలా జ్వలిస్తున్న కలల దీపం ముఖం వాల్చిన పెరటితోటలోని పొద్దుతిరుగుడు పువ్వు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావి గిరక మీద కూర్చున్న ఊరపిచ్చుకల కిచకిచలు అస్తిత్వం చేతనమై కురుస్తున్న వాన చినుకులు చీకటిలోంచి తొంగిచూస్తున్న వెలుగురేఖల దృశ్యం దూరపు కొండలను స్ఫృశిస్తూ సంక్షోభంలోంచి స్పష్టతలోకి సంక్లిష్టతలోంచి సంఘర్షణలోకి సందేహంలోంచి సందోహంలోకి జ్వలిస్తున్న సూర్యుడు
సాహిత్యం కవిత్వం

బహిష్కరిద్దాం

తడికలు అడ్డెట్టి తెల్ల గుడ్డ కట్టి అదే వెండి తెర భావనలో నేల పై మూడు గంటలు కూసుని చూసిన సినిమా నేల టికెట్ నుండి కుర్చీ దాకా జనం ఎగబడితే ఏడాదీ ఆడిన సినిమా కథలో అదే మూస కథనంలో కొత్తదనం కాసులు కురిపించిన సినిమా రీళ్ళ డబ్బాలు టాకీస్ టూ టాకీస్ ఓ మాదిరి పెద్ద వూరిలో ఓ టాకీసు సినిమా బండ్లు పోటాపోటీ పోస్టర్లు మైదాతో గోడలపై వినోదాన్ని పంచిన సినిమా మూకీ నుంచి టాకీ దాకా నలుపు తెలుపు నుంచి రంగుల బొమ్మ దాకా సాంకేతిక హంగుల హోరులో పెంచుకున్న బడ్జెట్ సినిమా
సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
సాహిత్యం కవిత్వం

మృత్యువు దాడిచేసిన రాత్రి అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా సెకన్ల ముల్లు ఆగిపోయింది
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని