సమీక్షలు కొత్త పుస్తకం

రంగులన్నీ  సమానమే  యింద్రధనుస్సులో

లింగభేదం యింద్రధనుస్సు లో రంగుల మధ్య భేదం లాంటిది. నేను వొక రంగును కరెక్టు గా గుర్తు పట్టానా లేదా అన్నది అసలు సమస్యే కాదు. అన్ని రంగులకీ సమానమైన విలువ యివ్వడం - ప్రతి రంగుకీ సమాన హోదాలో గుర్తించబడే అవకాశం వుండటం అదీ ముఖ్యమైన విషయం. జన్యుపరంగా, లింగ అభివ్యక్తిపరంగా, లైంగిక గుర్తింపుపరంగా  యే విధమైన లక్షణాలు వున్నప్పటికీ సమానంగా గుర్తించబడే హక్కు ప్రతి వ్యక్తికి వుండాలి. విరసం ప్రచురించిన బిట్టూ కె. ఆర్. రచించిన పి.వరలక్ష్మి గారు అనువదించిన “రెయిన్ బో లైంగిక వైవిధ్యాలు”  పుస్తకాన్ని చూసినప్పుడు “ట్రాన్స్ జెండర్ అనేది కేవలం వొక
సమీక్షలు

మొక్కవోని మార్క్సిస్టు నిబద్ధత

ఇటీవల విడుదలైన ఇక్బాల్‌ కవితా సంపుటి *కళ చెదరని స్వప్నం* కు రాసిన ముందుమాట దేశ భక్తంటే రాజ్యభక్తిగాదోయ్‌ దేశ ప్రేమంటే ప్రజపట్ల ప్రేమోయ్‌ దేశ రక్షణంటే వనరుల రక్షణే చేను మేసే కంచెల్ని కాలబెట్టు మార్క్సిస్టు కవులకు చరిత్ర పట్ల, వర్తమానం పట్ల విమర్శనాత్మక దృష్టి ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఆశావహ దృష్టి ఉంటుంది. మార్క్సిస్టు కవులు ప్రాదేశికత నుండి విశ్వజనీనత వైపు లేదా అంతర్జాతీయత వైపు పయనిస్తారు. మార్క్సిస్టు కవులది భౌతికవాద ప్రాంపచిక దృక్పథం. మనిషిని, మనిషి శ్రమను సత్యంగా గుర్తిస్తారు. మానవేతర శక్తులను తిరస్కరిస్తారు. మార్క్సిస్టు పాలకులు భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను, ఆ వ్యవస్థల
సమీక్షలు

కష్టమైన జర్నీ

ఇటీవల విడుదలైన శ్రీరామ్ పుప్పాల దీర్ఘ కవిత 1818కు రాసిన ముందుమాట ఈ మధ్య కాలంలో అంతా బాగానే ఉంది. 'హక్కులు మనవి, హక్కుల పోరాటం వాళ్ళది' అని వాటాలు వేసుకున్నాక కులాసాగానే గడుస్తోంది. మీకు తెలియంది కాదు. 'వర్తమానం' ఎప్పుడో బహువచనంలోకి మారిపోయింది. ఇప్పుడు అనేక వర్తమానాలు. నచ్చిన, కంఫర్టబుల్ వర్తమానాన్ని ఎంచుకుంటున్నాం. ఏ మాత్రం ఇబ్బంది పెట్టని 'నైసిటీస్'ని మాట్లాడటం, రాయడం, చదవడం అలవాటు చేసుకున్నాం. నచ్చిన రంగు సన్ గ్లాసెస్ లో వెలుగును చూస్తూ, 'ఎవ్రీధింగ్ లుక్స్ ఫైన్' అని 'ఉబర్ కూల్ పోజ్'ల ఆత్రం లో ఉన్నాం. అంతా బాగానే ఉంది. సౌకర్యంగానే
సమీక్షలు

కల్లోల కాలంలో అవసరమైన సంభాషణ

విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ "50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం" అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ "కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ" అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.            పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై
సమీక్షలు

రాజకీయార్థిక నవల ‘చంద్రవంక’

దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి కవి, రచయిత, సామాజిక ఉద్యమకారుడు. రచనను సామాజిక బాధ్యతగా గుర్తించినవాడు. తాను ఎన్నుకున్న వస్తువు దళిత, పీడిత కులాల అంతర్భాంగా వుండాలని తపన. మా ఎర్ర ఓబన్న పల్లె, ధనుస్సు అనే రెండు నవలలు, మాదిగ సామాజిక జీవితాన్ని అనేక కోణాల నుండి స్పృశించాయి. ఒకానొక స్థితిని అంచనా వేసాయి. ఎజ్రాశాస్త్రి రచనా మాద్యమాన్ని తను నడిచి వచ్చిన తొవ్వకు అనుసంధానం చేసుకున్నాడు. రచన ఒక బాధ్యత అని భావించినప్పుడు తన రచనా పద్ధతి ఎలాఉండాలో రచయిత నిర్ణయించుకుంటాడు. చంద్రవంక ఎజ్రాశాస్త్రి మూడవ నవల. ఈ నవల చారిత్రక ఉద్యమ నవల. ఇందులో పాత్రలు వాస్తవికమైనవి.
సమీక్షలు

ఎవరికీ పట్టని మరో ప్రపంచపు కథలు

కథలకు సంబంధించి వస్తువు ఎంపికే ప్రధానమైనది. దానిని అనుసరించేవే మిగతా లక్షణాలు. నేరుగా జన జీవనంతో మమేకమైపోయి, వాళ్ళ బతుకు సాధకబాధలే ఇతివృత్తాలు గా, ఆయా సమూహాలను చరిత్రలో భాగం చేసే రచయితలు చాలా చాలా అరుదు. వాళ్ళ ఆరాటపోరాటాల్ని చాలా దగ్గరగా చూసినప్పుడు, పరిశీలించినప్పుడు కలిగే అనుభూతి చాలా భిన్నమైన మార్గంలో కథకుడ్ని నడిపిస్తుంది. చాలా సున్నితమైన అంశాల్ని, ఇతరుల కన్నుకు కనబడని జీవితం తాలూకు ఘర్షణని చూసేలా చేస్తుంది.‌ ఖచ్చితంగా పాఠకుడికి ఆ సంఘటనలకు కారణమయ్యే శక్తుల మీద ఆగ్రహం కలుగుతుంది. జీవన విధ్వంసం దృశ్యాన్ని కథగా మలిచేటప్పుడు కథలో ఇలా ఎందుకు జరిగింది?జరగకూడదే?అనే మీమాంస
సాహిత్యం సమీక్షలు

మంజీర.. స‌జీవధార

చెరబండరాజు సాహిత్య సర్వస్వం, అలిశెట్టి ప్రభాకర్‌ కవిత్వ విశ్లేషణ ‘కల్లోల కవితా శిల్పం’ పనిలో ఉన్నప్పుడు వీరిద్దరికి కొనసాగింపుగా కౌముది, సముద్రుడు, మంజీర, ఎమ్మెస్సార్‌ గుర్తుకు వచ్చారు. విప్లవ కవిత్వంలోకి చెర, అలిశెట్టి ప్రభాకర్‌ తీసుకొచ్చిన విప్లవ వస్తు శిల్పాలు ఆ తర్వాతి కాలంలో మరింత గాఢంగా, ఆర్దృంగా, సౌందర్యభరితంగా విస్తరించాయి. 1990ల విప్లవ కవిత్వం మొత్తంగా తెలుగు కవితా చరిత్రనే సాంద్రభరితం చేసింది. ఇందులో అనేక మంది విప్లవ కవులు ఉన్నారు. వాళ్లలో కూడా ప్రత్యక్ష విప్లవాచరణను, కవితా రచనను ఎన్నుకున్న వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. తెలంగాణ నేపథ్యం, విభిన్న రంగాల్లో పోరాట అనుభవం,
సాహిత్యం సమీక్షలు

విప్లవోద్యమాన్ని సృజనాత్మకంగా ఆవిష్కరించిన కథలు

నేను ఈ మధ్య అల్లం రాజయ్య గారు సంపాదకత్వం వహించిన దండకారణ్యం కథలు చదివాను. ఈ పుస్తకాన్ని విరసం వాళ్ళు ప్రచురించారు. ఈ కథలు మూడు సంపుటాలుగా రావడం జరిగింది. ఈ కథలన్నీ అరుణతారలో ప్రచురణ అయ్యాయి. మొదటి కథల సంపుటి 2005 - 2012. 16 కథలతో మొదటి సంఖలనం తీసుకువచ్చారు. 2013 -2017 మొత్తం 8 కథలతో రెండవ సంకలనం ప్రచురించారు. 2016 -2019 మొత్తం14 కథలతో మూడవ కథల సంకలనం తీసుకువచ్చారు. ఈ కథలలో గత 50 సంవత్సరాలుగా మూడు తరాలుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక రాజ్యాధికార దిశగా సాగుతున్న విప్లవోద్యమాన్ని సాహిత్య పరంగా
సాహిత్యం సమీక్షలు

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే
సాహిత్యం సమీక్షలు

త‌ల్లుల బిడ్డ‌ల వీర‌గాథ‌

ఆదిలాబాదు విప్లవానికి కన్నతల్లి’ అని ప్రముఖ విప్లవ కవి ఎన్‌కె అంటారు.‘విప్లవానికి సింగరేణి ఊట చెలిమ’ అని ‘తల్లులు బిడ్డలు’ అనే ఈ నవలలో పాత్రగా కనిపించే నల్లా ఆదిరెడ్డి అంటాడు.మొదటిది కవితాత్మక వ్యాఖ్య. రెండోది విప్లవోద్యమ అనుభవం. అదే ఒక సూత్రీకరణ అయింది. అదే ఈ నవల నిరూపించే సత్యం.సింగరేణి ప్రాంతంలోని బెల్లంపల్లి కేంద్రంగా హుస్సేన్‌ రాసిన ‘తల్లులు బిడ్డలు’ నవల నడుస్తుంది. అక్కడి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంతా విస్తరించి, ఇటు తెలంగాణలోని మిగతా జిల్లాల్లోకి, అటు ఆదివాసీ ప్రాంతంలోకి ఇందులోని కథా స్థలం చేరుకుంటుంది. పైకి చూడ్డానికి గజ్జల లక్ష్మమ్మ కేంద్రంగా రచన