కవిత్వం

భాష

వాళ్ల భాష ఏమిటో మనకు అర్థం కాదు తలలు విదిలిస్తూ చేతులు తిప్పుతూ కళ్ళలో నిప్పులు కురిపిస్తూ ఎదలు గుద్దుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన దేహాల్తో వాళ్ళు ఏమంటున్నారో తెలువదు. చిన్నపిల్లలు సైతం చేతుల జెండాలు పట్టుకుని సైనికులకు ఎదురేగి ఏమంటున్నారో తెలియదు శిథిలాల మధ్య నిలిచి ఒరిగిపోయిన సీకుకు తన జెండానుగట్టి ఆ తల్లి ఏమని నినదిస్తున్నదో తెలియదు.. * మొరాకో ,ఈజిప్ట్ , జోర్డాన్ కెనడా, బ్రిటన్ మలేషియాల్లో వీధులు జన సంద్రాలై పోటెత్తుతున్నాయి . రాళ్లకు రాపిడైనట్లు సముద్రం ఘోషించినట్లు గుండెను డప్పు చేసి మంటలతో మాట్లాడించే వాళ్ళ భాషకు అర్థ మేమిటో తెలువదు అయితేనేం
కవిత్వం

పిల్లల దేశం

పిల్లలు దయాత్ములు ఎవరినైనా దేనిదైనా ఇట్టే క్షమించడం వాళ్లకి వెన్నతో పెట్టిన విద్య ✤ పిల్లలు తప్ప ఇంకెవరు అల్లరి చేస్తారని వొక తల్లి నాకు సుద్దులు చెప్పింది ✤ పిల్లలతో ప్రయాణం చేయడమంటే పూలతో పక్షులతో కలిసి నడవడమే ✤ ఉమ్మెత్తపూలువంటి పిల్లలు ఈ పూట తరగతిగదిలోకి లేలేత కాడలతో వొచ్చారు ✤ పిల్లలు నక్షత్రాలు పగలూ రాత్రి వెంటాడుతూ నన్నూ కాస్తా వెలిగిస్తున్నారు ✤ పిల్లలు నవ్వితేనే భూమి నాలుగుకాలాలు బతుకుతుంది ✤ ఒక మహావృక్షం కింద పిల్లలంతా చేరిన తర్వాతే మహావృక్షం మహావృక్షంగా ఎదిగిందని నానుడి ✤ పూలగౌనుపిల్ల సీతాకోకచిలుకలతో ఆడుకుంటుంది ✤ నీడలు
కవిత్వం

మళ్ళీ

వస్తున్నారొస్తున్నారు ఖద్దరు బట్టలేసి కహానిలు చేప్పనికి దొంగ లీడర్లంతా డోచోకొని తినడానికి వస్తున్నారొస్తున్నారు మీ నోటికాడి ముద్దలాగి ఓటునడగడానికి వొస్తున్నరొస్తున్నారు పాత లీడరొచ్చి మళ్ళీ ఛాన్స్ ఆడిగినాడు కొత్త లీడర్ ఒక్క ఛాన్స్ అడిగినడు పాత లీడర్ పార్టీ పనేమిచేసింది లేదు కొత్త లీడేర్ పార్టీ కొత్తగా చేసేదేం లేదు అన్ని పార్టీలు కలిసి అందినకాడికి దోచేవే వస్తున్నారొస్తున్నారు 70 ఏండ్ల నుండి ప్రజలను దోచుకునేదొక పార్టీ పొద్దంతా పొత్తులకోసం ఎదురుచూసేదొక పార్టీ కులం పేర మతం పేర చిచ్చుపెట్టేదోక పార్టీ సెంటిమెంట్ తోని చక్రం తిప్పేదొక పార్టీ వస్తున్నారొస్తున్నారు ఓట్లకోసం వస్తారు ఉద్యోగం ఊసేత్తరు నీళ్ల జాడలేదు
కవిత్వం

నేనొక ప్రపంచాన్ని కలగంటున్నాను

ఎక్కడా మనిషి మరో మనిషిని హీనపరచలేని ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ ప్రేమ భూమిని ఆశీర్వదిస్తుందో దాని దారులను శాంతితో అలంకరిస్తుందో ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ అందరూ తీయని స్వేచ్ఛా మార్గాన్ని తెలుసుకోగలరో ఎక్కడ ఆత్మ దురాశ రసి కారదో లేదా మన రోజు ధనాశ మడతలో చిక్కదో నేనా ప్రపంచాన్ని కలగంటున్నాను ఎక్కడ నలుపో తెలుపో మీది ఏ జాతైనా అవ్వొచ్చు భూమి వరాలు అందరికీ పంచబడాల ప్రతి మనిషీ స్వేచ్ఛాజీవి కావాల ఆ ప్రపంచాన్ని నేను కలగంటున్నాను ఎక్కడ దౌర్భాగ్యం తల వేలాడేయగలదో సంతోషం ముత్యంలా మెరవగలదో అందరి అవసరాలూ చూసే మానవత్వం
కవిత్వం

పువ్వులు

కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! మనుషులు మనుషుల వాసన వేయడం లేదు అనేక వాసనల్లో వెలిగిపోతున్నారు అనుమానాల వాసన అబద్ధాల వాసన అసూయల వాసన ద్వేషాల వాసన... ఊపిరి సలపని వాసనల నుండి కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! సున్నితత్వాలు నామోషీ అయ్యాయి వజ్ర సదృశ పొరలలో నాగరికత నవ్వుతోంది ఎవరు పడిపోతున్నా ఎవరు వెనకపడిపోతున్నా ఎవరు చస్తున్నా ఎవరు ఏడుస్తున్నా కులాసాగా చూస్తున్న గొప్పతనాలకు కొంచెం దూరం జరిగి- కొన్ని పువ్వుల్ని ఏరుతున్నాను నేస్తం కాస్త పరిమళం కోసం! ఎంతైన పువ్వులు పువ్వులే కదా
కవిత్వం

“ఇది అబ్బాయి..అమ్మాయికి ఇద్దరికీ సంబంధించిన విషయం”!

హై స్కూల్ కి వచ్చేదాకా నేను అబ్బాయిగానే చూడబడ్డాను అమ్మాయిల స్కూల్లో ఒకే ఒక అబ్బాయి ఉండడాన్ని వాళ్ళు గర్వంగా భావించేవారు. నా జుట్టు చిన్నగా కత్తిరించి ఉన్నా.. నేను బాగా పొగరుబోతులా ఉన్నా.. నన్ను టీచర్లు..నా తోటి విద్యార్థులు ప్రేమించేవారు. నేనూ వాళ్ళని విడిచి ఉండలేనంతగా ప్రేమించాను. *** బడిలో.. ఇంట్లో నాకు అబ్బాయిలు చేసే పనులు మాత్రమే చెప్పేవారు.. నాకు అమ్మాయిలా ఉండాలని ఉన్నా .. అబ్బాయిలా ఉండడాన్ని కూడా ఇష్టపడ్డాను. అప్పట్లో నాకుండే ఒక్కగానొక్క బాధల్లా... నా స్నేహితురాలిలా పాడలేక పోతున్నాననే ! ** ఇక నేను క్యాంపులకి వెళ్లి నప్పుడు... అబ్బాయిలు పొరపాటున
కవిత్వం

గాజా పసిపిల్లలు! Children of Gaza

నన్ను క్షమించండి... మీ కోసం జోలపాట ఎలా పాడాలో తెలీటం లేదు. మనం ఒక పని చేద్దాం.. దిశల లెక్కలు తేల్చే భౌతిక శాస్రం నాశనం అవ్వాలని ప్రార్థిదాం ! నిదుర పోతున్న పిల్లల మీద శత్రువు వదిలే ద్రోణులు.. బాంబులు గురి తప్పిపోవాలని ప్రార్థిదాం ! నన్ను క్షమించండి .. చనిపోయిన నా గాజా పసి పిల్లలారా.. మిమ్మల్నెలా నిద్ర లేపాలో అర్థం కావటం లేదు. మీతో పాటు నేనూ చచ్చి పోయాను ! నన్ను క్షమించండి.. ఈ ప్రపంచం తనని తాను విముక్తి చేసుకోవడానికి మన రక్తాన్ని మరింతగా కోరుకుంటోంది ! నా ప్రియమైన గాజా
కవిత్వం

ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు

‘ప్రజలు స్వేచ్ఛ కోరుతున్నారు’ పన్నెండేళ్ల పాలస్తీనియన్‌  బాలుడు పాడిన  పాట (అబ్దుల్‌ రహ్మాన్‌ - ఇష్టంగా అందరూ పిలుచుకునే అబ్దుల్‌ 2021లో గాజాకు చెందిన 11 సంవత్సరాల పసిబాలుడు. ఇరవైలక్షలమంది పాలస్తీనియన్లు నివసించే గాజా స్ట్రిప్‌ ` (సముద్రతీరాన ఒక అంచువంటి భూఖండిక) చుట్టూ గాజాపై బ్లాకేడ్‌ విధించిన ఇజ్రాయిల్‌ భూభాగం చుట్టూ ఒక ఎత్తైన గోడ నిర్మించి గాజానొక బహిరంగజైలుగా మార్చింది. దశాబ్దాలుగా అత్యంత జనసమ్మర్ధం గల ఆ ప్రాంతంలో విమానదాడులు చేస్తూ ఇజ్రాయిల్‌ అలవిగాని హింసావిధ్వంసాలు సాగిస్తున్నది. ముఖ్యంగా 2007లో అక్కడ హమాస్‌ అనే మిలిటెంటు సంస్థ ఎన్నికలద్వారా  అధికారానికి వచ్చినప్పటి నుంచీ మొదలుకొని అమెరికా
కవిత్వం

ఎర్రమందారం

సింగరేణీ కార్మిక వర్గంలో మొలకెత్తిన ఎర్రమందారం నీవైతే నీవు వెదజల్లే ఆ పరిమాళానికి వీచే గాలిని నేనవనా కామ్రేడ్ నా విప్లవ పయనానికి నడక నేర్పిన సాయుధ శక్తివి నీవైతే ఆ పయనంలో పీడిత ప్రజల ముక్తిని సాధించే బందూకునేనవనా కామ్రేడ్ సాధారణ సుదర్శన్ నుండి కా.ఆనంద్ గా, దూల గా 5 దశాబ్దాల అలుపెరుగని జన పోరు సంద్రంలో నూతన ప్రజాస్వామ్యాన్ని వాగ్ధానం చేసిన దృఢమైన విప్లవ కార్యదీక్ష నీవైతే ఆ లక్ష్యాన్ని అల్లుకునే కార్మికవర్గ స్పర్శను నేనవనా కామ్రేడ్ భారత విప్లవోద్యమ సారధిగా యుద్ధ రచన చేసిన నీ ప్రతి అక్షరం కుళ్ళిన ఈ దోపిడీ
కవిత్వం

పాలస్తీనాతో…

1. ఉయ్యాలలెగిరి పోతున్నాయి ఈ ఆలీవ్ కొమ్మలపై వేలాడ్తున్న ఎండిన పాల చుక్క పెదవులు సగం కాలి మెతుకులు తొంగి చూస్తున్న తడియారిన నోళ్ళు కమిలి పోయి తెగిపడిన పసి ఆరని కనురెప్పలు మసిపట్టి రాలి పడిన మఖ్మల్ వేళ్ళు గోరు తగిలితే నెత్తురు కారే పాల బుగ్గల్ని మిస్సైల్ కొరికేసిన దృశ్యం ఈ గుండె మూడు నెలల శిశువుది కాబోలు ! అవి ఆటగోళీలా కళ్ళా? యుద్ధం నవ్వుతోంది ఇజ్రాయెలై ఈ ఇసుక నేల మీద పిట్టగూళ్ళలా భూమికి వేలాడ్తున్న అస్తిపంజరాలు! ఈ దుబ్బ మీది చిన్నారిఅచ్చుల పాదాలు ఎక్కడా కనిపించవేం ? లోతైన గాట్లు పడి