సాహిత్యం వ్యాసాలు కొత్త పుస్తకం

భూమి రంగు కవి

కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని వర్మ అంతరంగ సంచలనాలివి. ఆయన సృజన లోకపు చిత్తరువులివి.  మానవాళి అనుభవిస్తున్న రాపిడినంతా ఆయన తనలోకి వొంపుకొని రాశారు. తన ఊహాన్వేషణల వెంట మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ మన అనుభవాలనూ కవిత్వం చేశారు. మానవుడిగా, కవిగా ఆయనలోని అలజడినంతా మనకు పంచిపెట్టడానికి తన కాల్పనికతనంతా వెచ్చించారు.    వెరసి కవిగా వర్మ తన పరిణతినంతా పోతపోసిన సంపుటి ఇది. ఎవరీ భూమి రంగు మనుషులు? ఎక్కడి వాళ్లు? వాళ్ల కోసం వర్మ ఎందుకింత దు:ఖితుడవుతున్నారు? ఎలాంటి
సాహిత్యం కాలమ్స్ అలనాటి రచన

చెదిరినసమాజం

మూలం: చినువా అచ్ బె                        తెలుగు అనువాదం: కొలసాని సాంబశివరావు                                                             “చెదిరిన సమాజం” ఇది నైజీరియన్ నవల. దీని ఇంగ్లీష్ పేరు “థింగ్స్ ఫాల్ అపార్ట్”[Things fall apart]  దక్షిణ ఆఫ్రికాలో ఒక దేశం నైజీరియా. ఆ దేశంలో ఒక మారు మూల గ్రామం ”వుమ్యోఫియా”. నాగరికతకూ, సాంకేతికతకూ దూరంగా వున్న గ్రామం. వ్యవసాయపు పనులూ, వర్షం కోసం ఎదురు చూపులూ, కట్టుబాట్లూ, రచ్చబండ తీర్పులూ, నమ్మకాలూ, ముర్ఖత్వాలూ, అన్నీ కలసి దూరంగా బ్రతుకుతున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే ‘యామ్’ పంటల పండుగ.ఆరోజు అందరూ ఒకచోట చేరి సమిష్టి వంటలూ, ఒకవైపు సంగీతవాయిద్యాలూ, మరోవైపు మల్ల యుద్దాలూ, ఆడా, మగా,
సాహిత్యం వ్యాసాలు

వ‌ర్గ పోరాట ఆచ‌ర‌ణ‌లో సంస్కృతి

(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం - వ‌సంత‌మేఘం  టీం)  మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.
సాహిత్యం వ్యాసాలు

ఇవ్వాల్టి రేపటి కవిత్వం

“ఈ వేళప్పుడు” గురించి ఏడాదిగా ఆలోచిస్తున్నాను. 'ఇది చదివి తోచింది రాయిమని అరసవిల్లి కృష్ణ ఇచ్చారు. సుమారు దశాబ్ద కాలపు కవిత్వం. చదువుతోంటే ప్రతిసారీ 'ఈ వేళనే కవిత్వం చేస్తున్నారా? అనిపించేది. ఇందులో వర్తమానం గురించే లేదు. వర్తమానం రూపొందుతున్న తీరు మన పఠన అనుభవంలోకి వస్తుంది. ఇదీ ఈ కవిత్వంలోని ప్రత్యేకత. ..  ఇలాంటివేవో రాద్దామని నవంబర్‌ 18 ఉదయం ఐదున్నరకే నిద్రలేచి మొదలు పెట్టాను. కాసేటికల్లా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు మొదలయ్యాయని ఫోన్లు. అ సంగతి అరసవిల్లి కృష్ణకు చెప్పాలను కాల్‌ చేస్తే కలవలేదు. మళ్లీ ప్రయత్నించాను. కలవలేదు.  *ఈ వేళప్పుడు” ఆయన
సాహిత్యం కవిత్వం

సిగ్గరి పొద్దు

నిలుచున్న పాట్నే పాటందుకొనివాలుగా జోలెట్టే సిగ్గరి పొద్దువాగుడు గుల్లల సంద్రాన మణిగిఇంత రొదలోనూ తొణకని సద్దు భూమిలోకంటా చూస్కుంటాగీట్లను అటూఇటూ కలబెడుతూ…భూమిలోకంటా చూస్కుంటాచుక్కల లెక్కల చిక్కులు తీస్తూ..భూమిలోకంటా చూస్కుంటాఅదాటున మాటలాడుతూ… చూసినవాళ్లు అన్నారు కదా!'ప్రేమించడమంటే అట్టా..చుట్టుముట్టినవాళ్లు చెప్పారు కదా!బాటా కుమనిషంటే అట్టా…కలిసినవాళ్లూ, చేతులు కలిపినవాళ్లూపిల్లలను తోడిచ్చిన వాళ్లూ నమ్మారు కదా!తూటాకు శాంతి మొలిస్తే అట్టా… జంగమస్థానం కోసం జల్లెడపట్టిన నెత్తుట మెత్తని నెత్తావిమట్టి వాసనలేసే మౌనానికిమాటిస్తే, ముఖమిస్తే అట్టా సారూ!
కవిత్వం సాహిత్యం

జరూర్

గనిలో వారంచీకటిలోదీపాల వెలుతురు లోనల్ల బంగారం వెలికి తీతరెక్కలు ముక్కలు చేసుకుంటూజనానికి వెలుతురు నివ్వడానికి వారం బడలికసడలించుకుంటూకుటుంబాలతో గడపాలనే ఆనందంతోఆశతో ఊసులతో ఊహలతో కలలతో బయల్దేరాం పాటలు పాడుకుంటూఎప్పటిలాగేలేగదూడల్లా ఎగురుతూఅదే బండి అదే తోవ అదే సమయం ఏళ్ళుగా మాయదారి చట్టంచేతుల్లో పెట్టుకున్నరక్షక దళంవిరుచుకు పడిందికాల్పుల మోతగుండెల్లో రుధిరం చిమ్మిందిదేహాలను చిదిమిందిబతుకు బుగ్గి చీకటిలోనే అయ్యో విచారం వ్యక్తంపోయిన ప్రాణం ఖరీదు కట్టేచట్టం మాత్రం అలాగేఎన్ని నిరాహార దీక్షలు చేస్తేనేందున్నపోతు పై వాన కురిసినట్టే గా ఆపరేషన్ అవగాహన లోపంఎవడు జవాబుదారీచంపూ డబ్బులు ఇయ్యికథా కమామిషుప్రశ్న నీ చంపూ లేదాజైళ్లలో నింపుకర్కశ రాజ్యంమత్తు లో జోగుతున్న జనంమీ వంతూ
సాహిత్యం కాలమ్స్ కథావరణం

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో