కార్టూన్ కవిత
పాలకుల విధ్వంస నిర్మాణాల మీదిఆగ్రహాన్నంతా హిమాలయ పర్వతాలుహిమానీ నదులు బీభత్సంగాపాలితుల మీద కూడ చూపిన మాట నిజమే కానీప్రకృతి కదా ఎక్కడోపసిపిల్లల పట్ల పాలకులకున్నంతనిర్లక్ష్యం కనిపించలేదు ఒక టీచర్ను హెచ్చరించడంలోనే కాదుఆక్రమణ యుద్ధాల లక్ష్యమే పసిపిల్లలైనాద్వేషం కనిపించలేదుఅవును కదా మనం దివిసీమఉప్పెనపుడు చెప్పుకున్నట్లుగాప్రకృతి 'అక్రమంలోనూఒక క్రమముంటుంది' 'అక్రమంలో కూడ క్రమముంటుంది .'-కెవిఆర్.(యు.పి.ఉన్నీకి, కెవిఆర్ కు కృతజ్ఞతలతో










