సార్థక జీవి ఆలూరి లలిత
విప్లవోద్యమం మనుషులను అద్భుతంగా తీర్చిదిద్దుతుందనడానికి లలితగారే ఉదాహరణ. సంప్రదాయ జీవితం నుంచి అజ్ఞాత ఉద్యమ జీవితానుభవం గడించేదాకా ఆమె ఎదిగారు. ఒక మామూలు గృహిణిగా జీవితాన్ని ఆరంభించి తన కుటుంబం ఉద్యమ కేంద్రంగా మారే క్రమానికి దోహదం చేశారు. ఆ కుటుంబం ఉద్యమకారుల, అమర వీరుల కుటుంబంగా ఎదిగే మార్గంలో లలితగారి అడుగుజాడలు ఉన్నాయి. ఇదంతా ఆమె ఒక్కరే సాధించి ఉండరు. అసలు ఆమె గురించి విడిగా ఎవ్వరూ మాట్లాడలేరు. భుజంగరావుగారితో కలిపే చూస్తారు. ఇది పితృస్వామ్య కోణం కాదు. విప్లవోద్యమంలో, సాహిత్య రచనలో ఆ ఇద్దరి కలయిక అలాంటిది. నిజానికి లలితగారి ప్రస్తావన, ప్రమేయం లేకుండా భుజంగరావుగారికి ఉనికి










