సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
సాహిత్యం కవిత్వం

మృత్యువు దాడిచేసిన రాత్రి అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా సెకన్ల ముల్లు ఆగిపోయింది
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
సాహిత్యం కవిత్వం

జరూర్

గనిలో వారంచీకటిలోదీపాల వెలుతురు లోనల్ల బంగారం వెలికి తీతరెక్కలు ముక్కలు చేసుకుంటూజనానికి వెలుతురు నివ్వడానికి వారం బడలికసడలించుకుంటూకుటుంబాలతో గడపాలనే ఆనందంతోఆశతో ఊసులతో ఊహలతో కలలతో బయల్దేరాం పాటలు పాడుకుంటూఎప్పటిలాగేలేగదూడల్లా ఎగురుతూఅదే బండి అదే తోవ అదే సమయం ఏళ్ళుగా మాయదారి చట్టంచేతుల్లో పెట్టుకున్నరక్షక దళంవిరుచుకు పడిందికాల్పుల మోతగుండెల్లో రుధిరం చిమ్మిందిదేహాలను చిదిమిందిబతుకు బుగ్గి చీకటిలోనే అయ్యో విచారం వ్యక్తంపోయిన ప్రాణం ఖరీదు కట్టేచట్టం మాత్రం అలాగేఎన్ని నిరాహార దీక్షలు చేస్తేనేందున్నపోతు పై వాన కురిసినట్టే గా ఆపరేషన్ అవగాహన లోపంఎవడు జవాబుదారీచంపూ డబ్బులు ఇయ్యికథా కమామిషుప్రశ్న నీ చంపూ లేదాజైళ్లలో నింపుకర్కశ రాజ్యంమత్తు లో జోగుతున్న జనంమీ వంతూ
సాహిత్యం కవిత్వం

హత్యలు కాని హత్యలు

ఇంటిమనిషిని కోల్పోయిన నొప్పిలా ఉంది సలుపు చేప ముల్లు గొంతులో దిగితేదవఖానకు పరుగెట్టొచ్చు తూట వెన్నులో దిగితేకుప్పకూలడం తప్ప దారేది తెలియకుండా జరిగినదే కావచ్చుమీ తుపాకులకు గందపు వాసన తప్పకన్నీటి వాసన తెలియదు కడుపుకోతకు గురైన ఇండ్లలోకిమనుషులుగా వెళ్ళి చూడండిగుమ్మాల్లో మనుషులకు బదులుగాదుఃఖాలు గుండెలు బాదుకుంటూఉంటాయి మీకు తెలియకుండా జరిగినదే కావచ్చుజరిగింది ఆస్తినష్టం కాదుప్రాణనష్టం కూలింది కూలీలుకుటుంబాన్ని కాపు కాసే మట్టిగోడలు సాయమందించి చేతులు దులుపుకున్నాకొన్ని ప్రేమలబాకీ ఎవరు తీరుస్తారు కలచివేసే వార్త ఈ రోజు వరకేఅన్ని సర్దుకపోతాయిప్రజలూ మరచిపోతారు రాని తండ్రి కొరకు ...ఓ బిడ్డ ఇంకా తలుపు వద్దబొమ్మను నిద్రపుచ్చుతూ ఎదురుచూస్తోంది ఏ షా దిగివస్తాడుబిడ్డను
సాహిత్యం కవిత్వం

అత‌ను పాల‌పుంత‌

తెల్వకుండానే  పుట్టుక పొలిమేరల్లో చుట్టుకున్న  నాగుపామును ఒల్చేసి చావుదాకా రక్తమాంసల సైద్ధాంతిక నిర్మాణమై చిగుళ్లువేసి వర్గపోరాటమై వెల్గుజిమ్మిన ఒక నూతన మానవుడు ఎర్రదండై అడవి మెడలో ఒదిగి పోయాడు ఒక యుద్ధం లోంచి ఆవిరి లా ఎగిరి వచ్చి బీడుపడిన నేలను జనసంద్రం చేసిన శాంతి మేఘము భూమి యుద్ధ కేంద్ర మైనంత కాలం వొక వాస్తవికత మూసుకున్న తలుపుల మీద చర్చలు నాటిపోయాడు వొక ఆధిపత్య రక్త పాతాన్ని దొర్లించిన సాయుధ విశాల ప్రవాహం లో వాగులు వంకలు పిల్లకాల్వలు  యుద్ధవ్యాపనమౌతున్న అడవి మైదానానికి తుపాకులవంతెనతడు మట్టి మనిషిని కౌగిలించుకొని కాలం ఈ పిడికెడు మట్టే ఉద్యమాలపుట్ట
సాహిత్యం కవిత్వం

నూతన మానవుడు

అస్తమించడమంటే రేపటి సూర్యోదయమే కదా అతడు అస్తమించాడు తుమృకోట తూర్పు గుమ్మంలో పొడిచి చిన ఆరుట్ల చిగురు కొమ్మల్లోంచి జాలువారి గుత్తికొండ నెత్తిమీద మొలిచిన సూర్యుడతడు శాంతి పావురంకు  ప్రజలంటే ఎంత పావురం విద్రోహ పొగమబ్బుల మధ్యనే శాంతి కపోత పతాకమెగిరేశాడు మంజీర సర్కారు జాగీరు మీద నిలబడి జన ఎజెండా జెండా నాటి ప్రజా ఆకాంక్ష వెల్లువల సద్దిమూట పట్టుకెళ్లాడు పంతులు కదాప్రపంచ గమనాన్ని తన వేకువ వెలుగు దారుల్లో చూపించి జనతన సర్కార్ రాస్తా మీదుగా జనాన్ని నడిపించాడు అతని కిరణాలు అరికాళ్ళు నాటిన అడుగుల నిండుగా జగిత్యాల జైత్రయాత్రలు...జంగల్ మహల్ రెపరెపలు... కన్నతల్లుల కడుపుకోత
సాహిత్యం కవిత్వం

వెలుగు‌ రేఖలు

అమ్మ  అంతే మౌనంగా  తన భుజాన్ని తనకు  ఆసరాగా ఇచ్చిన  సహచరిగా  నిబ్బరంగా  నిదానంగా తోడుగా  నిర్బంధాన్ని ఎదుర్కొన్న అమ్మతనమే తనది విసుగు లేని తన జీవనయానం తెల తెలవారే  చిరునవ్వుతో ఉదయించే అమ్మ సభలలో ఓ కాంతిరేఖ నిరాడంబరంగా  నిలకడగా తన తోవ  వెనక నడచిన సహచరిగా  ఎప్పుడూ గుర్తుండే  అమ్మ తను అమ్మలంతే  ఆకాశంలో వెలితిని  పూడ్చే వెలుగు రేఖలు వారికేమిచ్చి  రుణం తీర్చుకోగలం మనసంతా నిండిన  దుఃఖపు నివాళి తప్ప... (కా.ఆలూరి లలితమ్మకు నివాళిగా)