వ్యాసాలు

నిబద్ధ విమర్శకుడు కెవిఆర్

కెవిఆర్‍గా నిలిచి పోగోరిన కనుపూరు వెంకట రమణారెడ్డి కవి, విమర్శకుడు, నాటక కర్త, విరసం వ్యవస్థాపక కార్యదర్శి, పత్రికా సంపాదకుడు, అధ్యాపకుడు. మార్క్సిస్టు దృక్పద భూమికతో ఒక రచనను రచయితని అంచనా వేసే పద్ధతికి కె.వి.ఆర్ రచనలన్నీ తార్కానాలుగా నిలుస్తాయి . తెలుగులో వ్యాసం రాసినా, గ్రంథం రాసి నా, ఒక రచన వెలువడిన కాలం దాని ముందు వెనుకలు, సామాజిక ఆర్థిక రాజకీయ సాహిత్య పరిణామాలు, రచయిత దృక్పథం ,సాహిత్య తత్వం వంటి అంశాలతో ముడిపెట్టి సమగ్ర దృష్టితో విమర్శ చేసిన వారు కెవిఆర్. మహోదయం, కవి కోకిల, జగన్నాథ రథచక్రాలు, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర వంటివి
వ్యాసాలు

…not just the future, the present too

(Speech at Virasam Foundation Day Conference - July 2025. Edited for better clarity.) Comrades, I thank the organisers of this conference, the comrades of Virasam, for giving me this opportunity to come and be with you and talk about this topic. Essentially, it relates to the tremendous repression being faced by the revolutionary movement today. The huge losses it has sustained and whether that calls for any review or change
వ్యాసాలు

వెచ్చఘాట్ లో సగం ఆకాశం

ఈ తరం మహిళలు నిర్మిస్తున్న పోరాట గాథ ఇది కొత్త తరం పోరాటాల యుగం.  సాంప్రదాయక విలువలను, దోపిడీ వ్యవస్థలను ప్రశ్నిస్తూ మహిళలు పోరాటాల్లోకి వస్తున్నారు. తద్వారా పోరాటాలు కూడా కొత్తదనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇందులో వెచ్చ ఘాట్ పోరాటం ఒకటి. ‌‌బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్ ఘడ్ లోని కాంకేర్  జిల్లాలోని చిత్రం, వెచ్చఘాట్, కాంధాడిల్లో బిఎస్.ఎఫ్ క్యాంపుల నిర్మాణం, పరాల్‌కోటని పర్యాటక కేంద్రంగా మార్చాలని, కోత్రి నది మీద వంతెన నిర్మాణం, మర్రొడ నుండి రోడ్డు నిర్మాణం చేయాలని ఆదివాసులు చాలా కాలంగా పోరాడుతున్నారు.   ఈ పథకాల  వల్ల ఆదివాసీ-మూలవాసీ
వ్యాసాలు

రాజ్య నిరంకుశత్వ బాధితుడు ఫాదర్ స్టాన్ స్వామి

(ఆగష్టు 9న కర్నూలులో విరసం నిర్వహించిన పుస్తకావిషకరణ సభ ప్రసంగ పాఠం) అరుణ్ గారు అనువదించిన "నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాను" అనే తెలుగు అనువాద పుస్తకం యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను, ఇది ఫాదర్ స్టాన్ స్వామి రచించిన "I am not a Silent Spectator" అనే అసలు పుస్తకం నుండి వచ్చింది, ఇది అతని జైలు డైరీ. ఇతరుల కోసం తన ప్రాణాలను అర్పించిన, సరళతతో జీవించిన, న్యాయం కోసం నిలబడి, మనస్సాక్షి ఖైదీగా మరణించిన గొప్ప వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి గురించి మాట్లాడటానికి నేను సంతోషిస్తున్నాను.
వ్యాసాలు

ఆదిలాబాద్ లో30 యాక్ట్ పోదా ?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను  అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్‌ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం.  జిల్లా సూపరింటెండెంట్‌ లేదా అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు  వరకు నెలరోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల
వ్యాసాలు

ప్రియమైన అమ్మా…

ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది.
వ్యాసాలు

వియ్యుక్క: ప్రత్యామ్నాయ కథలు

భారతదేశంలో సాయుధ పోరాట ప్రాంతాలలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని మహిళా విప్లవకారులు రాసిన 20 చిన్న కథల సంకలనం వియ్యుక్క (గోండి భాషలో "వేగుచుక్క") ప్రతిబింబిస్తుంది. తాను ప్రకటించిన గడువుతేదీకి ముందరే మావోయిజంను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇది ప్రచురితమవడం ఒక వైచిత్రం. ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ఈ విప్లవకారులను దండకారణ్య అడవులను "తెగుళ్ళ” లాగా వ్యాపిస్తున్న "భయంకరమైన ఉగ్రవాదులు" అని అంటూ వారిని తలలో పేలలాగా "దువ్వేసెయ్యాల్సిన" వారిగా చిత్రీకరిస్తుంటే, వియ్యుక్కలోని కథలు వారిని తాము పనిచేసే ఆదివాసీల పట్ల కరుణను, సున్నితత్వాన్ని కలిగినవారిగానూ  సమర్థులుగానూ తెలివైన, అంకితభావంతో కష్టపడి పనిచేసే
వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి
వ్యాసాలు

దండకారణ్య ఉల్‌గులాన్‌కు జేజేలు

ఉల్‌గులాన్‌ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్‌గులాన్‌. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో  దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది,  తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే
వ్యాసాలు

వేగుచుక్క సందేశం

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ అరుణ కథల సంపుటి *అప్రతిహతం* కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది జూన్ 18 న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది . అరుణ ఆంద్ర ఒడిశా సరిహద్దు విప్లవోద్యమ కమిటీ సభ్యురాలు ) ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా