సభ్యత ఆదివాసులే నేర్పించగలరు
మానవ సమాజం ఉత్పాదక శక్తులను ఎంతగా అభివృద్ధి చేసినా, ఎన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినా, ఎన్ని సాంకేతిక నైపుణ్యాలు సాధించినా, ఎన్ని అధునాతన పరికరాలను తయారు చేసినా, అది నాగరికత ప్రాథమిక పాఠాలను కూడా నేర్చుకోలేదని వాస్తవాలు గొంతు చించుకొని చెబుతున్నాయి. సభ్యత అనే ఈ ప్రాథమిక పాఠాన్ని ఆదివాసీ సమాజం మాత్రమే నేర్పించగలదు. మొదటి పాఠం - మనిషి ప్రకృతిని జయించలేడు, దానితో సాంగత్యాన్ని ఏర్పరచుకోగలడు. ఆదివాసేతర నాగరికత, ఆధునిక సమాజం ఆదివాసీల నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, మనిషి ప్రకృతిని జయించాడని లేదా జయించగలడు అనే ఆలోచనను ఎప్పటికీ వదిలివేయాలి. ప్రకృతి నియమాలను తెలుసుకోవడం










