వ్యాసాలు

ఆనంద్ దూలా నూతన మానవుడు

ఇంద్రవెల్లి పాలవెల్లిఅమ్మ ఒడి ఇంకెంత మాత్రం అశ్రు సిక్తం కావొద్దనిఅందిస్తున్న ఆయుధాల్లోఅదిలాబాద్ నా తల్లి – (లాల్ బనో.... ఎన్ కె) అదిలాబాదు జిల్లా, బెల్లంపెల్లి, కన్నాల బస్తీలో నక్సల్బరీ శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రేరణతో కార్మిక వర్గ పోరాటం పారంభమైందంటే అందుకు రెండు పిడికిళ్ళు బిగించిన వాళ్ళు గజ్జల గంగారామ్, కటకం సుదర్శనం. కన్నాల బస్తీ అంటే కార్మికవాడ. ఆ వాడలో బెల్లంపెల్లి విప్లవోద్యమ తల్లిగా పిలుచుకునే లక్ష్మమ్మకు పీపుల్స్‌వార్ దండకారణ్య పర్‌స్పెక్టివ్ విప్లవాచరణ ప్రారంభకాలంలోనే అమరుడైన గజ్జల గంగారామ్ కన్నకొడుకు అయితే ఈ 31న అమరుడైన కటకం సుదర్శన్ (69) పెంచుకున్న కొడుకు అనవచ్చు. ఆమె
వ్యాసాలు

పత్రికలతో ఇంటర్వ్యూలను  ప్రారంభించిన తొలి మావోయిస్టు అగ్రనేత 

కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదర్శన్ తన ఏకైక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. అరవై తొమ్మిదేళ్ల సిపిఐ (మావోయిస్ట్) అగ్రనేత, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ బహుశా అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌కి చెందిన కనిపించే ముఖాలలో ఒకరు. అతను అడవుల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సంస్కృతిని ప్రారంభించాడు. కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అప్పటి నక్సల్స్ ప్రభావిత మానాల అడవిలో 1996 సెప్టెంబర్‌లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ  జరిగింది. నేను సెప్టెంబరు 1996లో
వ్యాసాలు

సాహిత్య విమర్శలో కేతు

1980`81 విద్యా సంవత్సరంలో నేను డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను. అప్పుడు పాఠశాల క్లాస్మేట్‌, డిగ్రీలో సీనియర్‌ అయిన పటేల్‌ సుధాకర్‌ రెడ్డి, నేను అప్పుడప్పుడే విద్యార్థి ఉద్యమంలో అడుగుపెడుతున్న సందర్భం. ఆ సమయంలో సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటి అనే చర్చ వచ్చింది. దానికి సమాధానంగా కొకు సాహిత్య ప్రయోజనం అనే వ్యాస సంకలనం మాకు బాగా పనికి వచ్చింది.  దాన్ని చదువుకున్న తర్వాత ప్రాథమికంగా సాహిత్యం రాజకీయాలు కలిసే ఉంటాయని స్పష్టతకు వచ్చాం.  ఆ వ్యాసాల సంకలనకర్త కేతు విశ్వనాథ రెడ్డి గారు. అప్పుడు మొట్టమొదట ఆయన పేరు విన్నాం. ఆ తర్వాత కొకు సాహిత్య
వ్యాసాలు

మల్లయోధుల  నిరసన

భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను
వ్యాసాలు

భూమిని కాపాడుకునే పోరు

(ఈ వ్యాసం ఆజ్ తక్ మే రెండో వారం  సంచికలో అచ్చయింది . ఛత్తీస్ ఘడ్ లో క్షేత్ర పరిశీలన చేసి రాశారు. ఈ ప్రాధాన్యత రీత్యా  వసంత మేఘం పాఠకులకు దీన్ని  హిందీ నుంచి అనువదించి అందిస్తున్నాం. పాపులర్ జర్నలిజం లోని    అటు ఇటుకాని *సత్యాన్వేషణ*, పరస్పర వ్యతిరేక  వైఖరి,   కార్పొరేట్ల, పాలకుల   దృష్టి కోణం ఇందులో ఉన్నప్పటికీ కొన్ని నిజాలు కూడా ఉన్నందువల్ల దీన్ని ప్రచురిస్తున్నాం- వసంతమేఘం టీం ) *ప్రభుత్వ నలువైపుల దాడితో బలహీనపడ్డ మావోయిస్టులు; భద్రతా బలగాలు వైమానిక దాడి చేశాయని ఆరోపణ* తేదీ ఏప్రిల్ 25 న  దర్భా డివిజన్‌లో మావోయిస్టులు ఉన్నట్లు
వ్యాసాలు

ఆంగన్‌వాడీల జీవితాన్నిపరిచయం చేసిన పోరాటం

(గత ఏడాది చివరలో దేశమంతా మొదలైన అంగన్ వాడీల, ఆశా వర్కర్ల పోరాటం ఆ తర్వాత కూడా కొనసాగింది. ఈ వ్యాసం అప్పట్లో రాశారు. వసంత మేఘానికి ఆలస్యం గా చేరింది. విషయం ప్రాధాన్యత ఇప్పటికి ఉన్నందు వల్ల ప్రచురిస్తున్నాం - వసంత మేఘం టీం ) మన దేశంలో చాలీ చాలని జీతాలతో వెట్టి చాకిరి చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోట్ల సంఖ్యలో వుంటారు. వారంతా దిగువ శ్రేణిలోకే  వస్తారు. అలాంటి ఉద్యోగులలో అంగన్‌వాడీలు, వారి వద్ద సహాయకులుగా చిన్నారులకు వంటచేసి పెట్లే వారు, ఆశా (ఏ.ఎస్‌.హెచ్‌.ఏ - సాధికారిక సామాజిక అరోగ్య కార్యకర్త) వర్మర్లు కూడ
వ్యాసాలు

పోలవరంలో మునిగిపోతున్న ఆదివాసులు

తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో 'భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య' ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం. తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం
వ్యాసాలు

ఎడతెరపి లేని వానల్లో నిరవధిక ఉద్యమం

నీరు-అడవి-భూమికోసం ఆదివాసీల పోరాటం చాలా కాలంగా జరుగుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో వారు అలాంటి పోరాటమే ఒకటి చేస్తున్నారు. కొత్త భద్రతా బలగాల క్యాంపు ఏర్పాటు, గ్రామంలో రోడ్డు విస్తరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరవధిక సమ్మెకు కూర్చున్నారు. 115 రోజులకు పైగా సాగుతున్న ఈ ఉద్యమంలో 33 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. 'మడోనార్ జన్ ఆందోళన్' బ్యానర్‌పై జరుగుతున్న ఈ ఉద్యమంలో వందలాది మంది పాల్గొంటున్నారు. ఇందులో పురుషులు-మహిళలు, పిల్లలు-వృద్ధులు అందరూ ఉన్నారు. తమ సంస్కృతిని, అడవిని కాపాడుకోవడం ఒక్కటే వారి లక్ష్యం. నారాయణపూర్‌లో ఖనిజ సంపద పుష్కలంగా ఉండటంతో, ప్రజలు వ్యతిరేకించినప్పటికీ రావ్‌ఘాట్, ఛోటేడోంగర్‌లో గనుల
వ్యాసాలు

స్మృతి చిహ్నాలతో మన ప్రయాణం – రాజ్యం నిర్భంధం.

ఏప్రిల్ 14,2023న రాష్ట్ర4 రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న డా||బి. అర్ అంబేడ్కర్ విగ్రహ అవిష్కరణ జరగడం ఒక మంచి పరిణామమే. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంశం వలన తెలంగాణ పౌర సమాజం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి సాధించిన రాష్ట్రంలో అంబేడ్కర్ నీ సమరించుకోవడం అనేది ఇక్కడి ప్రజల బాధ్యతగా భావించవచ్చు. అది వారి గుండెల్లో చెరగని ముద్రగా, ఇంటి పెద్దలను తలచినట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ నేలకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం మెండు. ఎవరు ఏది సహాయం చేసిన వారి
వ్యాసాలు

భద్రతా బలగాలు వైమానిక  బాంబు దాడి చేశాయని బస్తర్ గ్రామస్థుల ఆరోపణ: వాస్తవం ఏమిటి?

ఆరోపణల్లోని నిజానిజాలను తెలుసుకోడానికి దక్షిణ ఛత్తీస్‌ఘడ్‌లోని అడవి లోతట్టు ప్రాంతానికి వెళ్ళాం - అరుణాభ్ సైకియా ఛత్తీస్‌ఘడ్‌ దక్షిణ కొనలో, తెలంగాణ సరిహద్దుకు చాలా దూరంలో, ఏప్రిల్ ఎండలో రాళ్ళు రప్పలతో నిండిన నిర్మానుష్య కొండపైన లోహ, ప్లాస్టిక్ చెత్త కుప్పలు మండుతున్నాయి. దిగువన ఉన్న గ్రామాలలో ప్రజలు రాకెట్లా వున్న వస్తువుల పెద్ద శకలాలను సేకరించారు. అవి భద్రతా బలగాలు జరిపిన వైమానిక దాడులకు సంబంధించిన అవశేషాలు అని చెప్పారు.ఏప్రిల్ 7వ తేదీ ఉదయం తాను మహువా పువ్వులు సేకరిస్తున్నప్పుడు ఆకాశంలో "తేనెటీగల ఝంకారంలా” వున్న విచిత్రమైన శబ్దం వినిపించిందని" అని భట్టిగూడ గ్రామానికి చెందిన రైతు