రాయలసీమ ‘సాధన’ నవల
రాయలసీమకు జరిగిన విద్రోహానికి నవలా రూపం సాధన. తెలుగు నవలా ప్రస్థానంలో సాధన నవల ఒక మలుపు. ఈ నవలా రచయిత అనంతపురం జిల్లాలోని శాంతి నారాయణ. ఇది వరకు చారిత్రక నవలలు, మనో వైజ్ఞానిక నవలలు, సాంఘిక రాజకీయ ఉద్యమ అస్తిత్వ నవలలు శాంతి నారాయణ రాశారు. సాధన నవల అస్తిత్వవాద నవల. రాయలసీమకు అనాదిగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి పట్టిన నవల. అందుకేనేమో ఈ నవలకు గాయపడిన నేల అనే ట్యాగ్ ఉంచారు. కోస్తా ప్రాంతం వారి వివక్ష వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీళ్లు, ఉద్యోగాలు తదితర అనేక విషయాలలో రాయలసీమకు










