వ్యాసాలు

సృజనాత్మక విమర్శ

‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక.  ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు  తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు.  నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి  విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక  వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది.             ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ
నివాళి

ప్రొ. కందాళ శోభారాణికి విరసం నివాళి

కాకతీయ విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ప్రొ. కందాళ శోభారాణి ఫిబ్రవరి 12న మరణించారు. గత కొన్నేళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనే చదివి,  తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసి అక్కడే ప్రొఫెసర్‌గా  చేరారు. సుదీర్ఘ ప్రజా పోరాటాల చరిత్ర ఉన్న వరంగల్‌లో సామాజిక చైతన్యంతో మేధో రంగంలోకి వచ్చిన ఈ తరం అధ్యాపకురాలు శోభారాణి. విద్యార్థిగా, పరిశోధకురాలిగా ఉన్న రోజుల్లోనే ఆమె తన చుట్టూ జరుగుతున్న ప్రజా పోరాటాలను శ్రద్ధగా గమనించేవారు. వాటిని అభిమానిస్తూ చేయూత ఇచ్చేవారు. అనేక నిర్బంధాలు చుట్టుముట్టి ఉండే వరంగల్‌లో బుర్రా రాములు వంటి వారితో కలిసి హక్కుల ఉద్యమంలో భాగమయ్యారు.  మానవ
వ్యాసాలు

హస్ దేవ్ సందేశం ఏమిటి?

హస్ దేవ్ నిరవధిక  పోరాటానికి ఏడాది అయిన సందర్భంగా   13, ఫిబ్రవరి 2023 న సర్గుజ జిల్లా హరిహరపురంలో జరిగిన ధర్నాకు దేశ వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.   విద్యార్థి, రైతాంగ, యువజన, మేధావులు నలుమూలల నుండి రావడం ఒక  అద్భుతం.   . దేశ వ్యాప్త సమర్ధనతో ధర్నా విజయవంతం కావడం పోరాడితే పోయేదేమీ లేదు మన పై హింస తప్ప అని మరోసారి రుజువు చేసింది. అలాగే ధర్నా స్థలి నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరుగుతున్న ఏరియల్ బాంబింగ్ ను ఆపేయాల్సిందిగా తీర్మానం చేస్తూ అక్కడ ఎంతో ధైర్యంగా పోరాడుతున్న ప్రజలకు
పత్రికా ప్రకటనలు

బిబిసి డాక్యుమెంటరీ”ఇండియా:ది మోదీ క్వశ్చన్” ప్రసార నిషేధంపై ఖండన

కన్నడ మేధావులు 522  మంది విడుదల చేసిన ప్రకటన మేము, భారతదేశ శాస్త్రవే త్తలం,  అధ్యాపకులం ”ఇండియా:ది మోదీ క్వశ్చన్”  బిబిసి డాక్యుమెంటరీ రెండు భాగాల ప్రసార నిలుపుదల పట్ల తీవ్ర విషాదానికి గురయ్యాం. ఆ డాక్యుమెంటరీ “భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రత” కు భంగకరమనే సాకుతో దాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించారు. ఈ సమర్థన పరిశీలనకు నిలబడదు. మీ తొలగింపు , మన సమాజానికి,  ప్రభుత్వానికి  సంబంధించిన  ముఖ్యసమాచారాన్ని దేశ ప్రజల  తెలుసుకొనే హక్కును కాలరాస్తుoది. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు ఆ డాక్యుమెంటరీ  ప్రదర్శనను అడ్డుకొనే ప్రయత్నం జేసాయి. ఇది అకడమిక్  స్వేచ్ఛను    ఉల్లంఘించడమే అవుతుంది. విశ్వవిద్యాలయాలు
కవిత్వం

‘గోడలకు నోళ్లున్నాయి’

(కోవిడ్ కాలంలో రాజకీయ ఖైదీ హేమంత్ రాసిన కవిత. కోవిడ్ తగ్గిందేమో గాని ఈ కవితలోని రాజకీయ ప్రాసంగికత అలాగే ఉంది. - వసంత మేఘం టీం ) మా పిల్లల వ్యాక్సిన్లు విదేశాలకు ఎందుకు పంపావు మోడీజీ అని అడుగుతున్నాయి ఆ గోడలు ఏడ్వడానికి, నవ్వడానికి, పాలు తాగడానికి, ఆహారం తీసుకోవడానికి తప్ప అడగడానికి నోరులేని ఆ పిల్లల ఆక్రందనలు ఆ పోస్టర్లు మా ప్రాణౌషధాలు సముద్రాలు ఎట్లా దాటాయని అడుగుతున్నాయి ఫ్రేజర్లు, బిల్‌గేట్స్‌, యురోపియన్‌ యూనియనూ, జర్మనీ పేటెంట్‌ హక్కుల కోసం దేశాన్ని తాకట్టుపెట్టుమని సైనిక స్థావరాలు స్వాధీనం చేయమని కొన్ని దేశాలను అడుగుతున్నాయిగదా మరి
కరపత్రాలు

మనమంతా ఒకే గొంతుగా నినదిద్దాం

జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌, చిత్తనూరులో ఏర్పరుస్తున్న ఇథనాల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీని వెంటనే ఎత్తివేయాలి పాదయాత్ర తేది : 11.02.2023 చిత్తనూరు నుండి  తేది : 21.02.2023 ఆత్మకూరు దాకా ప్రియమైన సోదరీ సోదరులారా ! మిత్రులారా ! జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌,  ఇండస్ట్రీస్‌ వారు చిత్తనూరు శివారులో మూడు పంటలు పండే భూములలో ఇథనాల్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు అబద్దాలు చెబుతూ మోసపూరితంగా చిత్తనూరు, ఎక్లాస్పూర్‌, జిన్నారం గ్రామాలకు చాలాదగ్గరలో జనావాసాల నడుమ ఈ కంపెనీ పనులు శరవేగంతో నిర్వహిస్తున్నారు. వాళ్ళు తొలుత మనకు నేరేడు పండ్లతోట పెడతామని చెప్పారు. కొద్దిరోజులలోనే ఇథనాల్‌ కంపెనీ నిర్మిస్తున్నారనే
కవిత్వం

బగీచాలో పాట

ఆ పక్షి కావేరీ పుట్టిన దేశంలో రెక్కలొచ్చి జెంషడ్‌పూర్‌ జెసూట్‌ చర్చినావరించిన ఆడవిలోకెగిరిపోయింది జీసస్‌ను సిలువ వేసిన దారుల్లో దేశ దేశాల్లోనూ తిరిగింది సేవా త్యాగం నేర్చుకున్నది చైతన్యంగా మార్చుకున్నది పాడిరది.. జీవకారుణ్యం రాజ్య ధిక్కారం దాకా పోరాటమేనన్నది గాయాలకు నిట్టూర్పు మందు కాదు నిష్కృతి మందుకు అన్వేషించింది విముక్తి తత్వాన్ని గానం చేస్తూ కావేరీ ప్రవహించే దేశానికొచ్చింది పాటేనా ఎంచుకోవాల్సిన బాటకూడ ఉండాలని బాల్యంలో మనసులో ప్రవేశించిన సెలయేళ్లు ప్రవహించే దేశానికొచ్చింది హో అంటే హో అని వాళ్ల భాషలో సంభాషించింది వాళ్ల బాధల్ని పోరాటాల్ని ప్రతిఫలించింది చెట్లు నదులు అడవులు నేల విధ్వంసమయ్యే విశ్వ విపత్తు
సమీక్షలు

మొక్కవోని మార్క్సిస్టు నిబద్ధత

ఇటీవల విడుదలైన ఇక్బాల్‌ కవితా సంపుటి *కళ చెదరని స్వప్నం* కు రాసిన ముందుమాట దేశ భక్తంటే రాజ్యభక్తిగాదోయ్‌ దేశ ప్రేమంటే ప్రజపట్ల ప్రేమోయ్‌ దేశ రక్షణంటే వనరుల రక్షణే చేను మేసే కంచెల్ని కాలబెట్టు మార్క్సిస్టు కవులకు చరిత్ర పట్ల, వర్తమానం పట్ల విమర్శనాత్మక దృష్టి ఉంటుంది. భవిష్యత్తు పట్ల ఆశావహ దృష్టి ఉంటుంది. మార్క్సిస్టు కవులు ప్రాదేశికత నుండి విశ్వజనీనత వైపు లేదా అంతర్జాతీయత వైపు పయనిస్తారు. మార్క్సిస్టు కవులది భౌతికవాద ప్రాంపచిక దృక్పథం. మనిషిని, మనిషి శ్రమను సత్యంగా గుర్తిస్తారు. మానవేతర శక్తులను తిరస్కరిస్తారు. మార్క్సిస్టు పాలకులు భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలను, ఆ వ్యవస్థల
సమీక్షలు

కల్లోల కాలంలో అవసరమైన సంభాషణ

విరసం 50 ఏళ్ల సందర్భంలో ఎ.కె. ప్రభాకర్ ఎడిటర్‍గా పర్స్పెక్టివ్స్ "50 ఏళ్ల విరసం: పయనం- ప్రభావం" అనే పుస్తకాన్ని 2020 లో ప్రచురించింది. ఇందులో 12 మంది వ్యాసాలు, 21 స్పందనలు కలిపి మొత్తం 33 రచనలు ఉన్నాయి. వెంటనే వీటికి ప్రతిస్పందనగా వరలక్ష్మి, పాణి రాద్దామనుకున్న రెండు వ్యాసాలు  2021, మార్చి 31న ఎన్ఐఏ చేసిన దాడిలో  పోయాయి. ఇంతమంది మిత్రులు చేసిన ఈ సంభాషణకు ప్రతిస్పందించడం విరసం బాధ్యతగా భావించి   మళ్లీ "కల్లోలకాల ప్రతినిధి- దృక్పథాల సంభాషణ" అనే సుదీర్ఘ వ్యాసాన్ని పాణి రాసాడు.   ఇటీవలే ఇది  విడుదలైంది.            పర్స్పెక్టివ్స్ ప్రచురించిన పై
వ్యాసాలు దండకారణ్య సమయం

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం