వ్యాసాలు

గుండెలపై రాసుకున్న గోండుల సాహిత్యం

సాహు (కొమురం భీమ్‌ నవలా రచయితలలో ఒకరైన సాహు ఆఖరి వ్యాసం. 1993 ఫిబ్రవరి 13, 14 తేదీలలో హైదరాబాద్లో జరిగిన దళిత రచయితల, కళాకారుల మేధావుల ఐక్యవేదిక రాష్ట్ర మహాసభలలో ఈ వ్యాసాన్ని సమర్పించారు. మార్చి 16 ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఈ వ్యాసాన్ని పున‌ర్ముద్రిస్తున్నాం.-  వ‌సంత‌మేఘం టీమ్)  సూర్య వంశ దేవతల్‌  కేత దర్శ సితార  సూర్య వంశ రాజధాని  మావబూడె మాతారా  కచ్చీ బాండేగ్‌ మావాసొత్తా  కయ కాల్‌ కుటియాతా  మావా రాజ్‌ బుడేమాతా  సూర్య వంశ దేవతల అంశంగా చెప్పుకునే గిరిజనులు వాళ్ళ రాజ్యాలు పతనమయి, క్షతగాత్రులై ఆయుధాలు కోల్పోయి అడవులలో జంతువుల్లా వేటాడబడుతూ
వ్యాసాలు

థ‌ల్‌ముత్తు, నాట్యరాజన్‌ల‌ను స్మ‌రించుకుందాం  

హిందుత్వ కౌటిల్య మాతృభాషా వాదం భాష అలోచనల ప్రత్యక్ష వాస్తవానికి రూపం - మార్చ్‌థ‌ల్‌ముత్తును త‌ల‌చుకోనివాడునాట్య‌రాజ‌న్‌ను గుర్తు చేయనివాడుతేనెలొలుకు ప‌లుకుల‌తో ఎంతభాషాభిమానాన్ని చాటుకున్నాచాణక్య‌నీతి చెల్ల‌దుగాక చెల్ల‌దుబ్రాహ్మ‌ణ దుర‌హంకార‌వాదంహిందీ ఆధిప‌త్య దుర‌భిమానంమ‌ట్టిగ‌ర‌వ‌క త‌ప్ప‌దు మన ప్రియమైన భారత దేశం అనేక భాషలకు, సంప్రదాయాలకు, జాతులకు, మూలవాసుల సముదాయాలకు, సంస్కృతులకు నిలయం. వైవిధ్యం దీని ప్రత్యేకత. వాటిని సంరక్షించుకోవడం మనందరి విధి. అవి ఈనాడు పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి అస్తిత్వం తీవ్ర ప్రమాదంలో ఉంది. తెగలు లుప్తమవుతున్నాయి. భాషలు అడుగంటిపోతున్నాయి. తర తరాల వారసత్వ సంపద వినాశనపు అంచులలో అస్థిత్వానికై కొట్టుమిట్టాడుతున్నవి. యేడాది పొడుగుతా ఐక్య రాజ్య సమితి పేరు మీదనో,
వ్యాసాలు

వీరమాత కామ్రేడ్‌ అనసూయమ్మకు నివాళి!

అనసూయమ్మ 2022, జనవరి 30న తన 97వ యేట హైదరాబాద్‌లో మృతిచెందారు. ఆమె మావోయిస్టు నాయ‌కుడు   అమరుడు కామ్రేడ్‌ సంతోష్‌ (మహేష్‌)కు కన్నతల్లి. దండ‌కార‌ణ్య సాహిత్య సాంస్కృతికోద్య‌మ ప‌త్రిక 'రుంకార్ అమెకు తలవంచి వినమ్ర శ్రద్దాంజలి అర్చిస్తున్నది. ఆమె బంధు మిత్రులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నది. అనసూయమ్మ దాదాపు 80 యేళ్ల క్రితం ఎర్రంరెడ్డి లక్ష్మారెడ్డి స‌హ‌చ‌రిగా వర్తమాన జనగామ జిల్లా కడవెండిలో అడుగుపెట్టింది. విసునూరు దొరలతో వీరంగమాడి, కరడుగట్టిన భూస్వామ్యానికి బీటలుబార్చిన తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య అమరత్వం రూపంలో తొలిత్యాగాన్ని అందించిన గ్రామంగా కడవెండి తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రవేసుకుంది. పుట్టిన వర్గం, ముఖ్యంగా
వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ
వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
వ్యాసాలు

నా అనుభ‌వాలు

ఒక గ్రామంలో  –పిల్లల దగ్గర నుండి..  మంచికంటి             ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ...   బతకడంలో సంఘర్షణ... చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ... అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు...  ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా  సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా... చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ... ఎంతో అసహనం....            మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి.... ఏదో చేయాలి.. బాల్యం నుండి  ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే  కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి... ఏదో సాధించాలి.. ఇలా  ఎన్నో అర్థం కాని
వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ
వ్యాసాలు

నిండైన ఆలోచనాపరుడు రామ్మోహన్‌సార్‌

పాణి           రామ్మోహన్‌ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు.  తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ   ప్రపంచ కల్లోలాలపై  వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది.             మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన  ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో
వ్యాసాలు

సామ్రాజ్యవాద శిబిరాల మధ్య ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కోసమే యుద్ధం

ప్రపంచ మార్కెట్లోకి రష్యాని ప్రవేశించకుండా; దానిని ప్రపంచాధిపత్య పోటీదారుడిగా నిలిచే అవకాశం ఇవ్వకుండా;  పాత యూరోప్ దేశాలతో దాని పాత శత్రుత్వం తగ్గే స్థితిని రానివ్వకుండా; ఆఫ్ఘనిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత తన వెనకంజ స్థితిని బలహీనతగా తీసుకునే అవకాశాన్ని కూడా దానికి ఇవ్వకుండా ఇటీవల అమెరికా శరవేగంతో చేపట్టిన వ్యూహాత్మక చర్యలు బెడిసికొట్టాయి. హిరోషిమా, నాగసాకి అణు మారణహోమంతో ప్రారంభమై, ఏడున్నర దశాబ్దాల పైబడి పొందిన  అమెరికా ప్రపంచాధిపత్య రాజనీతి ఉక్రెయిన్ వద్ద గాలిలో కలిసిపోయింది. ఇది ప్రపంచ బలాబలాల పొందికలో వస్తున్న గుణాత్మక మార్పుల్ని సూచించే సంఘటనగా చరిత్రలో నిలుస్తుంది. ఇదేదో ఉక్రెయిన్ కి
వ్యాసాలు కాలమ్స్ సమకాలీనం

దాడి దుర్మార్గమే, కాని దానికి బాధ్యులెవ్వరు?

నాగరిక సమాజంలో రాజ్యాలు చేసే యుద్దాలన్నీ నేరాలే. అయితే యుద్ధాలు ఒక్కసారిగా అనుకోకుండానో, అకస్మాత్తుగానో జరిగే సంఘటనలు కావు. వాటికి ఒక చారిత్రక క్రమం ఉంటుంది. వాటిని ప్రేరేపించే, కుట్రలు చేసే సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉంటాయి. సొంత లాభాల కోసం నరమేధానికి వెనుకాడని శక్తులుంటాయి. వాటికి వత్తాసుగా మొసలి కన్నీళ్లు కారుస్తూ అర్థసత్యాలను, అబద్ధాలను ప్రచారంచేసే రకరకాల మీడియా సాధనాలు ఉంటాయి. వీటన్నింటిని సుదూరం నుండి చూస్తూ దురాక్రమణలను ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలిపే ఉదారవాద, మానవీయ సమాజం ఉంటుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్న దాడి సందర్భంలో కూడా అదే జరుగుతుంది. అయితే ఈ దురాక్రమణను