సంపాదకీయం

రాజ్యాంగం చెప్పినవన్నీ చేశారా? ఉమ్మడి పౌరస్మృతి తేవడానికి..

ప్రజా క్షేత్రం గురించి బీజేపీకి బాగా తెలుసు. ఎంత బాగా తెలుసో అర్థమయ్యే కొద్దీ మనకు ఆందోళన పెరుగుతుంది. మామూలుగా  కామన్‌సెన్స్‌లో భాగంగా సంఫ్‌ుపరివార్‌  ఈ సమాజాన్ని మధ్య యుగాల్లోకి తీసికెళుతుందనే విమర్శ చాలా మంది చేస్తుంటారు. తన మీద ఇలాంటి అభిప్రాయం ఉన్న ఈ సమాజంతో  సంఫ్‌ు ఎట్లా వ్యవహరిస్తుంది? నిజంగానే ఈ దేశంలోకి ముస్లింలు రాకముందటి రోజులే ఉజ్వలమైనవని,  కాబట్టి  సమాజాన్ని  అక్కడికి తీసికెళతానని అనగలుగుతుందా? సంఫ్‌ుపరివార్‌కు ఇలాంటి భావజాలంలో కూడా ఉన్నది. ఒక ‘అద్భుతమైన’ గతాన్ని ఊహించి  చెప్పి, దాని చుట్టూ భావోద్వేగాలు లేవదీసి, ‘ఇతరుల’ మీద విద్వేష విషాన్ని నింపి, ‘తనదే’ అయిన
సంపాదకీయం

ప్రజా యుద్ధమే కా. హన్మంతు జీవన సందేశం

మావోయిస్టు పాక హన్మంతు అంత్యక్రియలకు పదిహేను వేల మంది వచ్చారని పత్రికలు రాశాయి. ఈ మాటకు మీలో కొందరైనా  'ఆఁ వస్తార్లెండీ, చనిపోయినప్పుడు. చివరిసారి చూద్దామని. ఆదేమీ ఆ ఉద్యమ బలం కాద'ని అంటారు. అందులో ఏ అర్థ‌మూ లేద‌ని అంటారు. ఇంత జన సందోహం ఆయనకు వీడ్కోలు పలికిందని అంటే 'మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నార'నే మేధావులు మీలో ఉంటారు. జీవితం, మరణం అవిభాజ్యమనే ఎరుక ప్రజలకు ఉంటుందని అంటే, 'సిద్ధాంతం గురించి మాట్లాడకుండా ప్రజల కామన్సెన్స్ చూసి సంతృప్తి చెందుతున్నార'ని అనే వాళ్లు మీలో తప్పక ఉంటారు. ఇంతకూ ప్రజల్లో ఎవరు ఉన్నారు? వాళ్ల మనో ప్రపంచాన్ని
సంపాదకీయం

అకాడమీ  ఎందుకు  అవార్డులిస్తుందో  రచయితలకు తెలియదా?

మంచికో చెడుకోగాని తేనెతుట్టె మరోసారి కదిలింది. అకాడమీ అవార్డుల మీద తీవ్రమైన చర్చే జరిగింది. ఫేస్‌బుక్‌ మీద కాబట్టి ఇంతకంటె గొప్పగా ఉండాలని ఆశించేందుకు లేదు. నింపాదిగా, నిలకడగా మాట్లాడుకోలేకపోవడం, తక్షణ ప్రతిస్పందనతో సరిపెట్టుకోవడం ఇవాల్టి మేధో సంస్కృతి. అట్లని అంతా ఇదే కాదు. తెలుగులో ఓపికగా జరుగుతున్న అత్యవసరమైన మేధో అన్వేషణ కూడా ఉన్నది. కేంద్ర సాహిత్య అకాడమీ గురించి, అది అవార్డులను ప్రకటించే పద్ధతి గురించి గతంలో కూడా చాలా వాద వివాదాలు జరిగాయి. అయితే ఇప్పటికైనా ఈ చర్చ అన్ని రకాల అవార్డులు, సన్మానాలు, పురస్కారాల గురించి  మరింత దృఢంగా ముందుకు సాగవలసి ఉన్నది.
సంపాదకీయం

భారత విప్లవోద్యమ దశలన్నీ ఆయన జీవితంలో…

మన చుట్టూ ఎందరో ఉంటారు. వాళ్లలో కొందరిని మర్చిపోవచ్చు.   ఇతరులను ప్రభావితం చేయగల వాళ్లను అంత సులభంగా మర్చిపోలేం. మన ఆలోచనలనో, లోకాన్ని పరిశీలించే చూపునో, జీవించే పద్ధతినో  వాళ్లు ముట్టుకొని ఉంటారు. ఈ అంశకు కాలంతోపాటు ఎదిగే స్వభావం ఉంటే.. వాళ్లు మన జ్ఞాపకాలను, ఉద్వేగాలను, అనుబంధాలను దాటి చరిత్ర పరిధిలోకి వెళతారు. అంటే ఆలోచనలను ప్రభావితం చేసే దశ నుంచి భౌతిక పరిస్థితులను మార్చే  క్రమంలో కూడా  వాళ్లు భాగం అవుతారు. చరిత్రను నిర్మించే పని మొదలు పెడతారు. ఈ సమాజం అందించే ఏ ప్రత్యేకతలు లేని మామూలు మనుషులు ఈ పనిలో భాగమైతే ఎంత
సంపాదకీయం

అల్లూరి నుంచి హిడ్మా దాకా అదే రక్తసిక్త చరిత్ర

అమరులు మడావి హిడ్మా, రాజే, సహయోధుల ఎన్‌కౌంటర్‌ హత్యలు ఏ దుర్మార్గమైన సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ బ్రాహ్మణీయ ఫాసిస్ట్‌ స్వభావానికి దాఖలా! రాజ్య వైఖరి ప్రభుత్వాలతో మారుతుందా, మారిన పరిస్థితులతో మారుతుందా? మారిన పరిస్థితులు అంటే ఏమిటి! బిహార్‌ ఎన్నికల తర్వాత, టు లవ్‌ విత్‌ సర్‌ కాదు, సర్‌తో కళ్ళు తెరుచుకున్న ఉదారవాద ప్రజాస్వామ్యవాదులు పార్లమెంటు ఎన్నికలను బహిష్కరించమని చెప్తున్నారు. ఎన్నడో చెప్పాడు చారుమజుందార్‌ ఈ మాట. ఎప్పుడో చేసి చూపింది నక్సల్బరీ పంథా. హిడ్మా ఆయన సహాయోధుల ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు చూడండి. శత్రువు చాలా స్పష్టంగా ఏం చేస్తున్నాడు. 2024 ఎన్నికల ముందు నుంచే
సంపాదకీయం

రాజ్యాంగమూ రాజదండమూ

మనుషుల్లోని నమ్మకాల ప్రపంచం చాలా లోతైనది. ప్రతీకలతో,  భావనలతో అది పటిష్టంగా పని చేస్తూ ఉంటుంది.  కళ్ల ముందు కనిపించే  వాస్తవాలకన్నా విశ్వాసాల ప్రపంచమే సాధారణంగా మనుషులను నడిపిస్తుంటుంది.  అది ప్రాచీనమైనదే కానక్కరలేదు. ఆధునిక, సమకాలీన జీవితంలో కూడా అట్లాంటి నమ్మకాల ప్రపంచం నిరంతరం నిర్మాణమవుతూ ఉంటుంది. వాస్తవ ప్రపంచం  ఘర్షణ పడినప్పుడు అది  పెటిల్లున రాలిపోయినా ఆశ్చర్యపోనక్కర లేదు. మే 28న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రారంభించిన పద్ధతి చూసి చాలా మంది దిగ్భ్రాంతికి గురయ్యారు. అశాంతికి లోనయ్యారు. ఆగ్రహపడ్డారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు కార్యక్షేత్రమైన పార్లమెంట్‌ భవనాన్ని వైదిక క్రతువులతో, సాధు సంతులతో ఆరంభించడం ఏమిటనే ప్రశ్న
సంపాదకీయం

బీహార్‌లో ఎన్నికల కమిషన్‌ గెలుపు

కొంచెం అటూ ఇటూగా బీహార్‌ ఎన్నికల ఫలితాలను ఇలాగే ఉంటాయని అనుకున్నారు. కేవల ఊహ కాదు.  ఓట్‌ చోరీ ఆధారం. అనుకున్నదే సత్యమని తేలినప్పుడు దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ ఫలితాలు రాబోయే ప్రమాదాన్ని గాఢంగా సంకేతిస్తున్నాయి. ఓట్‌ చోరీ ఏ స్థాయిలో జరిగిందో, అదే స్థాయిలో అది బట్టబయలైంది. బీజేపీ అకృత్యాలను బైటపెట్టడంలో రాహుల్‌ గాంధీ  పరిణతి సాధించాడని చాలా మంది అనుకున్నారు. ఎన్నికల జాబితా అన్యాయాలపై  సాక్ష్యాధారాలతో, గంభీరమైన సూత్రీకరణలతో మాట్లాడి ఓట్ల నేతల్లో భిన్నమైన మనిషి అనిపించుకున్నాడు. ఆయన వాదనలేవీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేదని కూడా తేలిపోయింది. మనుషులు ఎంత అతార్కిక మన:స్థితిలో ఉన్నా
సంపాదకీయం

మణిపూర్‌లో మంటలు కాదు ..మాటలు కావాలి

మణిపూర్‌ మండుతోంది. అయితే అగ్గి రాజేసింది ఎవరు? దానంతట అదే అంటుకుందా? దాన్ని ఊది ఊది పెనుమంటగా మార్చిందెవరు? అక్కడి ఆదివాసీలేనా? ఇదంతా కేవలం మెయితీలు అనే ఒక తెగకు షెడ్యుల్డు తెగ హోదా ఇచ్చే విషయం మీద ఆలోచించి నివేదిక సమర్పించమని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించిన ఫలితంగానే జరిగిందా? (ఆ న్యాయమూర్తికి అలాంటి ఆదేశం ఇచ్చే అధికారం లేదనీ, ఆ అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే వుందనీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించడాన్ని మనం గమనించాలి) లేక ఇంకేమైనా లోతైన విషయాలు వున్నాయా? లోతుల్లోకి వెళ్ళి పరిశీలించకుండా సమస్య అసలు స్వభావాన్ని అర్థం చేసుకోలేం. ఆ స్వభావం అర్థం
సంపాదకీయం

ఎందుకింత కోపం?

ఏకకాలంలో ఉద్రిక్తతా, నిశ్శబ్దామూ ఉంటాయా? ఆ రెంటి అర్థాలే పొసగవు. అయితే మానవ జీవితం నిఘంటు అర్థాలకు భిన్నమైనది. సామాజిక శాస్త్ర సూత్రాలకూ అది లోబడదు. సామాజిక, రాజకీయ సూత్రాలు జీవితాన్వేషణకు దారి చూపగలవు. జీవితాన్నీ, సమాజాన్నీ ఉన్నతీకరించే సాధనాలుగా ఉపయోగపడగలవు.  ఇది పరిమితి కాకపోగా,  విస్తృతికి అవకాశం ఇస్తుంది. దీన్ని ఎంతగా గ్రహించగలం?   పరస్పర విరుద్ధతల మధ్య సాగుతున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ ఎరుక ఒక్కటే మనం ఎటో ఒక వైపు కొట్టుకపోకుండా కాపాడుతుంది. ఆ తర్వాత ఎన్ని వాదనలైనా చేయవచ్చు. మానవాచరణను కేంద్రం చేసుకున్నవాళ్లు వాద వివాదాల్లో పై చేయి కోసం ప్రయత్నించరు. వాదనలు
సంపాదకీయం

స్వలింగ వివాహాలు- పితృస్వామిక కుటుంబ వ్యవస్థ

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. Marriage equality case (వివాహ సమానత్వం)గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కేసు సంప్రదాయ పితృస్వామిక సమాజంలో సంచలనం అనే చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ట్రాన్స్‌ జెండర్‌ సమాహాలు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో స్వలింగ వివాహాల గుర్తింపు కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవలే వివిధ హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న ఈ పిటిషన్లను సుప్రీంకోర్టు తనకు తాను బదిలీ చేసుకుంది. ఆ తర్వాత దీని విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అంటే వివాహ చట్టాలపై వచ్చిన మౌలిక ప్రశ్నలను పరిష్కరించడానికి రాజ్యాంగ నిర్వచనాల దగ్గరికి