అనువాదాలు సంభాషణ

‘అతని మరణం వారికి కేవలం ఒక గణాంకం మాత్రమే’

‘ఇతర దేశాలలో ఒకరిని పొరపాటుగా విచారించినట్లయితే వారు పోలీసులపై లేదా ప్రభుత్వంపై కేసు పెట్టవచ్చు’ [ప్రధానమంత్రి నరేంద్ర మోడిని హత్య చేయడానికి కుట్ర పన్నారనే పోలీసులు చేస్తున్న ఆరోపణతో సహా యితర ఆరోపణలతో 2018 నుండి చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద విచారణ లేకుండా జైల్లో వున్న  కవి వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్‌లకు సీనియర్ అడ్వకేట్ ఆనంద్ ఆనంద్ గ్రోవర్ న్యాయవాదిగా ప్రాతినిధ్యం వహించారు.] స్టాన్‌స్వామి మరణం పట్ల మీ స్పందన ఏమిటి? ఇది మొత్తంగా నేర న్యాయవ్యవస్థ వైఫల్యం. పోలీసులు, ప్రాసిక్యూటర్, జైలు లేదా కోర్టు- అన్నిటి చట్ట నియమాలు విచ్ఛిన్నమై పోయాయి! అవి చట్ట
అనువాదాలు సంభాషణ

న్యాయవ్యవస్థపై ఒక మచ్చ

స్టాన్ స్వామి మరణం చాలా ఆందోళన కలిగించే సమస్యలను లేవనెత్తుతోది ఫాదర్ స్టాన్‌స్వామి కస్టడీ మరణం గురించి  వివిధ ప్రతిస్పందనలు వచ్చాయి. ఆదివాసీల, పీడిత ప్రజల హక్కుల కోసం పనిచేసే ఎనభై ఏళ్ళ వయసున్న సామాజిక కార్యకర్త కార్యకలాపాల గురించి తెలిసిన వారు అతను మరణానికి ఎంతో బాధపడుతున్నారు. చట్టాన్ని అమలుచేసే యంత్రాంగం, జైలు పరిపాలనా అతని పట్ల వ్యవహరించిన కఠినమైన, అమానవీయ ప్రవర్తన సంబంధీకులకు ఎంతో వేదన కలిగించింది. కానీ ప్రాసిక్యూషన్ చేసిన "గంభీర, తీవ్రమైన" ఆరోపణలమీద ఆధారపడి నిర్దిష్ట న్యాయస్థానం తీవ్ర అనారోగ్యంతో ఉన్న జీసట్ ప్రీస్ట్‌‌కి బెయిల్ నిరాకరించడమనేది మరింత వేదన కలిగించే విషయం.
సంభాషణ

బోనులో న్యాయ వ్య‌వ‌స్థ‌

స్టాన్ స్వామి హత్య చేయబడ్డాడు. హత్య చేసింది భారత ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు. ఇవ్వని కలిసి చేసిన హత్య ఇది. క్రూరమైన ఊపా చట్టాన్ని  ఆమోదించిన భారత  పార్లమెంటు దీనికి సాక్ష్యం. న్యాయాన్యాయాలు తేల్చే న్యాయవ్యవస్థ ఈ రోజు బోనులో నిలబడిడింది. న్యాయ వ్యవస్థ పైన, నల్ల చట్టాల పైన చర్చ జరగాల్సిన ఒక సందర్భం ముందుకు వచ్చింది. సమాజ పరిణామక్రమం ముందుకు వెళ్లే కొద్దీ ఆధునికంగా పనిచేయాల్సిన వ్యవస్థలు పాత, మధ్య యుగాల స్వ‌భావంతో  పనిచేస్తున్నాయి.ప్రొ.సాయిబాబు కేసు మొదలు నేడు రైతాంగ ఉద్యమాల్లో, సీఏఏ ఆందోళనకారుల అరెస్టుల వరకు కోర్టులవ్యవహరిస్తున్న తీరు అందుకు
సంభాషణ

పులి

"సార్ అతను చచ్చిపోయేట్టు వున్నాడు. మనం కొట్టిన దెబ్బలకు అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్" కానిస్టేబుల్ పరాంకుశం కంగారు మాటలకి డి.ఎస్.పి వజేరా చిరాకుగా మొహం పెట్టాడు.2 డిసెంబర్ 2002, సోమవారం మధ్యాహ్నం 3:45 కు, బిజీగా ఉన్న ముంబై దగ్గరి ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో బస్సు సీటు కింద గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన బాంబు పేలింది. బస్సు వెనుక భాగంలో బాంబు ఉంచారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఘట్కోపర్ చివరి స్టాప్ కావడంతో, బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే దిగిపోయారు. తిరుగు ప్రయాణానికి ప్రయాణికులు ఇంకా బస్సులోకి ప్రవేశించలేదు.
సంభాషణ

నిషేధంపై విరసం అభ్యంతర పత్రం

5.5. 2021టు సోమేష్ కుమార్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు.ఫ్రంఅరసవెల్లి క్రిష్ణఅధ్యక్షుడువిప్లవ రచయితల సంఘం6-1-\16-7ఎ\1పెద్దిరాజు స్ట్రీట్ పైజర్ పేటవిజయవాడ-1520001విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం. రెఫరెన్స్: 1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73. 2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3. 3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే
సంభాషణ కారా స్మృతిలో

అవుట్ బరస్ట్!

ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది. మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ
సాహిత్యం సంభాషణ కారా స్మృతిలో

చదువు!

‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని
ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా