నివేదిక

ఉద్యోగ హక్కు చట్టం చేయాలి

మిత్రులారా మీ అందరికీ పాలమూరు అధ్యయన వేదిక పక్షాన స్వాగతం ! భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ స్థాయిని అందుకోబోతున్నది ఎంత నిజమో ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగులున్న దేశం అనేది కూడా ఆ స్థాయి నిజం. అయితే నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వాలు, విధానకర్తలు ఏమీ చేయటం లేదు అనేది అంతకన్నా కఠినమైన నిజం. గత యుపిఎ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసిందని మేం అధికారంలోకి వస్తే దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన ఎన్‌.డి.ఎ పాలకులు ఆ విషయాన్ని వదిలేశారు. అలాగే 1994 నుండి మొదలైన మలిదశ తెలంగాణ పోరాటం
నివేదిక

Stop This State Terror Now!

Fourth Drone Bomb Attack on Indigenous People in Bastar, Chhattisgarh Indigenous (Adivasi) people in Bijapur district of Bastar, in the Indian state of Chhattisgarh, have been traumatised by yet another aerial bomb attack from the security forces which have been using drones to carry out these operations. Although the Indian Air Force is not officially deployed for combat in Chhattisgarh, the repeated use of aerial bombardment on civilian populations suggests
నివేదిక

మూడేళ్లలో నాలుగోసారి డ్రోన్  దాడి

తమ గ్రామాల్లో జరిగిన వైమానిక బాంబు దాడులకు (డ్రోన్ దాడులు) వ్యతిరేకంగా బస్తర్‌లోని ఆదివాసీ గ్రామస్తులు మరోసారి తమ గళాన్నెత్తారు. మీడియా నివేదికల ప్రకారం, బీజాపూర్ గ్రామస్తులు తమ గ్రామాలపై 2023 ఏప్రిల్ 7న డ్రోన్ దాడులు జరిగాయని ఆరోపించారు. జబ్బగట్ట, మీనగట్ట, కవరగట్ట, భట్టిగూడ గ్రామాలలో డ్రోన్‌లతో బాంబు దాడులు జరిగాయి. పైన పేర్కొన్న గ్రామాలలో ఉన్న మోర్కెమెట్ట కొండల దగ్గర ఉదయం 6 గంటలకు బాంబు దాడి ప్రారంభమైంది. పరిసరల పొలాల్లో అనేక బాంబులు పడ్డాయి, తరువాత 3 హెలికాప్టర్ల నుండి భారీ మెషిన్ గన్ కాల్పులు కూడా జరిగాయి. పడిన బాంబుల సంఖ్య నిర్ధారణ
నివేదిక

కోల్హాన్ యుద్ధ నివేదిక

జార్ఖండ్‌లోని కోల్హాన్ అటవీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2022 డిసెంబర్ 1 నుంచి, గోయిల్‌కెర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిలయ్‌బెడ, లోవబెడ గ్రామాల సమీపంలోని లోవబెడ కొండల్లో మావోయిస్టులు, కోబ్రా పోలీసులకు మధ్య ‘ఎన్‌కౌంటర్’ జరిగినప్పటి నుంచి పోలీసులు దాదాపు ప్రతి రోజూ కాల్పులు జరుపుతూనే వున్నారు. ‘ఎన్‌కౌంటర్’ జరిగిన రోజు ఉదయం 8.15 గంటలకు నుండి, సాయంత్రం 5 గంటల వరకు రోజంతా వందలాది ఫిరంగి గుండ్ల (మోర్టార్ షెల్స్‌) వర్షం కురిపించారు. మర్నాడు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిరంగి గుండ్లను పేల్చారు. ఆ తరువాత,
నివేదిక

చిడియాబేడా ఆదివాసీలపై
పోలీసుల క్రౌర్యం

రూర్ఖండ్‌లోని సరండా అడవుల గురించి మీరు వినే ఉంటారు. భారతదేశంలోనే అనేక పోరాటాలతో ప్రజ్వరిల్లుతున్న నేల అది. ఆ ఉద్యమాలను అణచివేయడానికి చాలా ఏళ్లుగా అక్కడ దారుణ నిర్బంధం కొనసాగుతోంది. అయినా ఆదివాసులు వెనక్కి తగ్గలేదు. చిడియాబేడా, లోవాబేడా, హాథిబురు అడవులలో కోబ్రా బటాలియన్‌ 209, 205, రూర్జండ్‌ జాగ్వార్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన పోలీసు బలగాలు గాలింపులు జరుపగా కొన్ని పోస్టర్లు, బ్యానర్లు సహ రోజువారిగా వాడుకునే దినుసులు దొరికినట్టు, సీరిస్‌ కనెక్షన్‌లో వుంచిన మందుపాతరలను కనుగొని వాటిని డిఫ్యూజ్‌ చేసినట్టు 12 నవంబర్‌ 2022 (ప్రభాత్‌ ఖబర్‌, దైనిక్‌ భాస్కర్‌ తదితర హింది పత్రికలలో) వార్త ప్రచురితమైంది.
నివేదిక

బుద్ధిజీవులుగా ఆదివాసులపై యుద్ధాన్ని అంగీకరిద్దామా?

ఆదివాసులపై వైమానిక దాడులకు వ్యతిరేకంగా హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో ఉదయం 11 గంటలకు బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదుల సమావేశాన్ని పాణి ఆరంభించారు -  తెలంగాణ ప్రజల గురించి, తెలుగు ప్రజల గురించి, ఆదివాసుల హక్కుల గురించి దశాబ్దాలుగా పనిచేస్తున్న  బుద్ధిజీవులు, ప్రజాస్వామ్యవాదులు ఈ సమావేశానికి వచ్చారు. 1948లో హైదరాబాదు రాష్ట్రంపై నెహ్రూ, పటేల్‌ పోలీసు చర్య దగ్గరి నుంచి దండకారణ్యంలో సైనిక చర్యలు దాకా  మన ప్రజాస్వామ్యం విస్తరించింది. నేల మీద లక్షల సైన్యం ఆదివాసీ ప్రజలపై యుద్ధానికి తలపడిన దశ నుంచి సరిహద్దు దేశాల యుద్ధాల్లో వాడే హెలికాప్టర్లలో సైనికులు వచ్చి బాంబు దాడులు
సంభాషణ నివేదిక

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు