ఆర్ ఎస్ ఎస్ ఫాసిస్టు స్వభావం దాని సిద్ధాంత రాజకీయాల లోగుట్టు…
(*విప్లవోద్యమంపై విషం కక్కుతున్న విద్యార్థి పరిషత్ ప్రచారాన్ని ఎండగట్టండి* అనే పేరుతో రాడికల్ విద్యార్థి సంఘం 1984లో ప్రచురించిన పుస్తకంలోని ఒక వ్యాసం ఇది- వసంతమేఘం టీం) తరతరాల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వీరోచితంగా ముందుకు సాగుతున్న తెలంగాణా రైతాంగ పోరాటాలపై తీవ్రమైన దమనకాండను ప్రయోగించి అణిచి వేద్దామని తెలుగుదేశం ప్రభుత్వం సి.ఆర్.పి బలగాలను దింపగా మరో వంక ఆరెస్సెస్ ,బిజెపి, ఎబివిపిలు ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలిచి విప్లవోద్యమంపై దుమారాన్ని రేపుతూ రైతుకూలీలపై, విద్యార్థి యువజనులపై పాశవికమైన దాడులకు పాల్పడుతున్నాయి. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలలో ఈ ఫాసిస్టు మూకల అఘాయిత్యాలకు అంతులేకుండా పోయింది.










