వ్యాసాలు

బతుక్కి అర్థం చెప్పిన ఆనంద్‌ మరణం

మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ  దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే  ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి. మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి  యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు.  అందులో ఒకరు కామ్రేడ్‌   కటకం  సుదర్శన్‌ అలియాస్‌ ఆనంద్‌. రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్‌, హైదరాబాద్‌ పట్టణాలలో ఇంజనీరింగ్‌ , పాలిటెక్నిక్‌ కోర్సుల కోసం వెళ్లేవారు
వ్యాసాలు

వందేళ్ల ఆర్‌ ఎస్‌ ఎస్‌ కుట్ర- జైలుపాలయిన రాజకీయ ఖైదీలు

జులై 2 చెరబండరాజు అమరత్వం రోజు విరసం ఆవిర్భావసభ  సంఘపరివార్‌ వందేళ్ల ఫాసిజం పై సాంస్కృతిక ప్రతిఘటనా వ్యూహం ప్రకటించే ప్రతిజ్ఞ తీసుకోవడం చాల అర్థవంతంగా ఉంది. ఆయన విరసంలో తన కవిత్వం ద్వారా రచనల ద్వారా ‘ఏ కులమబ్బీ మాది ఏ మతమబ్బీ’ , ‘జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త’ వంటి పాటలు, కవితల ద్వారా బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలంతో తలపడినాడు. జీవితాచరణలో ప్రతిఘటించాడు. ఎమర్జెన్సీ కాలంలో ఆయన చెంచల్‌గూడ జైల్లో ఉన్నపుడు విరసం, మరికొందరు విప్లవ పార్టీల,  ప్రజాసంఘాల కార్యకర్తలు, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి డిటెన్యూలు అందరినీ ఒకే ఆవరణలో ఉంచారు. అట్లా దేశభక్తులను, దేశద్రోహులతో కలిపి ఉంచడాన్ని టైగర్‌
వ్యాసాలు

ఉమ్మడి పౌరస్మృతి ప్రజావసరమా? బిజేపి  అవసరమా?

ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఇది ప్రజలకు అవసరమై చట్టమని,ప్రజల కోసమే తీసుకువస్తున్నట్లు బీజేపీ చెబుతోంది.  ఉమ్మడి హిందువులకే ఒక చట్టం లేదు..  ఇప్పుడు ఉమ్మడి పౌరసత్వ చట్టం ఎందుకు? అనే  ప్రశ్నకు బీజెపి  వద్ద   సమాధానం లేదు. అది మా ఎజండా అంశం.. ప్రజలందరికి అవసరం.. అందుకే తీసుకు వస్తున్నాం.. అంటోంది.  ఏ లాభం లేనిదీ ఏ రాజకీయ పార్టీ ఏ చట్టాన్నీ తేవాలనుకోదు. ఇది ఎవరేమన్నా ఆర్‌ఎస్‌ఎస్‌ రహస్య ఎజండా! దాన్ని  అమలు చేయటానికి బిజేపి ఎన్ని ఎత్తులు, పొత్తులు, కుట్రలకైనా వెనుకాడదు. సూటిగా చెప్పాలంటే ఇప్పటికిప్పుడు ఈ చట్టం తీసుకు రాకుంటే
వ్యాసాలు

కామ్రేడ్ ఎల్‌ఎస్‌ఎన్ స్నేహం శరచ్చంద్రిక

కామ్రేడ్ సుబ్బారావు పాణిగ్రాహి అమరుడైన 21 డిసెంబర్ రోజే 53 సంవత్సరాల తర్వాత కామ్రేడ్ ఎల్.ఎస్.ఎన్ మూర్తి అమరుడు కావడం యాదృచ్ఛికమే కావచ్చు. కాకపోతే ముప్పై ఏళ్ళు నిండకుండానే శ్రీకాకుళ విప్లవంలో ఎన్‌కౌంటర్ అయిన సుబ్బారావు పాణిగ్రాహి పూజారిగా పనిచేస్తూ కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడు అయ్యాడు. గుడికి వచ్చే వారికి, గ్రామ ప్రజలకు ఆ భావాలు ప్రచారం చేసేవాడు. ఇక ఎల్.ఎస్.ఎన్ పూర్వీకులది కాంగ్రెస్‌లోనే ‘అతివాదం’గా భావించబడిన రాజకీయ చరిత్ర. గుంటూరులో అన్న లక్కవరం రాధాకృష్ణమూర్తి యింట్లో ఉండి చదువుకున్న రోజుల్లో ఆయన ఇంగ్లిషు లెక్చరర్ అయిన అన్న నుంచి, ఆ ఇంట్లో ఉండి స్ఫూర్తిశ్రీ పేరుతో భారతి
వ్యాసాలు

కుకీలకు మద్దతిచ్చినందుకు కోర్టు సమన్లు

'ది వైర్' కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, ప్రొఫెసర్ ఖమ్ ఖాన్ సువాన్ హౌసింగ్; కుకీ ఉమెన్స్ ఫోరమ్ కన్వీనర్ మేరీ గ్రేస్ జూ; కుకీ పీపుల్స్ అలయన్స్ ప్రధాన కార్యదర్శి విల్సన్ లాలం హాంగ్షింగ్ లకు ఇంఫాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. కరణ్ థాపర్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలలో, ఆ ముగ్గురూ మణిపూర్ కుకీ సముదాయానికి  ప్రత్యేక పరిపాలన ఉండాలనే డిమాండ్‌కు మద్దతునిచ్చారు. దీనితో ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు పలు ఐపీసీ నిబంధనల కింద వారిపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ప్రొఫెసర్ హౌసింగ్ పై మెయితీ ట్రైబ్స్
వ్యాసాలు

ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన – కొన్ని ఆలోచనలు

(ఇది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పేట్రియాటిక్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ – పిడి ఎం) మార్చ్ 26న గుంటూరులో జరిపిన సదస్సులో ‘ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన’ అనే అంశం మీద చేసిన ఉపన్యాస పాఠం. సమయం లేకపోవడం వల్ల ఆ విశాలమైన అంశాన్ని మాట్లాడలేనని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆవశ్యకత అనే అంశంలో కొన్ని కోణాలను, చరిత్ర అనుభవాలను మాత్రమే వివరిస్తానని ఉపన్యాసకుడు ముందే సూచించాడు) ఫాసిజం అంటే ఏమిటి? ఇవాళ దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించవలసిన అవసరమేమిటి? ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఎట్లా నిర్మించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వ్యాసాలు

ఎవరిదీ  తెలంగాణ ? ఎవని పాలైంది ?

డెబ్బై ఏళ్ళ తెలుగు రాష్ట్రం రెండు బలమైన ఉద్యమాలను చూసింది.ఒకటి నక్సల్బరీ రెండు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.  సిద్దాంత రిత్యా రెండూ వైరుధ్యమైన ఉద్యమాలు అయినప్పటికీ  రెండు ఉద్యమాలూ సుధీర్గ కాలం నడిచాయి. ఎన్నో నిర్భందాలు ఎదుర్కొన్నాయి అవి ఒక దానికి మరొకటి సంబంధ భాంధవ్యాలను కలిగి ఉంది. తొలివిడత తెలంగాణ మిగిల్చిన అసంతృప్తుల దావాలనమే  నక్సల్బరీ ఉద్యమాన్ని కొనసాగించాయి. ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకున్న ప్రతి గొంతూ ఈ రెండు ఉద్యమాలను గుండెలకు హత్తుకున్నాయి. ఇది పోరు భూమి, ఆట పాట సైదోడై కదన రంగాన్ని కవాతు తొక్కేలా చేసాయి.  సీమాంధ్ర దోపిడీ సాంస్కృతిక అభిజాత్యం పాలకుల నిర్లక్ష్యం
వ్యాసాలు

వాకపల్లి మహిళలపై అత్యాచారం – కోర్టు తీర్పు

పర్వత శ్రేణిలో,  మేఘాలతో దోబూచులాడే సుదూర కుగ్రామం వాకపల్లి. లోతట్టు అడవిలో ఎత్తైన కొండల దరి; గుంటలు, వాగులు, వంకలు కలయికతో; పాడేరుకు పోయే రోడ్డుకు సుమారు రెండు కిలో మీటర్ల దూరాన గల వాకపల్లి వాసుల రాకపోకలకు ఉన్న ఒకే ఒక దారి; ఆదిమ ఆదివాసీ తెగకు చెందిన కోందుల ఆవాసాలలో ఒకటి. వాళ్ళకు తెలుగు రాదు; వాళ్ళది కోండు భాష; అనాది కాలం నాటిది. నాగరిక జీవనానికి దూరంగా; దారీ, తెన్నూ తెలియని ఆదిమ ఆదివాసీ గిరిజన గూడెం వాసులపై నాగరికులు, అధునాతన సాయుధులు, ముష్కరులైన ప్రభుత్వ రక్షక దళాలు దాడి చేయడమేమిటి; వాళ్లపై అత్యాచారాలకు
వ్యాసాలు

కుల నిర్మూలన – నూతన ప్రజాస్వామిక విప్లవం

(కా. డప్పు రమేశ్ మొదటి సంస్మరణ సభ సందర్భంగా చేసిన ప్రసంగ పాఠం) 1967 లో నక్సల్బరీ తిరుగుబాటుతో నూతన ప్రజాస్వామిక విప్లవ పంథా మనదేశంలో స్థిరంగా వేళ్లూనుకుంది. ఇది ‘నూతన మానవుల’ నిర్మాణం అనే భావనను దేశంలో బలంగా ప్రవేశ పెట్టింది. రాజకీయంలో విప్లవ పథాన్ని ఆవిష్కరించడంతో పాటు సాహిత్యం, కళలు, సినిమా వంటి అన్ని రంగాలలో వినూతన కోణంతో ఆలోచించడం నేర్పింది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలిప్పుడు అంటూ చరిత్ర రచనలో పీడిత వర్గాల కోణం నుండి చరిత్రను చూడటం నేర్పించింది. ఆ నూతన దృక్కోణం స్పృశించని రంగమంటూ లేదు.
వ్యాసాలు

బెల్లంపల్లి నుంచి దండకారణ్యం వరకు: కామ్రేడ్ ఆనంద్ ఐదు దశాబ్దాల విప్లవ జీవితం

“నిరంకుశుడు మరణిస్తే అతని పాలన అంతమౌతుంది; అమరుడు మరణిస్తే అతని పాలన ప్రారంభమవుతుంది” అనే 19వ శతాబ్దపు డానిష్ తత్వవేత్త సోరెన్ కీర్కెగార్డ్ ఉల్లేఖనం, మేం చదువుకునే రోజుల్లో గోడలపై రాసే మా అభిమాన నినాదాలలో ఒకటి. కామ్రేడ్ ఆనంద్ ఇక లేడు. కానీ అతని ఆలోచన, ఆదర్శం, త్యాగస్ఫూర్తి, అలుపెరగని విప్లవోత్సాహం, నిర్విరామ విప్లవ సాధన తరతరాలకు స్ఫూర్తినిస్తాయి.సీపీఐ (మావోయిస్ట్) పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ 2023 మే 31 న దండకారణ్య దట్టమైన అడవిలో గుండెపోటుతో కన్నుమూశాడు. దండకారణ్య ప్రజల మధ్యన పార్టీ సీనియర్ నాయకత్వం, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పిఎల్‌జిఎ)