జీవితానుభవాన్ని ఎర్రజెండాలా ఎగరేసిన కవిత్వం
రాజకీయ కవితలు రాయడం చాలా కష్టం. అందులోనూ కమ్యూనిజం లేదా ఇప్పుడు పాలకులు పదేపదే ఉఛ్ఛరిస్తున్న అర్బన్ నక్సల్ అవగాహనతో కవిత్వం రాయడం ఇంకా కష్టం. ఇలాంటి కవిత్వం లో రెండు అంశాలు ప్రధానంగా కనబడతాయి. నేరుగా ప్రజాపోరాటాలతో, జనజీవితంతో సంబంధం ఉండడమూ, వాటి రూప సారాలను మార్క్సిజం ఆధారంగా అర్థం చేసుకునే చారిత్రక అవగాహన కలిగి ఉండడమూ. నేను చూసిన, పరిచయమున్న ఇలాంటి పెద్దలలో అరుణ్ సార్ ఒకరు. తాను నమ్మిన విప్లవ పంధా నుంచి, ఈ సుదీర్ఘ జీవన ప్రయాణంలో ఇసుమంత కూడా పక్కకు ఒరగని నేపధ్యం నుంచి ఎలాంటి కవిత్వం ఆశించగలమో అలాంటి