నల్లింకు పెన్నులో తొణికిన భావోద్వేగాలు
హతీరామ్ రచించిన నల్లింకు పెన్ను పుస్తకం చదివినప్పుడు కేవలం కవిత్వం చదివిన అనుభూతి కాకుండా మనసులో ఒక వేదన మానవత్వంలో ఒక కదలిక అణిచివేతకు వ్యతిరేకమైన స్వరంగా అన్యాయం పట్ల ప్రతిఘటనగా జీవన గాయాలపై ఓదార్పుగా కవి రచనా శైలి సాగింది. ఈ కవి రచన శైలి చాలా ప్రత్యేకం ఆయన కవిత్వంలో అలంకారాలు తక్కువే కానీ ప్రతి పదం వెనుక జీవన సత్యాలు కన్నీళ్లు కనిపిస్తాయి. ఆయన రాసే ప్రతి కవితలో సూటితనం గాఢమైన లోతు కూడా కనిపిస్తుంది తన అనుభవాలను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న సమాజపు అనుభవాలను కూడా పాఠకులకు అనుభవింపచేస్తాడు.. గుండెకు