సీమ అస్తిత్వ చరిత్రలో వెలుగు కెరటం సుబ్బరాయుడు
( రాయసీమ విద్యావంతుల వేదిక మూడో బులిటెన్కు రాసిన ముందుమాట. జనవరి 4న కర్నూలులో జరగనున్నఆర్ వి వి రాష్ట్ర మహాసభలో ఆవిష్కరణ) చరిత్ర చాలా అద్భుతమైనది. తన స్థల కాలాలకు అవసరమైన మానవులను తానే తయారు చేసుకుంటుంది. తన స్వరానికి తగిన గొంతుకలను సిద్ధం చేసుకుంటుంది. ఈ విడత రాయలసీమ ఉద్యమానికి అవసరమైన వాదనలతో మేధో సమర్థన అందివ్వగల వ్యక్తిగా చరిత్ర సుబ్బరాయుడుగారిని ఎంచుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయే నాటికి ఆయన కేవలం ఇంజనీర్ మాత్రమే. వృత్తి వల్ల పట్టుబడిన నైపుణ్యాలతో రాయలసీమ నీటి పారుదల వ్యవస్థ గురించి ఆలోచిస్తుండేవారు. తుంగభద్రలో వృథా అవుతున్న నీటిని ఒడిసిపట్టుకొని










