వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో
వ్యాసాలు

మతవర్గ తత్త్వం

(జనవరి 10 , 1985 గద్వాల విరసం సాహిత్య పాఠశాల ప్రసంగ పాఠంలోంచి కొంత భాగం - వసంత మేఘం టీం ) ...ఐతిహాసిక ,  పౌరాణికాంశాలను వదిలి, చరిత్రలో మధ్యయుగాలకు సంబంధించిన మతపరమైన యుద్ధాలకూ మారణదారుణాలకూ వస్తే, వాటి కారణాలు కేవలం మతంలోనే లేవని తేలుతుంది. మతసంస్థలకు చెందిన ఆస్తిపాస్తుల విషయంలో, రాజపోషణవల్ల సమకూరే శుద్ధభౌతిక సదుపాయాల విషయంలో, భూస్వామిక సమాజంలోని హెచ్చుతగ్గుల విషయంలో వచ్చిన సామాజికమైన పోటాపోటీలు మత విరోధాల రూపం పొందిన సందర్భాలు ఒకటీ రెండూ కాదు. బ్రాహ్మణ మతం ఎన్నడో గతించిపోగా, బౌద్ధాన్ని చావగొట్టిగానీ చచ్చుపార్చిగానీ హైందవం తన ప్రాబల్యం స్థాపించుకున్న తర్వాత
వ్యాసాలు

యుద్ధం మధ్య మనం…,

... కానీ మనకు ఆ సంగతి తెలియదు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. సరిగ్గా ఫాసిస్టు కాలంలో జరుగుతున్న యుద్ధం ఇది. జర్మనీలో  గ్యాస్‌ ఛాంబర్స్‌ గురించి విన్నాం. ఇటలీలో బ్లాక్‌ షర్ట్స్‌ గురించి విన్నాం. జనంలోంచే ఉన్మాద మూకను కూడగట్టి సమాజం మీదికి ఎగదోసిన చరిత్ర చూశాం.  ఇక్కడ  జనం మీదికి సైన్యాన్ని ఉసిగొల్పి, వైమానిక దాడులు చేస్తున్న ఫాసిస్టు యుద్ధం మధ్యలో మనం జీవిస్తున్నాం. జనవరి 11న తెల్లవారుజామున దండకారణ్యంలోని దక్షిణ బస్తర్‌ పామేడ్‌`కిష్టారం ప్రాంతంలో  భారత ప్రభుత్వం హెలికాప్టర్‌తో బాంబు దాడులు చేసింది. దేశాల మధ్య  సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్‌ ఎయిర్‌ లైన్స్‌ చాపర్‌ను
వ్యాసాలు

మానవ హక్కులపై నిలదీసిన యుఎన్‌హెచ్‌ఆర్‌సి

దేశములో మానవ హక్కుల పరిస్థితి దారుణంగా తయారైందని, తీవ్రవాద నిరోధక చట్టాల పేరుతో పౌర సమాజంపై ఆంక్షలు విధిస్తున్నారని, ఐరాస మానవ హక్కుల కమీషన్‌ ఆధ్వర్యంలో జెనీవాలో నవంబర్‌ 10న జరిగిన వార్షిక సమావేశంలో భారత్‌ను పలుదేశాలు నిలదీయడం జరిగింది. సభ్య దేశాలైన 193 దేశాలలో పౌర, మానవ హక్కుల పరిస్థితిపై ఐరాస మానవ హక్కుల మండలి ఐదు సంవత్సరాల కొకసారి సమీక్ష జరుపుతుంది. అత్యవసర పరిస్థితుల్లో అదనపు సమావేశాలకు పిలుపు నిస్తుంది. మానవ హక్కుల మండలిలో 43 దేశాలు ఉన్నాయి. ఆయా దేశాలలోని మానవ హక్కుల పరిస్థితి నివేదికలపై సమీక్ష చేస్తారు. సభ్య దేశాల నుంచి మానవ
వ్యాసాలు


చట్ట బద్ధ పాలన అడిగినందుకే సాయన్న జైలుపాలు

కొల్లూరి సాయన్న ... ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సుందరగిరి గ్రామంలో దళిత రైతు కుటుంబం లో పుట్టాడు. న్యాయశాస్త్ర విద్యార్ధిగా విద్యా రంగ సమస్యలపై పని చేశాడు. చదువుకున్న చదువుకు సార్ధకత చేకూరేలా, తెలంగాణా గ్రామీణ ప్రజల కోసం, ముఖ్యంగా రైతుల కోసం , ఆదివాసీ ప్రజల కోసం పని చేయాలని ఐదేళ్ల క్రితం నిర్ణయించుకుని పని ప్రారంభించాడు. అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన కార్యకర్త సాయన్న. నిత్య అధ్యయనంతో వ్యవసాయ రంగ సమస్యలపై అవగాహన పెంచుకుని వివిధ జిల్లాలకు తన పనిని విస్తరించుకుని తెలంగాణా రైతాంగ సమితి నాయకుడుగా ఎదిగాడు. ఆ సంస్థకు రాష్ట్ర అధ్యక్షులుగా,
వ్యాసాలు సంభాషణ

పాలకవర్గాలలో మరో కలకలం

సెప్టెంబర్‌ మూడవ వారంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్‌) లో సౌమిత్రాబోస్‌ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్‌ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ గఢ్‌ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్‌ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
వ్యాసాలు

ఎట్టకేలకు కప్పన్‌కు బెయిల్‌

40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా,