కిటికీ పక్కన సీటు
కవిత్వం

కిటికీ పక్కన సీటు

ప్రపంచాన్ని కిటికీలో నుండి చూడడం మీకు అనుభవమేనా.. చల్లని గాలి తనువును తాకుతుంటే జ్ఞాపకాలు మనసును తాకుతుంటాయి పరిసరాలు వెనక్కు పోతుంటే పాత గుర్తులన్ని ముందుకొస్తుంటాయి.  బస్సుతో పాటు టైరు ఆడుతూ  బస్ వెనకాలే పరిగెత్తే పసివాడు మళ్ళీ మన పసితనాన్ని గుర్తు చేస్తాడు బస్ కోసం పరిగెత్తుతూ  వస్తున్న తల్లెంట  వెనకాలే ఏడుస్తూ వస్తున్న చిన్నోడు మన బాల్యాన్ని  బావిలోనుండి నీళ్ళు తోడినట్లుగా తొడుతుంటాడు. ఐదో తరగతి చదివే పిల్లవాడి తల్లిని కండక్టర్ టికెట్ అని అడిగితే మావోడు ఒకటో తరగతే అని అమ్మ చెబితే.. అమ్మ అమాయకత్వ ఆన్సర్ కి  బస్ ఎక్కినప్పుడల్లా మన చదువు
కవిత్వం

సంక్రాంతి

నగరాలు పట్టణాలు ఖాళీ పల్లెలు రద్దీ పండుగ సంక్రాంతి గొట్టాలు ఊదరగొట్టే వాతావరణం గతం వర్తమానం విషమం పల్లె తరిమితే పట్టణీకరణ  బహుళ అంతస్థులే అభివృద్ధి భ్రాంతుల ప్రజ పండుగకి పల్లెకు పయనం ద్రవ్యం పల్లెల్లో జొరబడింది  ప్రపంచీకరణ తో పల్లె విధ్వంసం పాలు పెరుగు మజ్జిగ నెయ్యి ల మార్పిడి లేదు అంతా పెట్టుబడి సంకలో సేద తీరు రాశుల కొద్దీ ధాన్యం లేదు వాణిజ్య పంటల ధాటికి నేల నిస్సారంగా పెట్టుబడి అమ్మేదే ఎరువు పెంట దిబ్బల్లేవు చెరువు మట్టి తోలేది లేదు అదే నేల కిందికి మీదికి దున్నితే ఏం వుంటది! సారం!! పంటలో
కవిత్వం

మనోభావాలు

శాకమూరి రవి నాకు రాయిని చూపి  రాముడని నమ్మించి  రాజ్యాలేలే చోట  నేను రాయిని 'రాయని'నిజం మాట్లాడితే  వాని మనోభావాలు   దెబ్బతినవా మరి   నాకు మనుధర్మమే  ధర్మమని నమ్మించి మనుషుల మధ్య   మంటల్ని సృష్టించి  రాజ్యాలేలే చోట  నేను మనుధర్మం గుట్టువిప్పితే  వాని మనోభావాలు దెబ్బతివా మరి  నాకు  అశాస్త్రీయాన్ని  శాస్త్రీయమని  నమ్మించి నా అణువణువునా  కర్మసిద్ధాంతాన్ని కరింగించి అందమైన రాజ్యభవనంలో  కునుకుతున్న మనువుకు  నేేను శాస్త్రీయ గీతాలను అందుకుంటే   వాని మనోభావాలు  దెబ్బతినవా మరి.